అంతటి ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ లేరు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*క్రైస్ట్ టెంపుల్* ఆత్మీయులకు అందరికీ శుభములు.. మన వెబ్ బ్లాగ్ లో వాక్య సందేశాలు చదివే వీవర్స్ ఇప్పుడు 2000 మంది ప్రజలు మించియున్నారు. మన భారతదేశం లో 95%, అమెరికా లో 5% మన బ్లాగ్ ను చదువుతున్నారు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇంత తక్కువ సమయంలో ఇంతగా ఈ చిన్న పరిచర్యను ఆదరించినందుకు, ప్రోత్సహించినందుకు మీ ప్రేమ,ఆప్యాయతను బట్టి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.
...పాస్టర్.నక్కొల్ల డానియల్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
అంతటి ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ లేరు
నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
............ ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము.
1 రాజులు 3 :7,9
యెహోవా గిబియోనులో ఒక రాత్రివేళ సొలోమోనుకు స్వప్నమందు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో? అడుగమన్నాడు.
అదేంటి? రాజుకు ఏమి కావాలో దేవునికి తెలియదా? మరళా అడగమనడం ఏమిటి?
అవును! అతనికి ఏమికావాలో దేవునికి తెలుసు. కానీ ఎందుకు అడుగమన్నాడు అంటే? సొలోమోను అడిగేది యదార్ధమైనదా? కాదా? అవసరం నిమిత్తం అడుగుతాడా? విలాసాల కొరకు అడుగుతాడా? అనే విషయం తెలుసుకుందామని దేవుడు అట్లా అన్నాడు.
మనలను కూడా ఆయన *అడుగుడి మీకియ్యబడును*
మత్తయి 7:7
అంటున్నాడు. మనకేమి కావాలో ఆయనకు తెలియదా? తెలుసు.
*ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును*.
మత్తయి 6:32
కానీ, మన ప్రార్ధనలో యదార్థత ఎంతో తెలుసుకుందామని అడుగమంటున్నాడు.
అయితే, సొలోమోను ఏమి కోరుకున్నాడు?
తండ్రీ! నేను చిన్న పిల్లవాడను. ఇంత సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించుటకు నాకు జ్ఞానము చాలదు. వివేకముగల హృదయాన్ని నాకు అనుగ్రహించు. అని ప్రార్ధించాడు. రాజుకు ఏమికావాలో దానినే అడిగాడు. అతని ప్రార్ధన యదార్ధమైనది.
సొలోమోను చేసిన ప్రార్ధన దేవునికి అనుకూలమయ్యింది. ఎందుకంటే? అతడు భోగముల నిమిత్తము, విలాసాల నిమిత్తము, తన స్వార్ధం కోసం, పేరు ప్రతిష్టల కోసం, ఐశ్వర్యం కోసం ప్రార్ధించిన వాడు కాదు.
అందుకే, దేవుడు జ్ఞానముతో పాటు, అడగక పోయినా విస్తారమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. ఎంత విస్తారమంటే? సొలోమోను అంతటి జ్ఞానవంతుడు, అంతటి ఐశ్వర్యవంతుడు అతని ముందు కాలంలోగాని, అతని తర్వాత కాలంలోగాని ఎవ్వరూ లేరు.
మన ప్రార్థనలకు ప్రతిఫలం రావడం లేదంటే? ఒకవేళ మన ప్రార్థనలలో యదార్థత లోపించిందేమో? విలాసాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్ధిస్తున్నామేమో? అందుకే పొందుకోలేకపోతున్నాం.
సరిచేసుకుందాం!
ఆయన మన ప్రార్ధన విని, ప్రతిఫలమిచ్చేటట్లు ప్రార్ధిద్దాం! పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే ఓపెన్ చేసి వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments