గాడిదవలే గడ్డి మేయాల్సి వచ్చింది

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details  : +91 8142229281.

గాడిదవలే గడ్డి మేయాల్సి వచ్చింది

గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.
కీర్తనలు 119:20

👉దేవుని వాక్యాన్ని అనుసరించేవారికి గర్వము వుండదు.

ఎందుకంటే?

👉 వారి అతిశయం ఏదైనా వుందంటే?
అది దేవునియందే.

👉నీవు ఈలోక యోగ్యతలను బట్టి అతిశయిస్తున్నావంటే? గర్విస్తున్నావంటే?
వాక్యానుసారమైన జీవితం నీలో లేనట్లే.

🔺గర్విష్ఠులను ఆయన గద్దిస్తాడు.

👉నీ హృదయం గర్వముతో నిండివుంటే?

🔺 పతనం అంచుల్లో వున్నావని జ్ఞాపకము చేసుకో.

గర్విష్ఠులు తొట్రిల్లి కూలిపోతారు

నాశనమునకు ముందు గర్వము నడచును.
       సామెతలు 16:18

గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.
       యిర్మియా 50:32

♻ నెబుకద్నెజరు హృదయము గర్వముతో నిండిపోయినప్పుడు ఏడు సంవత్సరాలు గాడిదవలే గడ్డి మేయాల్సి వచ్చింది.

నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించువారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
        దానియేలు 4:37

దేవుని ఆజ్ఞలు విడచి తిరిగేవారు ఆయన సన్నిధిలో నిలవలేరు

న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.
            కీర్తనలు 1:5

డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు
            కీర్తనలు 5:5

గర్విష్ఠులు, డాంబికులు ( గొప్పలు చెప్పుకొనేవారు) దేవుని సన్నిధిలో నిలవలేరు. వారు పొందే ప్రతి ఫలం శాపము.

శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
        మత్తయి 25: 41

దావీదు గారు సమస్యలు వచ్చినప్పుడు , ధనము విస్తారముగా వున్నప్పుడు ఒకేమాధిరి వున్నాడు. గర్వం లేకుండా జీవించి దేవుణ్ణి మహిమపరిచాడు.

నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.
       కీర్తనలు 119:17

👉దావీదు కష్టం, నిందలు, శ్రమలు, వేదనలో ఉన్నట్లు ఈ మాటలను బట్టి మనకు అర్ధమవుతుంది.
*అయినప్పటికీ, వచ్చిన కష్టాలను బట్టి కృంగిపోయే స్వభావం ఆయనది కాదు.

👉 శ్రమ వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో ఆయనకు బాగా తెలుసు.

శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని మాటలను తలపోసుకొంటూ ఆయనపైనే ఆధారపడడం దావీదు యొక్క లక్షణం. అది మన జీవితాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం.

👉మనమైతే?

🔺శ్రమ కలిగినప్పుడు ఆయన చెంతకు చేరతాము.

🔺 ఆయన దయ చూపించి మనలను ఆ శ్రమ నుండి విడిపించినప్పుడు,

🔺 ఇక ఆయననే మరచిపోతాము.

రాజైన దావీదు అయితే, శ్రమ నుండి నేను విడిపింప బడినప్పుడు, ఆయన వాక్యమును బట్టి నడచుకొంటాను అంటున్నాడు.

👉ఆయన వాక్యమును అనుసరించగలిగితే?

🔺నిందల నుండి మనలను తప్పిస్తాడు.

నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొలగింపుము.
        కీర్తనలు 119:22

👉ఆధికారులు తనని ఎట్లా నాశనం చెయ్యాలా అని మీటింగులు పెట్టి మాట్లాడుకుంటుంటే?

🔺ఈయన మాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడట.

అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.
         కీర్తనలు 119:23

👉దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, అనుసరించగలిగితే?

నీ ప్రతీ ప్రశ్నకు ఆయనే సమాధానం.

నీ ప్రతీ సమస్యకూ ఆయనే పరిష్కారం.

👉అందుకే దావీదు ఒక నిశ్చయతలోనికి వస్తున్నాడు.

శ్రమ కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి.

అట్లా చెయ్యడం ద్వారా ఆ దుఃఖం ఆనందముగా మలచబడుతుంది. అది ఆయన వ్యక్తిగత అనుభవం.

ఒక్క విషయం!!

ఆయన మాటలే నిన్ను జీవింపజేసేవి. ఆయన మాటలే నిన్ను నిత్య జీవానికి నడిపించేవి.

అట్టి గ్రహింపులోనికి మనము వచ్చి, ఆయన మాటలయందు ఆనందించే వారముగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!

ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం!
ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిద్ధాం.ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪

Comments