అవసరాలకేనా దేవుడు?
🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
అవసరాలకేనా దేవుడు?
మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభములు తెలియజేస్తున్నాను.
భూమి మీద వాక్యానుసారమైన విశ్వాసం కలిగి ఉండువారు చాలా కొద్దిమంది అనే చెప్పాలి.
యోబు 2:10- అందుకు యోబు-మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా,కీడును మనము అనుభవింప తగదా అనెను. పై మాటలోని సారాన్ని నేటి క్రైస్తవ్యం నిజంగా గ్రహించగలిగితే దేవుని వలన మేలులు అనుభవించడానికి అలవాటు పడ్డ వీరు ఇక మీదట కీడును కూడా అనుభవించటానికి సిద్దపడాలని అర్థమగుచున్నది.. మేలు జరిగితేనే దేవునిని నమ్ముతావా? లేకుంటే నమ్మవా??? నీకు ఉద్యోగం వచ్చింది గనుక ప్రభువును నమ్ముకున్నావని చెప్పుకుంటున్న నీవు ఒకవేళ రోగమే ముదిరితే ప్రభువును స్వికరించవా????తీరా ప్రభువును నమ్ముకున్న తర్వాత ఉన్న ఉద్యోగం పోతే ,లేని రోగం నీకు వస్తే, నీ బిడ్డలు ఫెయిల్ అయితే , నువ్వు అనుకున్నవి నెరవేరకపోతే మందిరానికి వెళ్లడమే మానేస్తావా, నీకు అనుకూలంగా సేవకుడు వుండాలా..? లేక సేవకు పిలిచిన దేవునికి అనుకూలంగా వుండాలా..? నమ్మిన ప్రభువును వదిలేస్తావా? ఎన్ని రోజులు అయ్యింది ప్రార్థన చేయక, ఎన్ని రోజులు అయ్యింది మందిరానికి వెళ్లక, ఎన్ని రోజులు అయ్యింది సేవకుడు నిన్ను పిలుస్తూ... కేవలం మేలులను అనుభవించడానికే సిద్దపడ్డ ఈ క్రైస్తవులు అస్సలు క్రైస్తవులoటారా...?
క్రీస్తు సిలువ మీద నిస్సహాయునిగా చనిపోతూ నా దేవా ,నా దేవా నన్నెలా చేయి విడిచితివి అని ప్రశ్నించినప్పుడు దేవుడు అంత కీడు జరుగుతున్నా ఎందుకు చలించకుండా ఉన్నాడో ఎప్పుడైనా ఆలోచించారా...?
నీ చేయి పట్టుకుని నిన్ను లేవనెత్తిన దేవుడే ఒకానొక సమయంలో నీ చేయి విడిచి పెట్టె అవకాశం కూడా ఉందని మర్చిపోకండి. అలా చేయిని విడిచిపెట్టిన సమయమే నీవు అయన కొరకు నిలువబడే గడియని తెలుసుకుని శ్రమ పడుటకు సిద్దపడగలవా...?
సుఖాలను అనుభవించడం,అవసరాలను తీర్చుకోవడం, దేవునికి, మీ కోసం కన్నీళ్ళతో ప్రార్థన చేసే సేవకుని కి కృతజ్ఞత చూపించకుండా మొహం తిప్పుకొని తిరగడం క్రైస్తవం అని నీవనుకుంటే నీవు అస్సలు క్రైస్తవుడే కాదు... 2తిమోతి 3:12- క్రీస్తు యేసు నందు సద్బక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరు హింస నొందేదరు.. అనగా నీవు నిజమైన క్రైస్తవునిగా భక్తితో క్రీస్తు కొరకు క్రైస్తవంలో సాగాలంటే నీవు హింసనొందక తప్పదు.
క్రీస్తు బ్రతికున్న కాలంలో ఆయనను వెంబడించిన జన సమూహం కేవలం తమ అవసరాలను అయన దగ్గర తిర్చుకోనుటకు వెంబడించుచున్నారన్న సంగతి క్రీస్తు ఎరిగినవాడై పలికిన మాటలు చూస్తే..
యోహాను 6:26- యేసు -మీరు సూచనలు చూచుట వలన కాదు గానీ రొట్టెల భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని చెప్పుచున్నాను.
అనగా వారు గుంపులు ,గుంపులుగా అయన దగ్గరకు చేరి వచ్చారంటే ఆయన వాక్యం కొరకు కాదు కానీ తమ అవసరాలను తిర్చుకోనుటకే. ఈ దినాలలో కూడా అనేక సంఘాలలో(ఉద్యోగాల కోసం, వివాహాల కోసం , డబ్బులు అప్పులు కోసం) ఆయనను వెంబడించారని (వెంబడిస్తున్నారని) అర్థమవుతుంది..
ఆనాడు క్రీస్తు నోద్దకు వచ్చిన వారిని గూర్చి క్రీస్తు బైబిల్లో ఏమని చెప్పాడో పరిశిలిస్తే వారెందుకు క్రీస్తును వెంబడించారో అర్థమవుతుంది.
