🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*క్రైస్ట్ టెంపుల్ ఆత్మీయులకు అందరికీ శుభములు..మన వెబ్ బ్లాగ్ లో వాక్య సందేశాలు చదివే వీవర్స్ నిన్నటితో 2000 మంది ప్రజలు మించియున్నారు. మన చర్చ్ బ్లాగ్ చదివేవారు ఇండియాతో పాటు అమెరికా, ఇండోనేసియా, అరబ్, కెన్యా, కువైట్, ఫిలిప్పీన్స్, వెనుజుల, ఇటలీ, ఒమన్ దేశాలలో కూడా వున్నారు. దేవాది దేవునికి మహిమ గాక. మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.*
...పాస్టర్.నక్కొల్ల డానియల్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
డాడీ! దహనబలికి కట్టెలు, నిప్పు వున్నాయిగాని, గొర్రెపిల్ల ఏది?
•ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. సమస్తమూ సాధ్యమే.
•కాకులతో సహితం నిన్ను పోషించగలడు.
•బండను చీల్చి నీ దాహాన్ని తీర్చగలడు.
ఆయన యందు నమ్మిక మాత్రం వుంచు. అదెన్నటికీ నిన్ను సిగ్గు పరచదు.
*అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను.* ఆది 22:2
పరిశుద్ధ గ్రంధములో దేవుడు ఒక మనిషిని బలిగా కోరిన సందర్భం ఇదొక్కటే. దేవునిని గురించి తెలియని వాళ్ళు ఇది చదివితే? క్రైస్తవులు ఆరాధించే దేవుడు ఇట్లాంటి వాడా? అనుకుంటారు.
ఆయన బలిని కోరేవాడు కానేకాదు. బలి ఆయనకు ఇష్టమైతే అబ్రాహామును అడ్డగించే వాడుకాదు.
వృద్ధాప్యమందు నేనిచ్చిన కుమారునికి ప్రాధాన్యత ఇస్తాడా?
ఆ కుమారుని ఇచ్చిన నాకు ప్రాధాన్యత ఇస్తాడా? అని అబ్రాహాము విశ్వాసానికి దేవుడు పెట్టిన పరీక్ష మాత్రమే. దేవుడు అడుగుతున్నాడు.
'నీవు ప్రేమించు ఇస్సాకును దహనబలిగా నర్పించు'
*దహన బలి అంటే?*
నరికి, బూడిదగా చెయ్యడం.
ఎవరిని? కన్న కొడుకుని (తాను ప్రేమించే కొడుకుని). అబ్రాహాము ఒక్క మాటకూడా మాట్లాడలేదు. విధేయత ప్రశ్నించదు.
ఇంతటి విశ్వాసమునకు కారణమేమిటి? ఒక్కటే! దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే? ఇస్సాకు తప్పక బ్రతికివుండి తీరాలి. అందుచే దేవుడు ఇస్సాకును చంపడు. చంపినా తిరిగి బ్రతికించగలడు.
దహన బలికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. చివరి చూపుగా నీ కొడుకుని చూచుకో అనే చిన్న మాట కూడా శారాతో చెప్పలేదు.
పనివారిని తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళాడు. దహన బలి అర్పించే స్థలానికి కాస్త దూరంలో పనివారితో అంటున్న మాట. మీరు ఇక్కడే వుండండి 'మేము' దహనబలి అర్పించి "తిరిగి వస్తాము". అదేంటి? వస్తాము అంటున్నాడు? వస్తాను అనాలి కదా? బైబిల్ లో ప్రింట్ తప్పు పడిందా? కాదు! ఆయన మాటల్లోని విశ్వాసము మనకు అంతుపట్టదు. కనీసం మన ఊహలకు కూడా అందదు.
కట్టెల మోపు ఇస్సాకు మీద ఉంచాడు. అంటే? కట్టెల మోపు ఎత్తుకొని ఇస్సాకు మోరియా పర్వతం ఎక్కుతున్నాడంటే? అతడు చిన్నపిల్లాడు కాదు. ఇస్సాకు అడుగుతున్నాడు. డాడీ! దహనబలికి కట్టెలు, నిప్పు వున్నాయిగాని, గొర్రెపిల్ల ఏది? ఆ ప్రశ్నకు అబ్రాహాము గుండె ఆగిపోవాలి.
కాని, అబ్రాహాము అంటున్నాడు. "దేవుడే చూచుకుంటాడు"
అబ్బా! అబ్రాహాము విశ్వాసం చూస్తుంటే? శరీరం జలదరిస్తుంది కదా? అబ్రాహాము బలిపీఠము కట్టాడు. కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించి దాని మీద వుంచి, కత్తి పైకెత్తాడు. కొద్ది క్షణాల్లో ఆ కత్తి ఇస్సాకు మెడను రెండుగా చీల్చబోతుంది.
కత్తి పైకెత్తే వరకు అబ్రాహామును పరీక్షించాడు గాని, ఆ కత్తి ఇస్సాకు మీదికి దిగనియ్యలేదు. అబ్రాహాము చెప్పినట్లే దహనబలికి బలిపశువును దేవుడే చూచుకున్నాడు. విశ్వాసవీరుడు విజయం సాధించాడు. మరిన్ని వాగ్దానాలు స్వతంత్రించు కున్నాడు.
👍మనమునూ విశ్వసిద్దాం!
విజయం సాధిద్దాం!
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments