🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
రాహాబను వేశ్య విశ్వాసం
విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.హెబ్రీ 11:31
'రాహాబు' తన శరీరాన్ని అమ్ముకొని, దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని జీవించే స్త్రీ.
👉అట్లాంటి స్త్రీ, దేవుని గురించి తానిస్తున్న సాక్ష్యం, దేవుని పట్ల ఆమెకున్న అచంచలమైన విశ్వాసమును రుజువు చేస్తుంది.
👉యెరికోను వేగు చూడడానికి వెళ్ళిన మనుష్యులు ఆమె ఇంటికి వెళ్ళారు.
👉అదేంటి? వారు వేశ్య ఇంటికి వెళ్ళడం?
🔹ఆ దినాలలో వేశ్యా గృహాలలో రాత్రి బస చేయడానికి గదులు ఉండేవి. అందు నిమిత్తం వెళ్లివుండ వచ్చు.
👉 లేదా అనేక మంది అక్కడకి వస్తూ పోతూ వుంటారు కాబట్టి వారికి కావలసిన సమాచారం దొరుకుతుందని వెళ్లియుండ వచ్చు.
🔸లేదా ఆమె కుటుంబాన్ని రక్షించడానికి దేవుడే వారిని అక్కడకి పంపి యుండవచ్చు.
ఏది ఏమయినా?
👉రాహాబు మాత్రం తన ఇంటికి వచ్చిన వేగువారిని ఆ దేశ సైనికుల కంటబడకుండా దాచిపెట్టి,
👉ఆతర్వాత ఆ వేగువారితో ఈ రీతిగా మాట్లాడుతుంది.
యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.
మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా ...
మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.
మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.
యెహోషువా 2: 9-11
👉ఎంతటి అచంచలమైన విశ్వాసము రాహాబు మాటల్లో కనిపిస్తుంది?
సంవత్సరాలు తరబడి దేవుని మాటలు వింటూనేవున్నాం!
కాని,
దేవుని పట్ల అటువంటి భయముగాని,
అటువంటి విశ్వాసము గాని మన జీవితాల్లో ఏకోశానా లేదే?
👉వేశ్యగా సమాజములో అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, ఆమె విశ్వాసం తనతో పాటు, తన కుటుంబమంతటిని రక్షించ గలిగింది.
అంతేకాదు,
ఆమె విశ్వాసం ఆమెకు 'పరిశుద్దుడును, మన ప్రియ రక్షకుడునునైన' యేసు క్రీస్తు వంశావళిలో ఒక ప్రత్యేకమైన స్థాన్నాన్నిచ్చింది.
👉ఇంత గొప్ప ధన్యతకు కారణం?
ఆమె పరిశుద్ధత, నీతి ఎంతమాత్రమూ కారణం కాదుగాని, 'ఆమె విశ్వాసమే'.
👉మనమయితే,
అవిశ్వాసులుగానే ఉంటూ, ఆశీర్వాధాలు అనుభవించ లేకపోతున్నామా?
వద్దు!
ప్రతీ పరిస్థితియందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం!
ధన్యకరమైన జీవితాన్ని జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
హల్లెలూయ...
మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!
🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Comments