*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
ప్లీజ్ వీటికోసం ప్రార్ధించండి?
నీ కుటుంబం కోసం ఎలాగూ ప్రార్థన చేస్తావు, అయితే ముఖ్యంగా వీరికోసం ప్రార్థన చేయాలి.
ప్రభుత్వ అధికారుల కొరకు
1 తిమోతి 2:1-4
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయ మూర్తులు, సైన్యాధి పతులు, గవర్నర్లు, మేయర్లు మరియు ఇతర ప్రభుత్వాధి కారులు కొరకు ప్రార్ధించాలి.
సంఘ నాయకుల కొరకు
సంఘకాపరి, సండేస్కూలు టీచర్స్, సంఘ పెద్దలు, పరిచారకులు మొదలైన స్థానికి సంఘ నాయకులకు అనుదినం ప్రార్ధించాలి.
1 థెస్స 5:12,13
మీ సంఘకాపరి ఆరోగ్యాన్ని,, సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి, కుటుంబాన్ని పాడుచేయడానికి సాతాను తీవ్రంగా ప్రయత్నింస్తుంటాడు. కావున ప్రతీరోజూ ప్రార్థన చేయాలి.
ఇతర క్రైస్తవ నాయకుల కొరకు
సువార్తికులకోసం, బైబిల్ బోధకుల కోసం, క్రైస్తవ సాహిత్యం కోసం, క్రైస్తవ రచయితల కోసం, ఎడిటర్ల కోసం, బైబిల్ సొసైటీ వంటి ముద్రణాలయాల కోసం, సువార్త గాయకులు, సంగీత కళాకారులు, యూత్ లీడర్స్, చిన్న పిల్లల పరిచర్య చేసే వారి కోసం
మిషనరీ పరిచర్య కొరకు
యేసు క్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది వున్నారు. అయితే, సర్వలోకానికి సువార్త ప్రకటించాల్సిన భాద్యత మన మీదుంది.
(మత్తయి 28:18-20)
మనం ఆపని చేయలేకపోయినా, చేసే వారి నిమిత్తం తప్పక ప్రార్ధించాలి.
ఇతర క్రైస్తవ పరిచర్యలు కొరకు
రేడియో, టెలివిజన్, కర పత్రికల పరిచర్య, దండయాత్రల పరిచర్య, సువార్త బృందాలు, చెరసాల పరిచర్య, యూత్ పరిచర్య.
దేవుని నామం కోసం హింసించబడుచున్న వారికోసం
ఈ చివరి రోజులలో యేసునామం కోసం మన దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతోమంది ఎన్నోవిధాలుగా బాదపడుతున్నారు, ఊచకోత కోయబడుచున్నారు, చిత్రహింసలకు గురౌచున్నారు. మానభంగాలకు గురౌచున్నారు. గేలిచేయబడి, చెరసాలలో మగ్గుచున్నారు. కొంతమంది ఇవి తట్టుకోలేక కొండలకు పారిపోయి ఆకలిబాదలతో బాదపడుచున్నారు. వారందరికోసం ప్రార్ధించాల్సిన అవుసరము మనకుంది.
నీ ప్రియమైన వారికోసం
నీ స్నేహితులు, బంధువులు, రక్తసంబందుల వారి రక్షణ, వ్యక్తిగత అవసరాల కొరకు.
ప్రత్యేకమైన అవసరాల కొరకు
టి.వి, వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలను గురించి, వరదలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రమాదాలు, వ్యాధులు, హృదయ విదారకమైన పరిస్థితుల గురించి.
తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నివసించడానికి గృహాలు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్న వారి నిమిత్తం, సేద్యం చేస్తున్న రైతుల కోసం, దేశాన్ని కావలి కాస్తున్న సైనికుల కోసం ఇట్లా... అనేక విషయాలను గురించి ప్రార్ధించాల్సిన బాధ్యత మన మీదుంది.
ఆ భారం నీకుందా?
ప్రార్ధిద్దాం! ప్రభువు చెంతకు నడిపిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments