*CHRIST TEMPLE-PRODDATUR*
ఒంటె సూది బెజ్జములో దూరగలదా?
" ... మీరందరు ఎదుటివాని యెడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి. ( 1పేతురు 5:5 )"
దీనమనసు కు అణుకువ, నమ్రత, వినయము అను అర్ధాలు ఉన్నాయి. బైబిల్ నందు ప్రతి విశ్వాసిని దీన మనస్సు ధరించుకోవలసినదిగా ప్రభోధిస్తోంది. ఇహలోక యోగ్యతలను బట్టి పరలోక ప్రవేశం లేదు. ఒంటె సూది బెజ్జములో దూరగలదా? తగ్గించుకుంటే దూరగలదు అని ప్రభువు చెప్పారు ( మత్త 19:24). ఆత్మీయ జీవితములో గొప్పవాడై యుండగొరువాడు సమాజములో పరిచారకుడై ఉండవలెను అని మత్తయి 20:26-27 లో ప్రభువు చెప్పారు.
దేవునియందు బయభక్తులే వినయ విధేయతలను తీసుకొచ్చి ఆత్మీయ సాష్టాంగమునకు సహాయపడును. మత్తయి 23:12 ప్రకారం తన్ను తాను తగ్గించుకునువాడు హెచ్చిపబడును. భక్తులు ఎలా తగ్గించుకున్నారో, ఏ విధముగా హెచ్చించ బడ్డారో కొన్ని మనం ఈ రోజు ధ్యానిద్దాము.
▶ అబ్రహము: "ఇదిగో ధూళియు, బుడిదనైనా నేను..." అని ఆది18:27 లో వ్రాయాబడింది. దేవుడైన యెహోవా సొదొమ గొమొఱ్ఱ లకు తీర్పు తీర్చుటకు దిగి వచ్చినపుడు అబ్రాహాము దేవుని యొద్ద నిలిచి ఆ పట్టణము యొక్క నాశనము కాయుటకు దాదాపు 6సార్లు దేవునితో బేరములాడిన ధీరుడు. దేవుడు కూడా ఓర్పుతో అతని విన్నపములు అలకించాడు. అక్కడ ధూళియు బుడిదనైన నేను మాట్లాడ తెగిఉంచుచున్నాను అంటున్నాడు.బూడిద ఒక వస్తువును అగ్ని దహించగా పాళెములో పారవేయబడేది. అటువంటి పనికిమాలిన వాటితో తగ్గించుకొనుట ఎంత దీనత్వమో కదా? ఆత్మల రక్షణ నిమిత్తము మనము దేవునికి ప్రార్ధించునపుడెల్లా మన ఆధిక్యతలు, అధికారాలు చాపను చుట్టినట్లు చుట్టి ఒక ములన పెట్టి దీనులమై ప్రార్ధించాలి.
▶ యాకోబు: "నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు అపాత్రుడను (ఆది 32:10)". యాకోబు తన జీవితములో దేవుడు తనకిచ్చిన ఆశీర్వధములకు అపాత్రుడను అని ఒప్పుకొనుచున్నాడు. యాకోబు అంటే మోసగాడు. పుట్టిన తోడనే మోసగాడు అని పేరొందాడు (ఆది 25:26). అన్నను, తండ్రిని మోసాగించాడు. వారి యొద్ద నుండి పారిపోయి తన మేనమామ లాభానుతో20యేండ్లు ఉండి మోసకరమైన ఆస్తిని సంపాదించాడు. చేతి కర్రతో మాత్రమే యోర్దను ధాటివెళ్లి 4 భార్యలు, 13 మంది పిల్లలు, పనివారు, పశువులు, ఆస్తితో తిరిగి వస్తున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు పొంది ఈ20 సంవత్సరాలలో దేవుని ఆరాధించినట్టు కనుగొనలేము. ఇప్పుడు దేవుని ఆజ్ఞను పొంది బేతేలుకు తిరిగి వస్తున్న సందర్భములో తన అన్న 400మందితో తనను ఎదుర్కొనుటకు వస్తున్నాడు అని తెలిసి భయపడి, తొందరపడి పై వచనాన్ని అంటున్నాడు.
నిజమే, అన్ని ఉన్నపుడు మనకు దేవుడు ఎవరో అనే స్థాయికి వస్తాం. ఆపద వస్తే అప్పుడు మరల దేవుడు గుర్తు వస్తాడు. అయిన పర్లేదు, యాకోబులా నీవు కూడా దేవుని విస్మరిస్తే మోకరిల్లి బలహీనతను ఒప్పుకొని ప్రార్ధించు, యాకోబు కూడా అదే చేసాడు. ఏ పరిస్థితిని అయిన తారుమారు చేయగల మన దేవుడు అక్కడ కూడా అదే చేసారు. చంపుదాం అనుకున్న ఏశావు కౌగలించుకొని, మెడ మీద ముద్దు పెట్టాడు (ఆది 33:4). యాకోబు మొదటిసారి దీనుడై దేవునికి విధేయత చూపించాడు అప్పుడు దేవుడు " నా సేవకుడవైన యాకోబు (యెషయా 44:2)"
▶ మోషే:
నేను ఎంతటి వాడను?
(నిర్గమ 3:11)
▶ గిద్యోను:
"నేను కనిష్టుడను"
(న్యాయాధిపతులు 6:15)
▶ బాప్తిస్మమిచ్చు యోహాను:
"నేను అయన చెప్పులు మోయటకైనను పాత్రుడను కాను"
(మత్తయి 3:11)
▶ అపోస్తులుడైన పౌలు:
"అందరిలో నేను తక్కువ వాడను"
(1కొరింది 15:8)
దీనులైన పై అందరిని దేవుడు హెచ్చించి గొప్ప చేసాడు. మనం కూడా తగ్గి దేవుని బలిష్టమైన చేతిక్రింద దినులై ఉందాము అప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!!
*CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి
Comments