దెయ్యం పడితే అలా ప్రవర్తిస్తారా..


🕎 *CHRIST TEMPLE-PRODDATUR*🕎 

Telugu Bible Sermons by Pastor.Nakkolla Balasubramanyam ( Daniel)

దెయ్యం పడితే అలా ప్రవర్తిస్తారా..?

"ఆయన దోనే దిగగానే, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను" (మార్కు 5:2). 

ఒక వ్యక్తికి దెయ్యము పట్టబడడం మీరు నమ్ముతారా ?

 నేను నమ్ముతాను – తప్పకుండా నమ్ముతాను! 

చాలా దెయ్యాలున్నాయని బైబిలు బోధిస్తుంది. 
అపొస్తలుడైన పౌలు వాటిని గూర్చి అన్నాడు, 

 "ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని... ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో" ఎఫెస్సీయులకు 6:12 

 "వాడు ఎల్లప్పుడును, రాత్రి పగలు, సమాధులలోను, కొండలలోను, కేకలు వేయుచు, తన్ను తానూ రాళ్లతో గాయ పరచుకొనుచు నుండెను" (మార్కు 5:5). 

ప్రియ స్నేహితులారా గమనించండి..ఆ దెయ్యం పట్టిన వ్యక్తి ఎలా ప్రవర్తించాడు..? బాగా ధ్యానించి ఆలోచించండి. 

ఈ లక్షణాలు వుంటే దెయ్యం మిమ్మలని కూడా పట్టి నాశనం చేస్తుందని గ్రహించండి.

 1.ఇంటి గురించి ఆలోచన లేదు

ఈ దినాలలో అనేకమంది యవ్వనస్థులు, పెద్దవారు ఇంటి గురించి ఆలోచన లేకుండా జీవిస్తున్నారు అవును ప్రేమ అని కొందరు, ఫ్రెండ్స్ అని కొందరు, పార్టీలు అని మరికొందరు, అక్రమ సంబంధాల ఆనందాలలో మరికొందరు, త్రాగుడుకు బానిస అయ్యి రాత్రంతా ఎక్కడో కూలిపోయి కుటుంబం వుంది అందులో ప్రేమ పంచే కుటుంబ సభ్యులు ఉన్నారు అని ఆలోచనే లేకుండా అనేకమంది వ్యసనాలలో ( సమాధులలో) నలిగిపోతున్నారు. ఇలా చేయడం తప్పు అని తెలిసీ కూడా చేస్తున్నారు... ఇలా జరగడానికి కారణం..? దెయ్యం.

 2. కేకలు వేయడం.

 కేకలు..అవును ఈ కేకలు ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో వున్న వారి మొదలుకొని 60 సంవత్సరాల వయసు ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరూ ..చిన్న సమస్యకు..పెద్ద సమస్యకు. మంచి చెప్పినా .. కేకలు వేయడంతో వారిలో ఉన్న కోపం కట్టలు తెంచుకుంటోంది. తల్లి తండ్రుల మాటకు విలువ ఇవ్వకుండా..తిరగబడి మాట్లాడుతూ.. ఇంట్లో వున్న వారి గొంతులు వీధిలోకి వినబడుతున్నాయి...ఇలా చేయడం తప్పు అని తెలిసీ కూడా చేస్తున్నారు. ఇలా జరగడానికి కారణం..? దెయ్యం.

 3.తమను తాము గాయపరుచుకోడం 

చాలామంది యవ్వన పురుషులు, స్త్రీలు బ్లేడులతో కోసుకుంటున్నారు. విషం త్రాగుతున్నారు, ఉరి వేసుకుని తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కన్న తల్లి తండ్రి గుర్తురావడం లేదు. ఎందుకలా చేస్తున్నారో తెలుసా.. నేను టెలివిజన్ లో ఒక యుక్త వయస్కురాలు చూసాను, అలా మళ్ళీ మళ్ళీ తన చేతులు కోసుకుంటుంది. తనలా ఎందుకు చేసిందని ప్రశ్నించు వాడు అడిగాడు. తాను చెప్పింది, "నాకు తెలియదు. అలా చెయ్యాలని ఎవరో బలవంత పెడుతున్నారట. ఆమె అంటోంది నేను ఆపలేను..నేను చచ్చిపోతా..అని. ఇలా చేయడం తప్పు అని తెలిసీ చేస్తున్నారు అంటే కారణం..? ఆ దెయ్యం. 

