🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details : +91 8142229281.
ఏదైనా పొందాలి అంటే ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి
ఈ ఉపమానం జాగ్రత్తగా గ్రహించండి.
నీరు ఎక్కడా కనబడటం లేదు . ఎండమావులు తప్ప ఎక్కడా నీటి జాడ కనబడటం లేదు . తన జీవితపు ఆఖరు దశకు చేరాను అని అతడికి తెలిసిపోతోంది . ఈ రాత్రి గడవదు . రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా ? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేక పోతున్నాడు .
దూరంగా ఒక గుడిసె లాంటిది కనబడింది . అది నిజమా ? తన భ్రమా ?
ఏమో ! నిజమేమో ! అక్కడ తనకు నీరు దొరకవచ్చేమో ! చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలి అని అనుకున్నాడు
శక్తిని కూడదీసుకున్నాడు . తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు .
ఎదురుగ అతడు అనుకున్నట్టుగానే ఒక గుడిసె కనబడుతోంది . దానిని సమీపించాడు . అక్కడ ఎవరూ లేరు . బహుశా దానిని వదిలిపెట్టి ఉంటారు . లోపలికి వెళ్ళాడు
అక్కడ ఒక నీటి పంపు(బోరింగ్) కనబడింది . దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది . దాని దగ్గరకి వెళ్లి దానిని కొట్టాడు .
నీరు రావడం లేదు . శక్తి అంతా ఉపయోగించి దానిని కొట్టాడు . ప్రయోజనం లేదు . నిరాశ నిస్పృహ ఆవరించాయి .
ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపొయింది . కళ్ళు మూసుకుపోతున్నాయి
ఒక మూలగా ఒక సీసా కనబడింది . దానిలో నీరు ఉంది . మూత గట్టిగా బిగించి ఉంది . మూత విప్పి దాన్ని ఎత్తిపెట్టి తాగుదామని పైకి ఎత్తాడు .
దానికి ఒక కాగితం కట్టబడి ఉంది . దానిమీద ఇలా రాసి ఉంది .
“ ఈ బోటిల్ లో నీరు బోరింగ్ పంపులో పొయ్యండి . పంపు కొట్టండి నీరు వస్తుంది . మీరు మళ్ళీ ఈ బాటిల్ నింపి పెట్టండి "
అతడికి సందేహం కలిగింది .
ఈ నీరు తాగెయ్యడమా ?
బోరింగ్ పంపులో పోయ్యడమా ?
ఎంత కొట్టినా రాని నీరు ఈ బాటిల్ లో నీరు పోస్తే వస్తుందా ?
ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమిప్ కాను ?
చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బ్రతక వచ్చు .
అందులో పోసేస్తే తన మరణం ఖాయం .
ఏమి చెయ్యాలి ?
ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు .
ఒక నిశ్చయానికి వచ్చాడు .
నీళ్ళను పంపులో పోశాడు .
బోరింగ్ పంపు కొట్టడం మొదలు పెట్టాడు .
ఆశ్చర్యం .
నీరు ఉబికి పైకి తన్నుకు వచ్చింది .
దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు . నీళ్ళు తాగి మళ్ళీ బోటిల్ నింపాడు .
మూలన పెట్టాడు .
తన కూడా తెచ్చుకున్న నీటి బాటిల్ నింపుకున్నాడు .
ఆ గుడిసె లో ఎడారి మేప్ కనబడింది .
తను ఎటు వెళ్ళాలో చూసుకున్నాడు . బయలుదేరాడు .
మిత్రులారా !
ఈ కథ మన జీవితాలను ప్రతిబింబిస్తోంది కదూ !
👉ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి
👉ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి
👉నువ్వు ఇవ్వకుండా దేనినీ పొందలేవు .
✳ డబ్బు విషయములో నమ్మకస్తుడు ఎవరు?
👉 నెల నెల ఎంతో ఆదాయం సంపాదిస్తూ కొంత అయిన దేవునికి ఇవ్వనివాడు నమ్మకస్తూడా?
👉 సంపాదనలో ఎక్కువ తానే వాడుకొని బార్య బిడ్డలను సరిగా చూడని వాడు నమ్మకస్తూడా?
👉 నశించున్న ఆత్మల కోసం కొంత కూడా ఖర్చు పెట్టనివాడు
👉 తినడానికి, త్రాగడానికి ఖర్చు పెడుతూ, అధ్యాత్మిక అంశాలకు ఖర్చు పెట్టనివాడు నమ్మకస్తుడా?
👉 జేబులో డబ్బులు దాచుకొని, దేవునికి ఇవ్వండి అనేవాడు నమ్మకస్తుడా?
కానే కాదు
✳ డబ్బు విషయములో అనుసరించవలసిన విధులు
👉 సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేసి అప్పుల్లో పడకుందాం! (సామెతలు 22:7, ద్విథి15:6)
👉 లాటరీ, చీట్లు, వడ్డీకిచ్చుట, లంఛము పుచ్చుకొనుట లాంటి తప్పుడు పద్ధతులలో డబ్బు సంపాదించ కుండా ఉందాం (యోబు 15:34, కీర్తన 15:5)
👉 శరీర అవసరాల కోసమే కాక, అధ్యాత్మిక అవసరాల కోసం ఖర్చు పెడదాం. (Matthew 6:31-35)
👉 దేవుని భాగం దేవుని కిద్ధాం!
(సామెతలు 3:9-10, ప్రసంగి 5:4-5)
👉 ధనం సమృద్ధిగా ఉన్నపుడు దేవుని మరువకుందాం!
(ద్విథి 8:11-14)
👉 బీదలను మరువకుందాం!
(సామెతలు 19:17)
👉 ధనాపేక్షా లేకుండా ఉందాం!
(1తిమోతి 6:10)
👉 దేవునికి గొప్పలకు కాక కృతజ్ఞతతో ఇద్ధాం!
(ఆఁపొ 5:1-10)
👉 పరలోకంలో మనం ధనం సంపాదించు కుందాం!
(Matthew 6:19-21)
👉 అంత దేవుని వలనే కలిగింది అని గ్రహిద్ధాం!
( యాకోబు 1:17)
👉ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి .
👉 దేవుని భాగము దేవునికి ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి
👉నువ్వు ఇవ్వకుండా దేనినీ పొందలేవు .
👉రక్షణ అనే జీవజలాన్ని పొందిన మనం అదే రక్షణని అందరూ పొందేలా ఆత్మలపట్ల భారం కలిగి ఉండాలి.
సామెతలు 11 : 30 - నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము "జ్ఞానముగలవారు" ఇతరులను రక్షించుదురు..
👉 మీ కష్టజీతo విలాసవంతమైన జీవితం గడిపేవారికి కాక కష్టం లొ ఉన్నవారికి, అపదలోవున్న సేవకునికి, దేవుని పని నమ్మకం గా చేస్తున్న సేవకునికి, ఆకలి తో ఉన్న సేవకునికి సొంత మందిరాలు గృహాలు లేని సేవకునికి, సహాయం చేసిన యెడల దేవునికి కి నిజమైన కృతజ్ఞతలు చెల్లించినవారము అవుతాము.
ఆలోచించండి బైబిల్ చదవడం ప్రకటించడం కాదు దేవునికి కావలసింది పాటించడం.
అట్టి కృపా ధన్యత మన అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగును గాక. ఆమెన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
Comments