ప్రాణం ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్

*CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

ప్రాణం ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్

" అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. . . .మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. "
( James (యాకోబు) 2:23 )

ఆహా.... ఇది ఏంత గొప్ప అధిక్యత.
మరి....దేవునికి స్నేహితుడగా మారే ఆ అధిక్యత ఒక్క అబ్రహముగారికే ఉందా. . . . ?
ఒక్క హనోకుగారికే ఉందా. . . . ?
ఒక్క దావీదుగారికే ఉందా. . . . ?
ఒక్క దానియేలుగారికే ఉందా. . . . ?
నాకు అంతటి ఆశీర్వాదం ఎప్పుడు లభిస్తుంది, అనే ప్రశ్నలు నీకు ఉంటే ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది గమనించండి. . . . .
ఇప్పుడు కాదు దేవుడు కొన్ని వేల సం!!రాల పూర్వమై ఈ ప్రశ్నలకి సమాధనం తన రక్తంతో వ్రాసి, సిలువయాత్ర ద్వారా.... తన బలియాగం ద్వారా సమస్త మానవాళికి తెలియ చెప్పారు.
అవును. . . .
భూలోక సంభందమైన దేవుళ్ళకి ఉంటె భక్తులు, సేవకులు, పనివారు ఉండటం సహజం. . . .
కానీ. . . .నేను నమ్మి ఆరాధిస్తున్న దేవుడు మాత్రం సాదారణమైన నరులను ప్రేమించి తన స్నేహితులుగా మార్చుకుని ఆదరించగల కరుణాస్వభావముగల దేవుడు.

" తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులైయుందురు. "
( John (యోహాను సువార్త) 15:13,14 )

లోకంలోని ప్రతిఒక్కరిని ప్రేమించి తన ప్రాణం పెట్టుట ద్వారా ఈ వాక్యాన్ని యేసయ్య నెరవేర్చారు.
అవును....తన వంతుగా తనపై విశ్వాసముంచిన ప్రతి ఒక్కరిని తన స్నేహితులుగా స్వీకరించుటకు తన హస్తాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి.
మన వంతుగా ఆ దేవాది దేవుని చిత్తాన్ని, ఆయన ఆజ్ఞలను నేరవేర్చటం మన బాధ్యత.
మరి ఎందుకీ ఆలస్యం. . . .
Whatsapp, Facebook Open చేసిన ప్రతిసారి Friend Requests ఏం వచ్చాయి అని వెతుకుతాము కదా ?
సుమారుగా 2 వేల సం!!రాల నుండి ఒక Friend Request నీ కోసం ఎదురుచుస్తూ ఉంది, అది నీకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి వచ్చింది.

" Delete " చేసి తృణీకరిస్తావో. . . .
" Not Now " అని అశ్రద్ద చేస్తావో. . . .
" Confirm " చేసి యేసయ్య స్నేహన్ని స్వాగతిస్తావో అంతా నీ ఇష్టం.

యేసయ్య తో నీవు స్నేహం చేస్తే మీ కుటుంబం లో ప్రేమా, ఆప్యాయత వాటికి అవే వస్తాయి.
ఈ లోకంలో వున్న స్నేహాలు నమ్మదగినవి కావు. అవసరాలు తీరిన తరువాత అవమానించే స్నేహాలు వున్నాయి. శాశ్వతంగా వుండే స్నేహం లేనే లేదు. బయటికి ఒకరకంగా నటిస్తూ..లోలోపల విషంతో వుండే బహు ప్రమాదకరమైనవి. అందుకే జాగ్రత్త సుమా..

నేను యేసయ్య తో స్నేహం చేసాకనే నాలో ఎప్పుడూ లేని నెమ్మది నేను పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. అందరికన్నా యేసయ్య నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నా కోసం ప్రాణమే ఇచ్చాడు. మరువలేని మధురమైనది యేసయ్య ప్రేమ.

నీ యుక్తమైన సమాధానం నీకు బహు యుక్తమైన ఫలాన్ని ఇస్తుంది. ఒక బెస్ట్ ఫ్రెండ్ గా నీ మనసులో యేసయ్య కు స్థానం ఇస్తావా..నీ కన్నీరు తుడిచి నీ భుజంపై చెయ్యి వేసి నిన్ను నడిపిస్తాడు.

హల్లెలూయ. . . .

మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమకలుగునుగాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో మీ ప్రార్థనా అవసరాలు పోస్ట్ చేయండి. మీ కోసం మేము ప్రతి రోజు ప్రార్థనలు చేస్తాము.

Comments