హ్యాపీ ఫ్యామిలీ

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

హ్యాపీ ఫ్యామిలీ 

  💞 ప్రతి బార్యా భర్తలు తప్పకుండా చదవవలసిన మెసేజ్ 💞 

కుటుంబం అనేది దేవుడు తన ప్రణాళికలో మానవునికి ఏర్పాటు చేసిన గొప్పవరం. ఏ కుటుంబం అయితే దేవుడు నియమించిన అధికార క్రమంలో ఉంటుందో! ఆ కుటుంబం దేవుని అధికారాన్ని గౌరవించినట్లు. విశ్వాసి యొక్క కుటుంబ జీవితం చాల ప్రాముఖ్యమైనది. అనేకమంది విశ్వాసులు వ్యక్తిగత భక్తి విషయంలో మంచి సాక్ష్యం కలిగి ఉండి, కుటుంబం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. దేవునికి లోబడటాన్ని ఒక విశ్వాసి వ్యక్తిగతంగా, కుటుంబంలో మరియు సంఘంలో సాధన చేయాలి. కుటుంబంలో బార్యా,భర్తలు పాత్ర, బాధ్యతల గూర్చి విపులంగా బైబిల్ లో పలుచోట్ల చెప్పబడింది. 

క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. (ఎఫెసీ 5:23, 24) 

యవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము.(తీతుకు 2: 4,5) 

అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;... అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరు ను యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు. (1 పేతురు 3:1, 5, 6). 

కొన్ని కుటుంబాలలో మాత్రం పైకి లోబడే వారిలా ఉన్నా అంతరంగంలో మాత్రం తిరుగుబాటు స్వభావంతో ఉంటారు. అసలు లోబడటాన్ని నేటి తరం అపార్ధం చేసుకున్నంతగా మునుపెన్నడూ జరగలేదేమో! ముఖ్యంగా చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పైచేయి సాధిస్తున్నామని స్త్రీ సాధికారతను ఓ గొప్ప విప్లవంగా, సామజిక మార్పుగా వర్ణిస్తున్న ఈ రోజుల్లో భార్యాభర్తల సంబంధాన్ని బైబిల్ దృక్పధంలో అర్ధం చేసుకోవడం ఈ జెనెరేషన్ కి చాలా కష్టం అయిపోయింది. కేవలం చదువు, సంపాదన, స్థాయి మొదలగు వాటిని పోల్చి స్త్రీ, పురుషుల సంబంధాల్ని కొలవలేము. వెంటనే వచ్చే ప్రశ్న "అయితే మమ్మల్ని బానిసలుగా ఉండమంటారా? అని. దేవునికి మనం బానిసలుగా గతిలేని పరిస్థితుల్లో లోబడ్డామా? లేక దేవున్ని ప్రేమించి ఇష్టంతో లోబడ్డమా? రెండింటిలో చాల వ్యత్యాసం ఉంది. ఇది అర్ధం అయితే భార్య లోబడటాన్ని అర్ధం చేసుకోగలరు. ఆర్ధిక స్వాతంత్ర్యం కానివ్వండి, సామాజిక స్వాతంత్ర్యం కానివ్వండి, అది ఎంతటి అధునాతనమైన మార్పు అయినా కూడా, దేవుడు నియమించిన అధికార క్రమంలో ఉన్నప్పుడే ప్రభువు దాన్ని అంగీకరించేది. ఆ పరిధిని దాటితే అది తిరుగుబాటు తప్ప మరొకటికాదని గ్రహించాలి. 

అందుకు ఒక ఉపమానం చూద్దామా.. 

భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని టిఫిను తింటున్నారు......

భార్య భర్తను ఇలా అడిగింది. 

" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా?

 " భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?

 భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకుని వెళ్తూ.... పిల్లలతో హోం వర్కు చేయిస్తూ.......వారితో గడుపుతూ......నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసుకుందామని.....అంటూ కాస్త భయంగానే అడిగింది. 

భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే! నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి. భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి చిన్న ఇల్లు కానీ పెట్టలేదుకదా!

 భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు. 

భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి. 

భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు...... అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు. ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య. 
ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం.....కన్నీళ్ళు నిండిన కళ్ళతో చదవసాగింది.

 ప్రియమైన కుమారునికి...... ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను. కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! 

ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......

 మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది. బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేసాను.మీ నాన్న చాలా బిజీ అయ్యారు. వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా ఉన్నది. తరువాత అన్నీ ఎదురుచూపులే! 

మీ నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు. 

మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం. 

ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు......

 మీ రాక కోసం ఎదురుచూపు......... 

ఇలా మీరు పెద్దవారైపోయారు.......

నాతో మాట్లాడటానికి కూడా సమయం ఉండేది కాదు...అవసరానికో మాట అంతే,,,,,, ఉద్యోగాలు వచ్చేశాయి 

మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనా నాతో మాట్లాడుతారేమో అని ఎదురుచూపు......... మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు........

రాగానే అలసిపోయి భోంచేసి పడుకుంటారు......

వంట బాగుందనికానీ బాగలేదనికానీ చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు..... మీ నాన్న వ్యాపారాన్ని నీకు అప్పచెప్పారు.......నువ్వుకూడా బిజీ అయిపోయావు.

 నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది. ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు...... 

మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని. 

చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది. నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. 

బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. 

మీ నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతే పేపరు చదవడానికి టైం ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైం ఉండదు మీ నాన్నకు....మా సంగతి సరే సరి.... వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో ఇక అనారోగ్యం. 

ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......

 ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........ 

నాలా నీ కూతురో .కొడుకో ఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను... 

ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే బ్రతుకుకుందనీ గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ భార్యను బాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో! 

నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు......

ధనార్జనతో వారిని నిర్లక్షం చేయకు........

ఇదే నా చివరి కోరిక....

కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త...... నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! 

తనకూ ఒకమనసు ఉంటుందనీ అందులో మీరే ఉంటారనీ.....తననేశ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందనీ అర్థం చేసుకో! 

మనిషిగా ముందు గుర్తించు యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళదీయనీయకు.........

నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను. ఇట్లు మీ మంచికోసమే ఎదురుచూసే నీ తల్లి,. 

దయచేసి మీ కుటుంబంతో గడపండి......వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..

మీ కుటుంబమే మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దని నా విన్నపము. 

ప్రియ స్నేహితులారా..అర్థం అయ్యిందా దేవుడు నీకు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడో.. 

భర్త కుటుంబంలో యజమానిగా బాధ్యతయుతంగా తన పాత్రను పోషించవలసి ఉంటుంది. 

సంఘం కొరకు క్రీస్తు ప్రాణం ఇచ్చినంతగా భార్యను భర్త ప్రేమించాలి, సన్మానించాలి అని వాక్యం సెలవిచ్చింది. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక (1 పేతురు 3:7) 

పైన మనం ధ్యానించిన ప్రకారం ప్రభువుని సేవించి వెంబడించే విషయంలోను, మన సాక్ష్యం విషయంలోను అన్ని విషయాలలో ప్రభువు నియమించిన అధికారం క్రింద ఉండాలి. కాని, దేవుని ప్రేమించే విషయం లోను, విశ్వాస సంబంధమైన విషయాలలో మాత్రం, దేవునికే ప్రధమస్థానం ఇవ్వాలి. 

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

  🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Comments

Popular posts from this blog

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

దావీదు దేవుని హృదయానుసారుడు..కానీ..

ప్రార్థన మందిరం