యోహాను 6:2-రోగుల యెడల అయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి,
యోహాను 12:18-అయన ఆ సూచక క్రియలు చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. అనగా మంచి వాక్యాన్ని భోదించినందుకు కాదు కానీ విరి అవసరాలు తీరే పనులు యేసు చేస్తున్నాడని విని చూచి జనులు అయన దగ్గరకు వచ్చారు.
మార్కు 3:7,8-గొప్ప కార్యాలు చేయుచున్నాడని విని గుంపులుగా వచ్చారు.
పై మాటలను బట్టి ఆయనను వెంబడించిన ప్రజలందరు తమ అవసరాలను తిర్చుకోనుటకే తప్ప ఆయనను విశ్వసించటానికి కాదని ఖచ్చితముగా అర్థమవుతుంది.
రోగాలను తీయటమే క్రీస్తు ముఖ్య ఉద్దేశం కాదు కానీ సువార్త ప్రకటించుటయే అయన ప్రధమ కర్తవ్యం. సువార్త ప్రకటించుటయే యేసు ధ్యేయంగా పెట్టుకున్నాడు గానీ వచ్చిన వారిని స్వస్థపరచాలని ,వారి అవసరతలు తీర్చాలని కాదు.
యెషయ 61:1- దినులకు సువార్తమానము ప్రకటించుటకూ యెహోవా నన్ను అభిషేకించెను.
రోగాలను తీసెయ్యడం యేసు ఉద్దేశం ఎప్పుడు కాదు కానీ నాశన కూపంలో ఉన్న ఆత్మలకు నిత్యజివం ప్రసాదించడమే అయన ప్రకటనలోని ముఖ్యాంశం.
నీవు క్రీస్తును నమ్ముకోనుట కేవలం అవసరాల కొరకో లేదో ఏదో ఒక మేలు జరుగుట కొరకో అయితే అట్టి విశ్వాసం నిష్పలమైనది. క్రిస్తుపై అయన వాక్యాన్ని బట్టి నీకు నమ్మిక ఏర్పడాలే గానీ మేలు జరిగినందునో లేదా జరగబోతున్నదనో నీవు నమ్మకూడదు. ఏ మేలు అనుభవించకపోయినప్పటికీ నీవు క్రీస్తును నమ్మితే అది నిజమైన విశ్వాసం.
యోహాను 20:28- తోమతో యేసు నీవు నన్ను చూచి నమ్మితివని,చూడక నమ్మిన వారు మరి ధన్యులని అతనితో చెప్పెను.
ఒకరు దేవుని దృష్టియందు విస్వసిగా లెక్కింపబడాలంటే చూడకుండా నమ్మే స్థితిని నేటి క్రైస్తవులు కలిగి ఉండాలి. క్రీస్తును నమ్మిన క్రైస్తవులు ఆయనను చూడకపోయినా పరలోకం ,పాతాళం,దూతలను చూడకపోయినా అయన కొరకు బ్రతకటమే నిజమైన క్రైస్తవ్యం.. దేవుడు ఉన్నాడని, ఉన్న అయన ఒక రోజు తన కుమారుడిని మన కొరకు పంపుతాడని,వచ్చిన యేసుక్రీస్తు మన అందరిని తిసుకేల్తాడని నమ్మాలి. కేవలం క్రీస్తును గుర్చిన వాక్యం విని కలిగిన విశ్వాసమే నిజమైన విశ్వసమని బైబిల్ చెబుతుంది.
గనుక క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు దేవుని ఉద్దేశాల ప్రకారం ప్రవర్తించుటకు గాను, తమ్మును తాము ప్రత్యేక పరచుకోవలెను గాని మేలులు పొందుటకు మాత్రం కాదు. అదే విధంగా ఇక మీదట క్రీస్తును నమ్మేవారు కూడ మేలులు జరిగాయి గనుక క్రైస్తవులుగా మారారన్నది బైబిల్ కూ విరుద్దం. మేలు జరుగుతాయని నమ్మడం ఎంత అపరాధమో మేలులు పొందుతారని నమ్మించడము అంతే నేరము. గనుక నీవు క్రీస్తులోనికి ఆహ్వానించిన వారినేవరినైనా శ్రమల కొరకు సిద్దపడే రావలసినదిగా ముందుగా వారికీ తెలుపవలెను ఆ తర్వాత క్రీస్తు యొక్క సువార్త(మరణ పునరుర్ధానము) చెప్పాలి.
ఇక మీదట క్రీస్తును నమ్మేవారు అవసరాల కొరకు మాత్రం కాక నిజముగా శ్రమించుటకు సిద్దపడినవారే అసలు సిసలైన క్రైస్తవులు .వారిదే నిజమైన క్రైస్తవత్వం,క్రీస్తుతత్వం... ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Comments