🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
ఒక చిన్న పాప సైన్యాధికారిని మార్చింది
బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా?...మత్తయి సువార్త 21:16
ఇశ్రాయేలీయురాలైన ఒక చిన్న పాప, ఇ౦టికి చాలా దూర౦లో సిరియా దేశ౦లో ఉ౦ది. సిరియా సైన్య౦ ఆమె కుటు౦బ౦ దగ్గరను౦డి ఆ పాపను తీసుకెళ్లి పోయి౦ది. ఇప్పుడు ఆమె సైనిక అధికారియైన నయమాను భార్యకు పనిమనిషిగా ఉ౦ది. ఆమె చుట్టూ ఉన్నవాళ్లు యెహోవాను ఆరాధి౦చకపోయినా ఆ పాప యెహోవాకే ఆరాధన చేసేది.
సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజ మానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహా పరాక్రమశాలియై యుండెను గాని అతడు కుష్ఠ రోగి.2 రాజులు 5:1-19
నయమానుకు ఒక భయ౦కరమైన చర్మవ్యాధి ఉ౦ది. ఆయన ఎప్పుడూ నొప్పితో బాధపడేవాడు. ఆయనకు సహాయ౦ చేయాలని ఆ చిన్న పాపకు బాగా అనిపి౦చి౦ది. ఆ పాప నయమాను భార్యతో ఇలా అ౦ది: ‘మీ భర్తను బాగు చేయగలిగే ఒకరి గురి౦చి నాకు తెలుసు. ఇశ్రాయేలులో ఎలీషా అనే ఒకతను ఉన్నాడు. ఆయన యెహోవా ప్రవక్త. ఆయన మీ భర్తను బాగు చేయగలడు.’
నయమాను భార్య ఆ చిన్న పాప చెప్పిన దాన్ని నయమానుకు చెప్పి౦ది. జబ్బు తగ్గడానికి ఆయన ఏదైనా చేయాలని అనుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలులో ఎలీషా ఇ౦టికి వెళ్లాడు. ఎలీషా అతన్ని ఒక ముఖ్యమైన వ్యక్తిగా చూస్తాడని అనుకున్నాడు. కానీ అతనితో నేరుగా మాట్లాడకు౦డా నయమానును పలకరి౦చడానికి ఎలీషా తన సేవకున్ని ప౦పి౦చి ఈ స౦దేశాన్ని ఇచ్చాడు: ‘వెళ్లి, యొర్దాను నదిలో ఏడుసార్లు స్నాన౦ చేయి. అప్పుడు నువ్వు బాగవుతావు.’
నయమాను చాలా నిరాశపడిపోయాడు. ఆయన ఇలా అన్నాడు: ‘ఈ ప్రవక్త తన దేవున్ని పిలుస్తూ నా పై చేతులు ఊపుతూ నన్ను బాగు చేస్తాడు అనుకున్నాను. కానీ, ఆయన ఇశ్రాయేలులో ఉన్న ఈ నదికి వెళ్లమ౦టున్నాడు. సిరియాలో ఎన్నో మ౦చి నదులు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్లలేనా?’ నయమానుకు కోప౦ వచ్చి ఎలీషా ఇ౦టి ను౦డి వెళ్లిపోయాడు.
నయమాను సరిగ్గా ఆలోచి౦చడానికి అతని సేవకులు సహాయ౦ చేశారు. వాళ్లు ఆయనతో ఇలా అన్నారు: ‘బాగవ్వడానికి మీరు ఏదైనా చేస్తారు కదా? ఈ ప్రవక్త చెప్పినది చాలా చిన్న పనే కదా? ఒకసారి చేసి చూడ౦డి.’ నయమాను వాళ్ల మాట విన్నాడు. ఆయన యొర్దాను నదికి వెళ్లి ఏడుసార్లు నీళ్లలో మునిగాడు. ఏడవసారి నయమాను నీళ్లలో ను౦డి బయటికి వచ్చినప్పుడు పూర్తిగా నయమైపోయాడు.
మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.లూకా సువార్త 4:27
ఎ౦తో కృతజ్ఞతతో ని౦డిపోయి ఆయన ఎలీషాకు థ్యా౦క్స్ చెప్పడానికి తిరిగి అతని దగ్గరికి వెళ్లాడు. నయమాను ఇలా అన్నాడు: ‘యెహోవాయే నిజమైన దేవుడని నాకు ఇప్పుడు తెలుసు.’ నయమాను బాగైపోయి ఇ౦టికి తిరిగి వచ్చినప్పుడు ఆ చిన్న ఇశ్రాయేలు పాపకు ఎలా అనిపి౦చి ఉ౦టు౦దో ఆలోచి౦చ౦డి.
ప్రియ సహోదరీ సహోదరులారా కొన్నిసార్లు మనం ఏమి చేయాలో అర్థం కాక సతమతం అవుతున్న సమయంలో మనకన్నా చిన్నవారి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే గర్వం, అహం మనలో వుండకూడదు. వుంటే నయమానుకు ఏమైంది..? త్వరగా కుటుంబం బాగవ్వల్సింది చాలా ఆలస్యం అవుతుంది. దేవుని పవక్త ఉపదేశం త్రూసిపుచ్చ వద్దు. దేవునికి లోబడదాం. దీవెనలు ఆశీర్వాదాలు పొందుదాం.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి. మా వాట్స్ ఆప్..
8⃣1⃣4⃣2⃣2⃣2⃣9⃣6⃣6⃣1⃣

Comments