🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
దేవుని చిత్తం
యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనములు.
కొంతమంది అంటుంటారు - బ్రదర్ నేను పరిశుద్దంగా జీవిస్తున్నా, విశ్వాసంతోనే అడుగుతున్నాను, వాక్యానుసారంగానే అడుగుతున్నాను అయినా నాకు సమాధానం రావట్లేదేంటి అని ప్రశ్నిస్తుంటారు. దానికి కారణాలు రెండు
(1) దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడం.
(2) నీవు అడుగుతుంది నీ పట్ల దేవుని చిత్తం కాకపోవడం.
ఉదా : నీవు బ్యాంకు జాబ్ అడుగుతుండోచ్చు. అది మంచి జాబే కాని ఆ జాబ్ నీకు యివ్వడం దేవుని చిత్తం కాకపోవచ్చు. అంతకంటే మంచి జాబ్ యివ్వాలని, వేరే జాబ్ యివ్వాలని దేవుడు ఆశ పడుతుండోచ్చు. నీవు లాయర్ కావాలని ఆశ పడుతుండోచ్చు, కానీ దేవుడు నిన్ను దైవజనుడిగా చేయాలని ఆశ పడుతుండోచ్చు. నీవు అమెరికా వెళ్లి చదవాలి అనుకొంటూ ఉండొచ్చు కాని నీవు అమెరికా వెళ్తే ఏమి అవుతావో ఎలా ఉంటావో దేవునికి ముందుగానే తెలుసు. కనుక అది నీకు క్షేమకరం అనిపిస్తే యిస్తాడు, లేకపోతే ఇవ్వడు.
యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరీ, సహోదరుడా దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. గర్భంలో నీవు రూపింపబడక మునుపే దేవుడు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడని గుర్తుంచుకో. (యిర్మియా 1:4)
యోసేపు జీవితాన్ని గమనించినట్లైతే యోసేపు పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఏంటి అంటే యోసేపుని ఐగుప్తుకి ప్రధాన మంత్రిగా చేయాలి అనుకోవడం దేవుని చిత్తం.
యోసేపు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు (ఆదికాండము 39:9). కాని యోసేపు చేయని నేరానికి జైలుకు వెళ్ళాడు. జైలు నుండి బయట పడాలని ప్రార్ధించి ఉండడా? తప్పక ప్రార్ధించి ఉంటాడు. జైలు నుండి బయటికి రావాలని యోసేపు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు తనకు ఒక మంచి అవకాశం వచ్చింది.
పానదాయకుల అధిపతికి ఒక కల వస్తుంది. ఆ కలభావాన్ని యోసేపు వివరిస్తాడు. నీకు క్షేమం కలుగుతుంది. ఆ విధంగా క్షేమం కలుగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ జైలు నుండి బయటపడేలా చూడు అని పానదాయకుల అధిపతికి చెప్తాడు (40:14). యోసేపు చెప్పినట్టే పానదాయకుల అధిపతికి క్షేమం కలుగుతుంది. కాని పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోతాడు. (40:23). ఎంత బాధాకరం. ఒకసారి ఆలోచించండి.
దేవుడు తలచుకొని ఉంటె పానదాయకుల అధిపతిని గద్దించి అయిన యోసేపును జ్ఞాపకం చేసేవాడు. కాని దేవుడు అలా చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత ఫరోకి కలలు వచ్చినప్పుడు ఆ కలభావం ఎవరు వివరించలేనప్పుడు పానదాయకుల అధిపతికి యోసేపు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు చెరసాల నుండి బయటికి వస్తాడు. ఫరో కలభావం వివరిస్తాడు. ఐగుప్తుకు ప్రధాన మంత్రి అవుతాడు. (ఆదికాండము 39,40,41 అధ్యాయాలు చదవండి.)
యోసేపు చేయని నేరానికి అన్యాయంగా జైలుకు వెళ్ళాడు. ఇప్పుడు ఆ జైలు నుండి బయటపడాలి అనుకోవడంలో తప్పులేదు. కాని దేవుడు యోసేపు ప్రయత్నాన్ని సఫలం చేయలేదు. తర్వాత 2 సంవత్సరాలు జైలులో ఉన్నాడు.
ఒకేవేళ దేవుడు పానదాయకుల అధిపతిని వెంటనే గద్దించి యోసేపును జ్ఞాపకం చేసి ఉంటె, తన ప్రయత్నమును సఫలం చేసి ఉంటె యోసేపు తర్వాత ఐగుప్తుకు ప్రధాన మంత్రి అయ్యేవాడు కాదు. పరిస్థితి వేరేల ఉండేది.
కరెక్ట్ గా రెండు సంవత్సరాల తర్వాత యోసేపును జైలు నుండి బయటికి తీసుకొని వచ్చి తాను ఊహించని విధంగా, తనది కాని దేశమందు యోసేపును ప్రధాన మంత్రిగా చేసాడు దేవుడు. హల్లెలూయ.
నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా మన జీవితంలో కూడా గొప్ప ప్రణాళికలని, గొప్ప గొప్ప తలంపుల్ని దేవుడు కలిగి ఉన్నాడు... మనము ఊహించని విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక కొన్నిసార్లు ఎంత ప్రార్ధన చేసిన నేను అడిగింది యివ్వట్లేదని నిరాశ చెందకండి.
యోసేపు జీవితాన్ని చూసారుగా.....
కనుక మనకు ఎప్పుడు జాబ్ ఇవ్వాలో, ఏ జాబ్ ఇవ్వాలో, ఏ జాబ్ యివ్వకూడదో, ఎప్పుడు కష్టాలు తీసివేయాలో, ఎప్పుడు నీ ప్రార్ధనకు జవాబు ఇవ్వాలో, నీవు అడిగింది ఎప్పుడు ఇవ్వాలో, యివ్వకూడదో, ఎలా నిన్ను ఆశీర్వదించి నడిపించాలో దేవునికి బాగా తెలుసు.
" నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది." కీర్తనలు 40:8
కనుక దేవుని చిత్తానికి లోబడి, దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగు, దేవుడు యోసేపు పట్ల తన చిత్తానుసారంగా కార్యాలను జరిగించినట్టు నీ జీవితంలో కూడా కార్యాలను జరిగిస్తాడు.
అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమేన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
8⃣1⃣4⃣2⃣2⃣2⃣9⃣6⃣6⃣1⃣
Comments