దేవదూతల సహాయం నీకు కావాలా..?
*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
దేవదూతల సహాయం నీకు కావాలా..?
దేవుని దూతలు "దేవుని బిడ్డలకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు".
హెబ్రీ 1:14
మనం ప్రార్ధించినప్పుడు, దేవుడు తన బిడ్డలను కాపాడడానికి అవసరమైన ఏ విధానమునైనా వాడుకుంటాడు.
మనకు దేవుని వాగ్ధానం ఉంది. దానిని అడిగేందుకు మనకు హక్కు కూడా ఉంది. ప్రత్యేకమైన ప్రమాదకర పరిస్థితులలో మనకు సహాయం చేసేందుకు నియమింప బడిన దేవదూతల సహాయాన్ని కాపుదలనూ అడిగిపొందే ఆధిక్యత మనకు ఇవ్వబడింది.
వారు పరిచర్య చేసే విధానాలన్నీ మనకు తెలియవు గాని, వాటిని గురించి బైబిలు గ్రంధము ఈ క్రింది విషయాలను మనకు తెలియజేస్తుంది.
*దేవదూతలు మనలను అపాయం నుండి కాపాడతారు*.
• యాకోబు రాత్రంతా ప్రార్ధన చేసిన తర్వాత దేవదూతలు అతనిని కాపాడారు. (ఆది 32:1)
• ప్రార్ధనాపరుడైన ఎలీషాను కాపాడారు. (2 రాజులు 6:17)
దేవదూతలు దేవుని బిడ్డలను విడిపిస్తారు*
దేవదూతలు పేతురును చెరసాల నుండి విడిపించారు. (అపో.కా. 12:1-11)
*దేవ దూతలు దేవుని బిడ్డలకు దేవుని సందేశాలను తీసుకొని వస్తాయి
• క్రీస్తు జనన సమయంలో గొల్లలకు
(లూకా 2:9-13)
• పునరుద్ధాన సమయంలో సమాధి వద్ద నున్న స్త్రీలకు
(మత్తయి 28:2-7)
• కొర్నేలికి (అపో.కా 10: 1-7)
దేవదూతలు శారీరక శక్తిని నూతన పరుస్తాయి
గెత్సేమనే తోటలో యేసు చింతాక్రాంతుడై ప్రార్ధించిన తరువాత దేవదూతలు ఆయనను బలపరిచారు. ( లూకా 22:43)
దేవుడు మన ప్రార్థన విని, ప్రతిఫల మిచ్చేటట్లు ప్రార్ధించ గలిగితే? పరలోకంలో నున్న దేవదూతలను సహితం దేవుడు నీ ముందు ప్రత్యక్ష పరుస్తాడు. ఆ ప్రసన్నతను అనుభవించగలవు.
ప్రార్ధించి చూడు. ప్రతిఫలం తప్పక పొందుకుంటావు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
ఆమెన్..ఆమెన్..ఆమెన్
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments