అతి సుందరమైన ఇజ్రాయేల్ దేశం

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎


అతి సుందరమైన ఇజ్రాయేల్ దేశం

యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కీర్తనలు 122:6

 ప్రియ స్నేహితులారా యెరూషలేము గురించి ప్రార్థించినా, ధ్యానించినా మనం వర్ధిల్లుతాము. ఎందుకో తెలుసా అది దేవునికి ఇష్టమైన దేశం. 

దేవుని కన్నులు నిరంతరం ఆ దేశం మీద వున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో వున్న జెరూసలేం గురించి ధ్యానిద్ధాం. 

జెరూసలెం ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది? జెరూసలెం.. అతి పురాతన చారిత్రక నగరం. ఇది మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?

 ఈ క్రమాన్ని తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే. కొన్ని దశాబ్దాలుగా వివాదాలకూ నిలయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నగరం జెరూసలెం. వీటన్నింటికి మించి ఇది మూడు మతాలకు పవిత్ర ప్రదేశం. జెరూసలెం తమ రాజధాని అని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. 

తాజాగా అమెరికా దీన్ని అధికారింగా గుర్తించేందుకు సిద్ధమైంది. దీన్ని పలు ముస్లిం దేశాలతో పాటు, అమెరికా మిత్ర దేశాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు మతాలకు పవిత్రస్థలం పురాతన జెరూసలెంలో మూడు మతాలకు చెందిన పవిత్ర కట్టడాలు ఉన్నాయి. 

ఇందులో డోమ్ ఆఫ్ ది రాక్, అల్ అక్సా మసీదు ముస్లింలకు చెందినవి. వెయిలింగ్ వాల్ యూదులకు పవిత్రమైనది. హోలీ సపుల్కా చర్చిని క్రైస్తవులు పవిత్రంగా భావిస్తున్నారు.అతి పురాతనమైనది ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాలలో జెరూసలెం ఒకటి. దీనికి ఎంతో చరిత్ర ఉంది. 

ఈ నగరానికి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. హిబ్రూ భాషలో దీన్ని 'యేరుసలాయిం' అంటున్నారు. అరబిక్‌లో 'అల్ కుద్' అని పిలుస్తున్నారు. కొన్ని శతాబ్దాల పాటు ఎన్నో దండయాత్రలకు, దాడులకు జెరూసలెం నిలయంగా ఉంది. 

ఈ నగరాన్నిజయించిన వారు ఎన్నోసార్లు ధ్వంసం చేశారు. పూర్తిగా నేలమట్టం చేశారు. అనేక సార్లు నిర్మించారు. జెరూసలెం మట్టిలోని ఒక్కో పొర ఒక్కో చరిత్రకు సాక్ష్యంగా ఉన్నాయి.

ఇక్కడ నివసిస్తున్న భిన్న మతాల ప్రజల మధ్య ఉన్న అంతరాల గురించే.. కథలు, కథనాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. కానీ వీరందరినీ కలిపి ఉంచే ఏకైక సూత్రం జెరూసలెం పవిత్రతే. 

క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, ఆర్మేనియన్లకు చెందిన ఎన్నో చారిత్రక కట్టడాలు జెరూసలెం పాత నగరంలో ఉన్నాయి. ఇవన్నీ పక్కపక్కనే ఇరుగుపొరుగులా కనిపిస్తుంటాయి. చర్చి హోలీ సపుల్కా చర్చి.. క్రైస్తవులకు అతి పవిత్రమైన కట్టడాలలో ఒకటి. 

బైబిల్ ప్రకారం ఏసు క్రీస్తు జీవిత చరిత్రకు ఈ ప్రాంతానికి విడదీయరాని సంబంధం ఉంది. క్రీస్తు శిలువ, మరణం, పునరుత్థానం వంటివి దీనితో ముడిపడి ఉన్నాయి. ఇక్కడి కల్వరి పర్వతంపై క్రీస్తును శిలువ వేసారన్నది క్రైస్తవుల విశ్వాసం. మరణం తరువాత ఈ చర్చిలోనే క్రీస్తు పునరుత్థానం చెందినట్లు క్రైస్తవులు నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది క్రైస్తవులు ప్రతి ఏడాది ఇక్కడి క్రీస్తు సమాధిని దర్శించుకుంటారు. 

అల్ అక్సా మసీదు జెరూసలెంలో ముస్లింలకు రెండు పవిత్రమైన కట్టడాలు ఉన్నాయి. ఒకటి డోమ్ ఆఫ్ ది రాక్. రెండోది అల్ అక్సా మసీదు. ముస్లింలకు అతి పవిత్రమైన మూడో కట్టడం అల్ అక్సా మసీదు. మక్కా నుంచి జెరూసలెం చేరుకున్న మహమ్మద్ ప్రవక్త ఈ మసీదులోనే ప్రార్థనలు చేశారనేది వారి విశ్వాసం. ఈ మసీదు కొన్ని అడుగుల దూరంలో డోమ్ ఆఫ్ ది రాక్ ఉంటుంది. 

ఇక్కడి నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి పోయాడని వారు నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో ప్రతి శుక్రవారం వేలాది ముస్లింలు ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. వెయిలింగ్ వాల్ యూదులకు 'వెయిలింగ్ వాల్' ఎంతో పవిత్రమైనది. మౌంట్ మోరియా చుట్టూ ఉన్న నాలుగు గోడల్లో ఇది ఒకటి. రెండో యూదు మందిరాన్ని ఇక్కడే నిర్మించారు. మందిరంలోని అంతర్భాగాన్ని యూదులు 'అతి పవిత్ర ప్రదేశం' (హోలీ ఆఫ్ హోలీస్)గా భావిస్తారు.

 దేవుడు లోకాన్ని సృష్టించేటప్పుడు తొలి రాయిని ఈ గోడ వద్దే వేసినట్లు యూదులు నమ్ముతారు. దేవుడి ఆదేశం ప్రకారం అబ్రహాం తన కుమారుడు ఇసాక్‌ను ఈ గోడ వద్దే బలి ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు యూదులు విశ్వసిస్తారు. ముస్లింలు పవిత్రంగా భావించే డోమ్ ఆఫ్ ది రాక్ తమ మత కట్టడంగా చాలా మంది యూదులు భావిస్తారు. అదే అసలైన 'అతి పవిత్ర ప్రదేశం' (హోలీ ఆఫ్ హోలీస్)గా నమ్ముతున్నారు. వెయిలింగ్ వాల్‌కు దగ్గర్లోనే ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తారు. తమ వారసత్వాన్నిగుర్తు చేసుకుంటారు. ఏడింతలు ఎక్కువగా దిగుబడి సాధిస్తున్న దేశం ఇజ్రాయెల్.   మీకు తెలుసా? ఇజ్రాయెల్ సైన్యంలో ముస్లిం సైనికులు కూడా వున్నారు. రోజంతా రంజాన్ సందర్బంగా వాళ్ళు ఉపవాసముంటే సాయంత్రం ఉపవాస దీక్ష విడిచే సమయానికి వారికోసం ఇజ్రాయెల్ ప్రభుత్వమే విందు ఏర్పాటు చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశం!! 

ఇరాన్,ఇరాక్,సౌదీ,దుబాయ్,మస్కట్,బహరేన్,కువైట్, ఖతార్,జోర్దాన్,ఈజిప్ట్,సిరియా,లెబనాన్,లిబియా వంటి 13  ఎడారి దేశాల మధ్య వున్న అతి చిన్నది, కానీ అత్యంత శక్తివంతమైనది,శాంతివంతమైనది ఇజ్రాయెల్ దేశం.చుట్టూ  వున్న 13 దేశాల జనాభా పది కోట్లకు పైగానే ఉంటుంది కానీ ఇజ్రాయెల్ జనాభా  80 లక్షలు మాత్రమే. అయినా, ఇజ్రాయెల్ అంటే వారికి మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ హడల్!! అత్యంత ప్రాముఖ్యమైన విషయమేమిటో తెలుసా? ఆ 13 దేశాల్లో 10 దేశాలకు పెట్రోల్, డీజిల్ వంటి చమురు నిల్వలు పుష్కలంగా వున్నాయి, వారి సంపదకు కారణం చమురు. కానీ ఆ దేశాల నడుమనే వున్నా, ఇజ్రాయెల్ లో ఒక్క చుక్క కూడా చమురులేదు. అయినా చమురున్న ఈ పది ముస్లిం దేశాల ర్యాంకు అంతర్జాతీయ అభివృద్ధి సూచీ( IDI)లో ఖతార్ తో మొదలై 30  ఆ తర్వాతే ఉంటే, ఇజ్రాయెల్ ర్యాంకు మాత్రం 18. దేవుడు వారికి మరో 30 ఏళ్లలో పూర్తిగా అంతరించిపోయే చమురునిల్వలివ్వలేదు. ఎన్నటికీ అంతరించిపోని ప్రతిభా పాటవాలనిచ్చాడు, ధైర్య సాహసాలనిచ్చాడు. 

కంప్యూటర్లు,ఇంటర్నెట్ తో సహా ప్రపంచంలో నేటి అభివృద్ధికి  కారణమైన పరికరాలన్నింటినీ దాదాపుగా యూదులే కనుగొన్నారు.అంటే మొత్తం 750 కోట్ల మంది ప్రపంచ ప్రజల  జీవితాన్ని సుఖమయం,అభివృద్ధిదాయకం చేసిన వారు ప్రపంచ జనాభా లో వెయ్యవ వంతు కూడా లేని 80 లక్షల మంది యూదులే  అన్నమాట. యూదులు తమ దేశమైన ఇజ్రాయెల్ ను అత్యంత పటిష్టమైన దేశంగా, దుర్బేధ్యమైన కోటగా మార్చుకున్నారు. ఇజ్రాయెల్ కు  1948 లో అంటే మన తర్వాత ఒక ఏడాదికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ ఈ 70 ఏళ్లలో చాలా బలమైన, అవినీతిరహితమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ఒక పేదవాడు ఫిర్యాదు చేసినా SI special పోలీసు అధికారి నేరుగా దేశ ప్రధానిని కూడా ఇంటరాగేట్ చేసే అధికారాన్ని వారి రాజ్యాంగం ఇచ్చింది. అందుకే క్రైమ్ రేట్ లో ఆ దేశం అట్టడుగున ఉంటుంది. బంధుప్రీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇద్దరు ప్రధాన మంత్రులు జైలు శిక్ష పొందారు. వారిలో ఒకరికి శిక్ష విధించినప్పుడు  ఇజ్రాయెల్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా ఒక ముస్లిం వున్నాడు!!! ప్రజాస్వామ్యమంటే అదీ!! 

ప్రపంచంలోని ముస్లిందేశాలన్నింటికీ ఇజ్రాయేలును ప్రపంచ పటం నుండి రూపు మాపాలన్నదొక్కటే  ధ్యేయం! కానీ ఇంతవరకైతే అది సాధ్యం కాలేదు కానీ ముస్లిం దేశాలే ఒక దేశం పైకి  మరొకటి దాడులు చేసుకొని తన్నుకొంటున్నాయి. 

పాకిస్థాన్ లో ఐసిస్ వరుస దాడులకు పాల్పడుతోంది. ట్యునీషియా, లిబియా,సిరియా, దక్షిణ యెమెన్, లెబనాన్ వంటి పేద ముస్లిం దేశాలు అంతర్యుద్ధాల్లో చిక్కి, శాంతి కరువై, ఆకలి చావుల కోరల్లో వున్నాయి. పక్కనే వున్న ఇజ్రాయెల్ మాత్రం పటిష్టంగా, శాంతికరంగా వుంది. వారి దేశంలో మూడింట రెండవ వంతు సేద్యానికి వీలుకాని ఎడారి ప్రాంతం. పైగా నీళ్లు కూడా అంతగా లేవు. అయినా వున్న కొద్దీ నీటితోనే కొద్దీ భూమిలోనే తమ తెలివి తేటలతో అత్యధికంగా పంట దిగుబడి వచ్చే పద్ధతుల్లో వ్యవసాయం చేసి స్వయం సమృద్ధిని పొందడమే కాక పాలు,కూరగాయలు,పళ్ళు యూరోప్ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది.

ఇండియాలో కన్నా ఎకరానికి ఏడింతలు ఎక్కువగా దిగుబడి సాధిస్తున్న దేశం ఇజ్రాయెల్.(ఈ సందేశం బీబీసీ తెలుగు నుండి సేకరణ) హల్లెలూయ..

ఇంత గొప్ప చరిత్ర కలిగిన దేశం ఇశ్రాయేల్ దేశం. ఇది దేవుని దేశం. 

ఈ సందేశం చదివిన మిమ్ములను దేవుడు దీవించును గాక. ఆమెన్. 

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Comments