దేవుని మనిషి

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

దేవుని మనిషి

ప్రభువైన యేసక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు.

తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.అపొ. కార్యములు 13:22

దావీదు అనగానే మనకు బాగా పరిచయమైనా వ్యక్తి అనే భావాన కలుగుతుంది,దేవుని గ్రంధంలో ఆ ఒక్క భక్తుని పేరు 1106  సార్లు వ్రాయబడింది.ఈ భక్తుని జీవితాన్ని ఎందుకు ఇన్ని సార్లు వ్రాయించాడు,కారణం లేకపోలేదు,దాదాపుగా నా లాంటి హృదయం కలిగిన వాడు, అని హృదయ పరిశోదకుడైన దేవుడే అన్నాడు,కాని దావీదు మన లాంటి స్వభావం కలిగినవాడే,అయన హృదయం జీవితం అంతలా రూపాంతరం చెందటానికి చాల కాలమే పట్టి ఉంటుది.ఆ వ్యక్తిని అంతటి భక్తుని గా నిలపటానికి ఉన్న చాల కారణాలలో ఒక కారణం మనం ఆలోచన చేద్దాం,అంతకు ముందుగా,, మనం ఎలా వున్నాం?పరిశిలించుకుందాం ప్రియులారా. ఎన్ని పరిచర్యలు, విస్తారమైన సభలు ,లెక్కలేని సంఘములు, కోకొల్లలుగా భోధకులు, అసంఖ్యాక మైన పుస్తకాసాహిత్యం ,వ్యాఖ్యానాలు గ్రంధాలు,ఇలా ఎన్ని వున్నకాని...కాని..దావీదులాంటి వారు ఎక్కడున్నారు.. మనం ఎందుకిల మారి పోతున్నాం ,జారిపోతున్నాం. కారణాలు చూద్ధాం..

▪ 1.దైవిక కోరిక

కీర్తనలు 63:1-8 యుదా అరణ్యములో దావీదు రచించిన స్వానుభవ కీర్తన, నీళ్ళు లేక ఎండిన దేశమందు, అని వ్రాశాడు,ఇంగ్లీష్ లో weary అని వుంది, అలసి పోయాను అన్నాడు, ఏ కారణాన? నీ మీది ఆశ చేత నిన్ను చూడాలి అని ,దావీదు మనసంత దేవుని పైనే,ప్రాణము, శరీరము దేవుని తో సాంగత్యం కొరకు తహ తహ లాడుతున్నాయి,అలా అలవాటు చేసాడు, తన ప్రాణానికి శరీరానికి , అరణ్యం లో ఉన్నా, భయం ఆవరించి ఉన్నా,పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా,దేవుని కోరుకున్నాడు,4 వచనములో..నా  జ్ఞాపకం నీవే నా ధ్యానం  నివే, నా గానం నీవే , నా ఆధారం , నా త్రుప్తి , అన్ని నీవే ప్రభువా అని కీర్తించాడు, అంతగా ఆయనను కోరుకున్నాడు,దేవుని రుచి నీ ఎరిగినవాడు,ఆయనలోని మాధుర్యాన్ని అనుభవించిన ఎవరైనా బహుశా ఇదే మాటలు పలుకుతారేమో...!ప్రియులారా ఆయన పై  మక్కువ ఉందా ,,,దేవునికి మన హృదయం తెలుసు, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఉదయాన్నే ఆయనను ఎదుర్కోవాలని ప్రాణం కోరుకుంటుందా,,,ఆలోచిద్దాం పదవులపై ఉన్న కోరిక ,పేరు కై ఉన్న కోరిక, పేగు భందం పై ఉన్న కోరిక , ప్రాణమిచ్చిన ,మన ప్రాణ నాధుని పై ఉన్నదా? 42 , వ  84  వ కీర్తనలలో కోరహు కుమారులు ,దేవుని పై తమకు ఉన్న తృష్ణ ను గూర్చి గానం చేసారు, అలసిన జీవితాలకు ఆయనను అలవాటు చేస్తే, త్రుప్తి చెందుతాయి, ఆయన పేరు మదిలో తలచిన అదొక మధురమైన భావన కలిగిస్తుంది,ఆ అనుభూతిని పొందుతున్నామా ,,పొందక పోయిన పొందినట్టు నటిస్తున్నామా?..ఆయననే కోరుకుందాం ఆయనతోనే త్రుప్తి గా ఉందాం..అయన ద్వారానే విశ్రాంతి పొందుదాం.

▪ 2.దైవిక నేత్రాలు

కీర్తనలు 101:3, 7,వచనాలు ,నా కన్నుల ఎదుట దుష్కార్యం కాని , భక్తి తొలగిన వారు  కాని అబద్దికులు కాని , ఉండనియ్యను  అన్నాడు, దావీదు కన్నులు వారిని గుర్తు పడతాయి ,2 సముయేలు 16:10,19:22, శారిరులను గుర్తించే కన్నులు దావీదువి ,స్వంత సహోదరి కుమారులైన, తన సేనదిపతి అయినా,దావీదు, యోవాబు తో ఏకిభవించ లేదు, కారణం దావీదు, యోవాబు శరీరీ  అని ఎరిగిన వాడు, ఎన్నడు సేరుయ కుమారులను ప్రోత్సహించలేదు,వారి తో అన్న మాట, నాతో మీ కేమి పొందు , ఎంత మాదిరికరమైన మాట, సౌలు హతమైన తర్వాత , అమలేకియుడొకడు, బహుమానం కొరకై, సౌలు ను నేనే హతము చేసితినని చెప్పి దావీదు ను సంతోష పరచాలి అనుకొన్నాడు, కాని దావీదు, వాడు అమలేకియుడని ( ద్వితియోప . కా 25:17- 19) వాని చంపటం ,ఆశ్చర్యం కలిగిస్తుంది,కారణం తెలుసా , అమలేకియులు శరీరాన్ని బట్టి పుట్టిన వాడు, క్రీస్తు రాకను(జేష్టత్వాన్ని) తిరస్కరించిన ఎశావు మనుమడు, ప్రారంభం నుండి దేవుని పిల్లలకు శ్రమను కలిగించిన వారు,వారి యాత్రను అడ్డగించారు,(1సముయేలు15 )సౌలు అక్షరార్ధం గా అమలేకియులపై గెలిచినా ఆత్మీయంగా వీరి చేతిలో ఓడిపోయాడు,సౌలు రాజ్యాన్ని కొల్పవటానికి వీరే కారకులు, అందుకే చంపాడు,మంచి వారి గానే కనిపిస్తారు,నేటికి వీరే సమస్యలకు కారకులు , ఈ శారిరుల ద్వారానే, అత్మియులకు సమస్యలు,కాని వీరిని గుర్తించలేని అంధత్వం లో అనేకులు వీరి చేతిలో మోసపోతున్నారు, వీరిని గుర్తించే నేత్రాలు ఆ నాడు, దావిదుకున్నవి, మరి మనకు,వీరు మన ప్రక్కలోనే ఉంటారు,మేలు కలిగించే వారిగానే కనిపిస్తారు, కాని వీరు కనిపించనీ ప్రమాదకరమైన శత్రువులు, వారెవరైనా , మన వారైన,శారిరులను ప్రోత్సహించ కూడదు, ప్రియులారా, వారిని గుర్తిద్దాం...

▪ 3.దైవిక హృదయం

*దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుముకీర్తనలు 139:23*

కీర్తనలు 139:23-24 ,దేవుని వైపు తిరిగి ఆయనకు హృదయాన్ని చూపిస్తూ, చూడు ప్రభువా నా హృదయం పరిశీలించు ,,అని అడగ కలిగే ధైర్యం ఎవరికీ ఉంటుంది అండి!..దావీదు ఆ మాట పలక గలిగాడు, మనుష్యులతో కాదు  దేవునితోనే, సౌలు హతమైతే దావీదు సంతోషిస్తాడని  ఆ వార్త తెచ్చిన అమలేకియుడు తలంచాడు, కాని దావీదు, అంగలార్చాడు,,ప్రతిగా సౌలును గూర్చి ధనుర్గీతం రచించి ఇశ్రయేలియులకు నేర్పించాడు, ఎలా సాధ్యం ,16 సంవత్సారాలు నిష్కారణంగా తనను చంప వెదకిన వాని గూర్చి ఏమని పాడాడో చదవండి  2 సముయేలు 1:19-24 వరకు ,తనకు హాని కలిగించిన వానిలో (“నీకు భూషణమైన వారు “) సౌందర్యాన్ని చూసాడు  ,చంపాలి అని ప్రయత్నించిన సౌలు లో గొప్ప తన్నాన్ని చూసాడు,,సౌలు ను గూర్చి, అతడు, మీకు మేలుచేసాడు, అని పాడాడు, ఎన్నడు, సౌలుకు విరోధంగా ఒక్క మాట పలికినట్టు ఎక్కడ లేదు,అదే దైవిక హృదయం, అబ్నేరు మరణిస్తే పాడే వెంట నడిచాడు, దుశించిన షిమి అను వానిని చంపక క్షమించాడు, ఎలా సాధ్యం,అది దేవుని హృదయం,కక్షను, పగను లోపల ఉంచుకోనదు,ప్రియులారా,మనం ఎలా ఉన్నాం?...మనసు నిండా అసూయా ద్వేషం , పగ, కక్షలు,క్రోధం.క్షమించమని అడిగినా క్షమించలేని తనం ,మనది అసలు భక్తేనంటారా......?భ్రమలో ఉన్నామా!..అందరిని ప్రేమిద్దాం, ఏమి చేసిన.. ప్రేమిద్దాం,ఏమనిన ప్రేమిద్దాం...క్షమిద్ధాం..మన ప్రభువు వలే..ఆ ప్రేమ హృదయాన్ని కలిగి ఉందాం.....

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.

CHRIST TEMPLE-PRODDATUR
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి. మా వాట్స్ ఆప్.
8⃣1⃣4⃣2⃣2⃣2⃣9⃣6⃣6⃣1⃣

Comments