🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details : +91 8142229281.
🔹బిడ్డలు పరీక్షలలో ఓడిపోతే ఇది గద్దించుటకు సమయము కాదు.
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.యాకోబు 1:5
👉మనము కూడా ఆ సమయములో గద్దింపకూడదు.
👉 వారికి కావలసినది ప్రోత్సహం.
👉దానికి బదులుగా మనము అతడిని గద్దించుట ద్వారా అతడిపై ఒత్తిడి ఇంకా ఎక్కువ చేస్తున్నాము.
ఒకవేళ బిడ్డలు చురుకుగా లేకపోతే గద్దించక ప్రోత్సహించ వలెను.
'బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము'-కీర్తనలు 127:3
👉దేవుని వాక్యమునకు లోబడి ప్రతి బిడ్డను దేవుడిచ్చిన బహుమతిగా విలువ నివ్వవలసియున్నది.
🔹మనము బిడ్డ కొరకు ముందుగా ఉద్ధేశించక పోయినా దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు.
🔹మనము మన బిడ్డల తప్పులను, ఓటములను ఎప్పుడైనను బహిరంగ పర్చకూడదు.
🔹లేక వారిని బహిరంగముగా కించపర్చ కూడదు.
మంచి తల్లిగా , తండ్రిగా ఉండుటకు ఎంతో జ్ఞానము కావలసి యున్నది.
అనేక మంది ఓడిపోయి వెనక్కు జారిపోయిన బిడ్డలు వారి తల్లి, తండ్రి నమ్మకమైన ప్రోత్సాహం ద్వారా తిరిగి ప్రభువు యొద్దకు రాబట్టబడినారు.
👉గనుక తల్లి, తండ్రి విసుకక దేవుని యొక్క వాగ్దానములను పట్టుకొనవలెను.
👉 బిడ్డలతో ఎక్కువ సమయమును గడిపి మనము వారితో కలిసి ప్రోత్సాహకరంగా మాట్లాడిన వారు మనసులు తెరచి వారి సమస్యలను మనతో పంచుకొందురు.
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; 1 కొరింథీయులకు 13:4
మీ పిల్లలతో మీరు ఆత్మీయంగా, ప్రేమగా.. మాట్లాడండి. ప్రోత్సహించండి.
👉అప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో మునిగి పోకుండా దానిని జయించునట్లు వారిని ప్రోత్సాహపర్చవచ్చును.
మన బిడ్డలు ఎదుగుచూ ఉండగా, వారిని మనము పరిపక్వత చెందిన పెద్ద వారిగా చూస్తూ వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనము ఇవ్వవలెను.
వారు ఒకప్పటివలె చిన్న బిడ్డలుగా చూడకూడదు. అప్పుడు వారు మీకు స్నేహితులుగా ఎదుగుదురు మరియు వారు మనకు దూరముగా ఉండరు.
మన బిడ్డలు ఎదుగుచూ ఉండగా, వాక్యములో వాగ్దానములలో ఉండిన సత్యములు మనకు మనము ఋజువు చేసికొనుటకు అనేక అవకాశములు వచ్చును.
మన బిడ్డలను దేవునికి దినదినము అప్పగించుకొని ఆయనపై ఆధారపడి జీవించినట్లయితే, దేవునికి మన యెడల ఉండిన ఆలోచన మరియు ఆయన మన యెడల చూపిస్తున్న సంరక్షణ మనకు సజీవమైన యదార్థతగా నుండును.
♻ ఈ క్రింది విషయాలు ప్రతి తల్లి, తండ్రి తప్పక గుర్తుంచుకోవాలి.
🔸 ''ఎప్పుడైతే పిల్లలు విమర్శలతో జీవించుదురో వారు ఖండించుట నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు బంధింపబడినట్లు జీవించుదురో అప్పుడు వారు పోట్లాటను నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు హేళనతో జీవించుదురో అప్పుడు వారు సిగ్గుపడుటను నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు అవమానముతో జీవించుదురో అప్పుడు వారు నేరభావనతో ఉండుట నేర్చుకొందురు.
🔸 ఎప్పుడైతే బిడ్డలు సహింపబడుతూ జీవించుదురో అప్పుడు వారు ఓర్పును నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు ప్రోత్సాహముతో జీవించుదురో అప్పుడు వారు నమ్మకము కలిగియుండుటను నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు భద్రతలో జీవించుదురో అప్పుడు వారు విశ్వాసము కలిగియుండుటను నేర్చుకొందురు.
🔸 ఎప్పుడైతే పిల్లలు న్యాయముగా చూడబడుతూ జీవించుదురో అప్పుడు వారు న్యాయమును నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు మెచ్చుకొన బడుచూ జీవించుదురో అప్పుడు వారు ఇతరులను మెచ్చుకొనుట నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు ఆమోదింప బడుచూ జీవించుదురో అప్పుడు వారు వారిని అంగీకరించుట నేర్చుకొందురు
🔸 ఎప్పుడైతే పిల్లలు స్నేహముతో జీవించుదురో అప్పుడు వారు ప్రేమించుట నేర్చుకొందురు''
👉 ''........దానితో నేను ప్రేమగా మాటలాడెదను....శ్రమగలలోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను''(హోషేయ 2:14,15)
👉బిడ్డలను పెంచుట మనకు గొప్ప ఆత్మీయ పరిపక్వతగా కూడా నుండును.
👉మరియు ఇది మన బిడ్డల యొక్క ఆత్మీయ జీవితమునకు కూడా ఉపయోగకరముగా నుండును.
మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక ఆమేన్ !!!
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
Comments