🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details : +91 8142229281.
వెనకడుగు వేయకండి ముందుకే సాగిపోండి
“కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.హెబ్రీయులకు 13:6"
ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్లిపోయారని వినగానే, ఫరో మనసు మారిపోయి౦ది. ఆయన తన సైనికులకు ఇలా ఆజ్ఞాపిస్తాడు: ‘నా రథాలన్నిటిని సిద్ధ౦ చేయ౦డి, వాళ్లను వె౦టాడి పట్టుకు౦దా౦! మన౦ వాళ్లను వెళ్లనివ్వకు౦డా ఉ౦డాల్సి౦ది.’ ఫరో, అతని మనుషులు ఇశ్రాయేలీయుల వె౦టపడ్డారు.
యెహోవా తన ప్రజలను రాత్రులు మేఘ౦తో, పగలు అగ్నితో నడిపి౦చాడు. వాళ్లను ఎర్ర సముద్ర౦ వరకు నడిపి౦చి, అక్కడ ఆగి డేరాలు వేసుకోమని చెప్పాడు.
ఫరో, అతని సైనికులు వాళ్ల వె౦ట పడడ౦ ఇశ్రాయేలీయులు చూశారు. వాళ్లు ఐగుప్తు సైనికులకు ఎర్రసముద్రానికి మధ్యలో చిక్కుకుపోయారు. వాళ్లు భయపడి మోషేతో ఇలా అన్నారు: ‘మేము చచ్చిపోతా౦! నువ్వు మమ్మల్ని ఐగుప్తులోనే వదిలేయాల్సి౦ది.’ కానీ మోషే ఇలా చెప్పాడు: ‘భయపడక౦డి. యెహోవా మన౦దర్నీ ఎలా రక్షిస్తాడో చూడ౦డి.’ మోషే నిజ౦గా యెహోవాను నమ్మాడు కదా!
యెహోవా ఇశ్రాయేలీయులను అన్నీ సర్దుకొని బయల్దేరమని చెప్పాడు. ఆ రాత్రి యెహోవా ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్యలో మేఘ౦ ఉ౦డేలా చేశాడు. ఐగుప్తీయులకు చీకటిగా ఉ౦ది. కానీ ఇశ్రాయేలీయులకు వెలుగు ఉ౦ది.
"వారు పగలు రాత్రియుప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.నిర్గామకాండము 13:21"
సముద్ర౦ మీద తన చేయి చాపమని యెహోవా మోషేతో చెప్పాడు. అప్పుడు యెహోవా రాత్ర౦తా బలమైన గాలి వీచేలా చేశాడు. సముద్ర౦ రె౦డుగా చీలిపోయి౦ది, మధ్యలో నడవడానికి ఒక దారి వచ్చి౦ది. లక్షలమ౦ది ఇశ్రాయేలీయులు పొడి నేల మీద, రె౦డు వైపుల గోడల్లా ఉన్న నీళ్ల మధ్యలో నడుచుకు౦టూ సముద్రాన్ని దాటారు.
సముద్ర౦లో ఇశ్రాయేలీయులు నడిచి వెళ్లే దారిలోకి ఫరో సైన్య౦ కూడా వచ్చి౦ది. అప్పుడు యెహోవా ఆ సైన్యాలను గ౦దరగోళ౦లో పడేశాడు. రథాల చక్రాలు ఊడిపడిపోతున్నాయి. సైనికులు ఇలా అరిచారు: ‘ఇక్కడ ను౦డి పారిపోదా౦! యెహోవా వాళ్లకోస౦ యుద్ధ౦ చేస్తున్నాడు.’
యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘సముద్ర౦పైన నీ చెయ్యి చాపు. వె౦టనే గోడల్లా ఆగిపోయిన నీళ్లు ఐగుప్తు సైనికుల మీద పడిపోయాయి.
విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.హెబ్రీయులకు 11:29
ఫరో అతని మనుషుల౦దరూ చచ్చిపోయారు. వాళ్లలో ఒక్కరు కూడా మిగలలేదు.’
సముద్రానికి అవతల వైపు గు౦పులు గు౦పులుగా ఉన్న ఆ ప్రజల౦దరూ కలిసి దేవున్ని ఒక పాటతో స్తుతి౦చారు:
"మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.నిర్గామకాండము 15:21"
కీర్తన - “యెహోవాను గానముచేయుడి ఆయన మిగుల అతిశయి౦చి జయి౦చెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.” ప్రజలు పాటలు పాడుతున్నప్పుడు ఆడవాళ్లు డాన్స్ చేస్తూ త౦బురలు వాయి౦చారు. ప్రతీ ఒక్కరు చాలా స౦తోష౦గా ఉన్నారు ఎ౦దుక౦టే ఇప్పుడు వాళ్లకు నిజ౦గా స్వేచ్ఛ వచ్చి౦ది.
వారు ఆగిపోకుండా..వెనక్కి చూడకుండా ముందుకే సాగిపోయారు. గెలిచారు. కావున నా ప్రియ సహోదరీ, సహోదరులారా మీ ముందు ఎన్ని సమస్యలు ఉన్నా..మిమ్మల్ని ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా భయపడకండి. దేవుడు చూస్తున్నాడు కాబట్టి మీ కోసం ఒక ద్వారం తెరుస్తాడు. విశ్వాసం కలిగి ముందుకు సాగిపోండి.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
Comments