ఇప్పుడు ఆ యవ్వన స్త్రీకి యేసు క్రీస్తు అవసరము! క్రీస్తు ఆ సాతాను బంధకాన్ని విరిచేయగలడు! ఇలాంటి యవ్వనస్తులు బహు జాగ్రత్తగా ఉండండి. ఇలా మీకు అనిపించినప్పుడు వెంటనే ప్రార్థన కోసం మమ్మల్ని సంప్రదించండి. మా వాట్స్ ఆప్ నెంబర్: క్రైెస్ట్ టెంపుల్ (ప్రొద్దుటూరు) 8142229661.

 మన పాఠ్యభాగములోని ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు! దయ్యాలు అతనిని తన కుటుంబము నుండి ఒంటరి స్థలానికి తీసుకెళ్లాయి యేసు ఎదుర్కొన్న వ్యక్తి సమాధులలో ఒంటరిగా ఉన్నాడు. అతడు మరియు పైన తెలియచేసిన వారు అందరూ... దయ్యాల అదుపులో ఉన్నారు. 

వీరికి ప్రార్థన చాలా అవసరం. ఒంటరిగా ఉండడం చూసి ఇలాంటి దెయ్యాలు ఇలా పిచ్చి..పిచ్చి..ఆలోచనలు కలిగించి ప్రార్తన లేకుండా , వాక్యం లేకుండా..ఆ దెయ్యాల సాధనాలు వారికి పరిచయం చేసి రాత్రీ పగలు తేడా లేకుండా చాటింగ్ అని, సినిమా అని, నా ప్రాణ స్నేహితులు తో మాట్లాడకుండా ఉండలేను అని సమయం వృధా, కాలక్షేపం చేయడానికి ప్రతి చేతిలో ఒక ఆండ్రాయిడ్ పెట్టింది. వారు వారి స్వాధీనంలో లేకుండా చేస్తాయి. కాబట్టి మీ సెల్ ఫోన్ కంప్యూటర్ వదిలి పెట్టాలని నేను చెప్పడం లేదు. కానీ నేను చెప్తున్నాను, "ఆయంత్రాలు మిమ్ములను అదుపు చేయకూడదు! జాగ్రత్త.

నిజమైనఆత్మీయ స్నేహితులను చేసుకోవడానికి ఆ దెయ్యముల నుండి విడుదల పొందడానికి, ప్రభువుతో సమయం గడపడానికి చాలాకాలము కంప్యూటర్ , చాటింగ్ వదిలి పెట్టండి. సమాధులలో ఉన్న అతని గూర్చి ఆలోచించు. ఇంటి నుండి స్నేహితుల నుండి దురాత్మలు అతని పారద్రోలాయి,    సమాధులలో భయంకర దుస్థితిలో అతడు జీవించాడు; దయ్యపు శక్తులు ఆవరించినప్పుడు అతడు తనను కోసుకున్నాడు, అప్పుడు యేసు వచ్చి బందీని విడుదల చేసాడు. యేసు వచ్చినప్పుడు సైతాన్ శక్తి విరిగిపోయింది; 

   యేసు వచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచి వేయబడతాయి.ఆయన విచారము తొలగించి జీవితాన్ని మహిమతో నింపుతాడు. యవ్వనస్థులారా, మన క్రైెస్ట్ టెంపుల్ సంఘములోనికి రావాలని నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఆదివారము ఉదయము ఇక్కడ ఉండండి. మాతో కలిసి ఆరాధనలో పాల్గొనండి! మేము ప్రమాణము చేస్తున్నాము – మేము మీ ఆత్మీయ స్నేహితులుగా ఉంటాం! మీరు మాతో కలిసి ప్రార్థనలో ఉంటే మీరు ఒంటరిగా ఉండరు! ఆమెన్! 

