వివాహ బంధం

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details  : +91 8142229281.

వివాహ బంధం

🔹 భార్యాభర్తల మధ్య ఉన్న వివాహ బంధం ఒక ఘనమైన "ప్రేమ" బంధం.

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను;..హెబ్రీయులకు 13:4

వివాహ బంధం ప్రాముఖ్యత

👉ఇద్దరు కలిసి క్రొత్త జీవితం ప్రారంభించి, ఒక కుటుంబంగా అభివృద్ధి అగుటకు.

👉ఒకరి బలహీనతలు ఒకరు భరించటానికి,

👉ఒకరి బలహీనతలు ఒకరు సరిచేసుకోటానికి,

👉 వారు కలసి ముందుకు వెళ్ళటానికి దోహదపడుతుంది.

👉 వివాహబంధంలో ఏకమనస్సు ఉండాలి. లేకుంటే అది చాలా కష్టం సుమీ....

📖 వాక్యం చెబుతుంది "గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది" అని (సామెతలు 31:10 ).
అంతేకాకుండా ఈ సామెతలు గ్రంథము 31వ అధ్యాయం మొత్తం మనం చదివితే ఇలా వ్రాయబడియుంది.

🔺గుణవతియైన భార్య ముత్యం కంటే విలువైనది అని....
🔺ఆమె తన భర్త నమ్మకత్వాన్ని పొందుకుంటుంది అని....
🔺ఆమె బ్రతికినంత కాలం తన భర్తకి మేలుగా ఉంటుంది అని....
🔺ఆమె శ్రేష్టమైన ఆహారం తన కుటుంబానికి అందిస్తుంది అని...
🔺ఆమె మంచి గృహనిర్వాహకురాలుగా వ్యవహరిస్తుందని అని....
🔺ఆమె తన ధనంతో లాభసాటి పనులు చేయును అని....
🔺ఆమె అనేకులకు సహాయం చేయును అని....
🔺ఆమె భవిష్యత్తు గురించి సిద్ధపాటు కలిగి ఉండును అని....
🔺ఆమె కృప గల మాటలు జ్ఞానం గల మాటలు పలుకును అని....
🔺ఆమె తన భర్త మెప్పును పొందుకుంటుంది అని.... వ్రాయబడింది.

ఇవే కాదు ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయములో వ్రాయబడ్డాయి.
ఈ 31వ అధ్యాయము రాజైన లెమాయేలు తల్లి అతనికి చెప్పిన మాటలు...

 ఈ రాజైన లెమాయేలు మద్యపానం, వ్యభిచారంలాంటి బలహినతలలో పడినప్పుడు... “భార్య” యొక్క విలువను ఆమె రాజైన ఈ లెమాయేలుకు ఈ 31వ అధ్యాయంలో ఇలా వివరంగా చెప్పింది.

💎 ఈ అధ్యాయము చదివినప్పుడు ఇలాంటి భార్య కొరకు శ్రద్ధ కలిగి కనిపెట్టటం కూడా చాలా ముఖ్యం అని అనిపించకమానదు. ఎందుకంటే అట్టివారు దొరుకుట అరుదు అని వాక్యం చెబుతుంది.

👉 నా ప్రియ స్నేహితులారా.... గమనించండి.
ఇది నిజం...
అమూల్యమైన ముత్యమువంటి భార్య దొరుకుట అరుదు.

👉 దేవుని మాటలను పక్కన ఉంచి తనకి - తన భర్తకి శాపాన్ని తీసుకొచ్చిన ఒక భార్య ఉంది.... ఆమె హవ్వ....

👉 తన భర్త దైవిక దర్శనాన్ని స్పష్టంగా చూడలేక పోయిన ఒక భార్య ఉంది.... ఆమె శారా....

👉 తన భర్త అడుగుజాడలలో నడువలేక తడబడిన ఒక భార్య ఉంది.... ఆమె లోతు భార్య....

👉 భర్త తగ్గింపు జీవితాన్ని అవమానంగా భావించిన ఒక భార్య ఉంది.... ఆమె మీకాలు....

👉 భర్త పై అధికారము తీసుకుని రాజ్యము చేసిన ఒక భార్య ఉంది.... ఆమె యెజెబెలు....

👉 భర్త సంపన్నుడిగా ఉన్నపుడు మెచ్చుకుని, భిదవాడిగా మారినప్పుడు దూషించిన ఒక భార్య ఉంది.... ఆమె యోబు భార్య....

👉 భర్తను మాయ చేసి అన్యాచారాల ఊబిలో పడవేసిన భార్యలు ఉన్నారు.... వారే సొలోమోను భార్యలు....

👉 భర్త తప్పు చేస్తే ఆ తప్పును సరిచేయ్యలేకపోగా ఆ తప్పులో భాగస్వామిగా మారిన ఒక భార్య ఉంది.... ఆమె సప్పిరా....

 ఇలా ఇంకా ఏందరో....

👉 నా ప్రియ స్నేహితులారా....గమనించండి.

వీరు అందరు వారి వారి పరిధిలో ఘనులే...

 కానీ చిన్న చిన్న బలహీనతలతో సంపూర్ణులుగా కాలేక పోయారు....
భార్య ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించలేక పోయారు....

👉 గమనించండి భార్యగా శారా తల్లికి ఒక రిమార్క్ వుంది. ఏంటో తెలుసా.. అబ్రహాముని హగారుతో పంపినప్పుడు ఆ ఒక్క రిమార్క్ స్థిరపడింది.

🌼 గమనించండి.... "భార్య" అనే రెండు అక్షరాలు; "జీవితం" అనే మూడు అక్షరాలను స్వర్గంగాను, నరకంగాను మార్చగలదు.

💎 బాధలలో, కష్టాలలో నీతోపాటు నడిచే భార్య నీకు అశీర్వాధకరము....

💎 వ్యాధులలో, అవమానములలో నీతో నిలిచే భార్య నీకు అశీర్వాధకరము....

💎 జీవితాంతం నీకు, నీ కుటుంబానికి మేలుకరముగా ఉండే భార్య నీకు అశీర్వాధకరము....

💎 నీ కుటుంబంలోనూ, నీలోను, నీ దైవిక దర్శనంలోను పాలిభాగస్తురాలుగా ఉండే భార్య నీకు అశీర్వాధకరము....

💎 అట్టి భార్య అమూల్యమైన ముత్యము వంటిది....

👉ఇలాంటి భార్య దొరికిన వారికి మేలు దోరికినట్లే.

🔺 మీరు వివాహం కానీ వారు అయితే అట్టి వివాహ బంధం కొరకు దేవుని చిత్తములో కనిపెట్టడం మంచిది.

 🔺 మీకు వివాహం అయి ఉంటే ఇప్పటికే మీ ఇంట నిలిచిన అట్టి ముత్యాన్ని వివాహ బంధాన్ని కంటికి రెప్పలా చూసుకోవటం బహు మంచిది.

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక. ఆమెన్.

▪ CHRIST TEMPLE-PRODDATUR ▪

Comments