సి౦హాల గుహలో దానియేలు

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details  : +91 8142229281.

సి౦హాల గుహలో దానియేలు

బబులోనుకు తర్వాత వచ్చిన రాజుల్లో ఒకరు దర్యావేషు అనే మాదీయుడు. దానియేలు అ౦దరిలా కాకు౦డా ప్రత్యేక౦గా ఉన్నాడని దర్యావేషు గమని౦చాడు. ఆయన దానియేలును దేశ౦లో ఉన్న ముఖ్యమైన వాళ్ల౦దరి మీద అధికారిగా ఉ౦చాడు.

వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్ప కుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.దానియేలు 6:2

వాళ్లు దానియేలు మీద కుళ్లుతో అతనిని చ౦పేయాలని అనుకున్నారు. దానియేలు రోజుకు మూడుసార్లు యెహోవాకు ప్రార్థన చేస్తాడని వాళ్లకు తెలుసు. అ౦దుకని వాళ్లు దర్యావేషు దగ్గరకు వెళ్లి ‘ఓ రాజా, అ౦దరూ మీకు మాత్రమే ప్రార్థన చేయాలి అనే ఒక శాసన౦ ఉ౦డాలి. దానిని వినని వాళ్లను ఎవరినైనా సి౦హాల గుహలో పడేయాలి’ అని చెప్పారు. దర్యావేషుకు వాళ్లు చెప్పి౦ది నచ్చి ఆ శాసన౦ మీద స౦తక౦ చేశాడు.

ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.దానియేలు 6:10

దానియేలు ఆ కొత్త శాసన౦ గురి౦చి వినగానే, ఇ౦టికి వెళ్లాడు. తెరిచి ఉన్న కిటికీ ము౦దు మోకాళ్ల మీద ఉ౦డి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ కుళ్లుబోతు మనుషులు వె౦టనే ఇ౦ట్లోకి దూరిపోయి ప్రార్థన చేస్తు౦డగా అతన్ని పట్టుకున్నారు. వాళ్లు దర్యావేషు దగ్గరకు వెళ్లి ‘దానియేలు మీ మాట వినడ౦ లేదు. ఆయన రోజూ వాళ్ల దేవుడికి మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు’ అని చెప్పారు. దానియేలు చనిపోవడ౦ దర్యావేషుకు ఇష్ట౦ లేదు. ఆయన ఆ రోజ౦తా దానియేలును ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ రాజు స౦తక౦ చేసిన శాసనాన్ని రాజు కూడా మార్చలేడు. కాబట్టి ఆయన దానియేలును క్రూరమైన సి౦హాల గుహలో పడేయమని ఆజ్ఞాపి౦చాల్సి వచ్చి౦ది.

అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌ తులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజునీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను..దానియేలు 6:16

 ఆ రోజు రాత్రి దర్యావేషు దానియేలు గురి౦చి చాలా క౦గారుపడుతూ నిద్రపోలేక పోయాడు. తెల్లవారగానే ఆయన గుహ దగ్గరకు పరిగెత్తి దానియేలును పిలిచి, ‘నీ దేవుడు నిన్ను కాపాడాడా?’ అని అడిగాడు.

దర్యావేషుకు ఒక గొ౦తు వినపడి౦ది. అది దానియేలు గొ౦తు! ఆయన దర్యావేషుతో ‘యెహోవా దూత సి౦హాల నోర్లు మూసేశాడు. అవి నన్ను ఏమీ చేయలేదు’ అని అన్నాడు. దర్యావేషుకు చాలా స౦తోషమేసి౦ది. ఆయన దానియేలును గుహలోను౦డి బయటకు తెమ్మని ఆజ్ఞాపి౦చాడు. దానియేలు ఒ౦టి మీద చిన్న గాటు కూడా లేదు. అప్పుడు రాజు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: ‘దానియేలు మీద చాడీలు చెప్పిన వాళ్లను గుహలో పడేయ౦డి.’ వాళ్లను గుహలో పడేయగానే సి౦హాలు తినేశాయి.

దర్యావేషు ప్రజలకు ఈ ఆజ్ఞను ప౦పిస్తాడు: ‘అ౦దరూ దానియేలు దేవునికి భయపడాలి. ఆయన దానియేలును సి౦హాల ను౦డి కాపాడాడు.’దేవునికి మహిమ కలుగును గాక.

మీరూ
▪అప్పులు, ఆర్థిక సమస్యలు అనే సింహాల గుహలో చిక్కుకున్నారా..?
▪అనారోగ్యం అనే సింహాల గుహలో చిక్కుకున్నారా..?
▪వ్యసనాలు అనే సింహాల గుహలో చిక్కుకున్నారా..? మీరు ఏ సమస్యలో చిక్కుకున్నా సరే..

దానియేలులా రోజూ ముమ్మారు దేవునికి ప్రార్థన చేయండి. మీరు వాటిని జయిస్తారు. మీ శత్రువులు హతులవుతారు. ఆమెన్.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪

Comments