ఆ దెయ్యం పట్టిన వ్యక్తి "గట్టి స్వరంతో, అన్నాడు, యేసు... సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధ పరచుకుమని దేవుని పేరిట నీకు ఆన బెట్టుచున్నానని, బిగ్గరగా కేకలు వేసెను" (మార్కు 5:7). 

అతడు యేసును గూర్చి భయపడ్డాడు. అది, ఈనాటి, యవ్వనస్థులలో కనిపిస్తుంది. యేసయ్య ఈ సంఘము ద్వారా మీకు ఆత్మీయ సహాయము చేస్తాడు. కానీ మీరు భయపడతారు! ప్రార్థనలో వుండడానికి, మందిరానికి రావడానికి మీకు ఇష్టం వుండదు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ప్రతివారం ఆరాధనలో కొన్ని గంటలు గుడిలో మాతో గడపడానికి భయపడతున్నారు. ఇది నాకు చాలా విచారము కలిగిస్తుంది. మీ భయాలు సాతాను నుండి వచ్చినవని నాకు తెలుసు. మిమ్మల్ని ఆ దెయ్యం ఎందుకు అలా చెయ్యాలి? 

ఎందుకంటే అతనికి తెలుసు మీరు అతని విడిచి మా దగ్గరకు వస్తే మీరు సమస్యల నుండి విడుదల పొందుతారని..మీరు మీ కుటుంబంతో గొడవలు లేకుండా సంతోషంగా వుంటారని..తిరిగి ప్రతి రోజు యేసు నొద్దకు వస్తారని తెలుసు. అందుకే ఆ దెయ్యం కు భయం. క్రీస్తు సాతాను నుండి నిన్ను విడుదల చెయ్యగలడు! క్రీస్తు మీకు జీవితాన్ని శక్తిని ఇవ్వగలడు! క్రీస్తు మీ జీవితాన్ని మార్చగలడు! యేసు క్రీస్తు నొద్దకు దారి చూపడానికి మాకొక అవకాశము ఇవ్వండి! మీరు ఒంటరిగా కుమిలి పోవద్దు. మీకు ఒక సహవాసం కావాలి. ప్రతి వారం మీకు ప్రార్థనలు కావాలి.

 అది క్రైెస్ట్ టెంపుల్ మీకు అందిస్తుంది. తిరిగి రండి మీకు బైబిల్ నుండి మార్గము చూపిస్తాం! ఒకరనవచ్చు, "నేను దెయ్యాలను లేక సాతాను నమ్మను."అని. అది సరే. ఒకప్పుడు నేను కూడ వాటిని నమ్మలేదు. కానీ అది ప్రాముఖ్య విషయము కాదు. అతి ప్రాముఖ్యమైన విషయము యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం, మేము కూడ మిమ్ములను ప్రేమిస్తున్నట్టుగా భావించడం! దేవుని అద్వితీయ కుమారుడైన క్రీస్తు నందు, మీ విశ్వాసం ఉంచండి, ఆయన సిలువపై తన మరణము ద్వారా మిమ్ములను రక్షిస్తాడు ఎప్పటికీ నిత్యత్వమునకు ఆయన మీ కొరకు పాప పరిహారార్ధము పరిహారముగా ప్రాణం ఇచ్చాడు.

 మంచి నిర్ణయం తీసుకో సంతోషంగా ఉండు. ఆమెన్! 

దేవుడు మిమ్ములను దీవించి కాపాడును గాక. ఆమెన్.

  🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Comments