లవ్ (ఆర్) ట్రూ లవ్

*CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

     లవ్ (ఆర్) ట్రూ లవ్

👉 ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన టాపిక్. డోంట్ మిస్ ఇట్.

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12

'ప్రేమ' ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంత మైన పదం. నేటికినీ మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. దాని అర్ధమేమిటో తెలియకున్నా అది చేసేపనులు లెక్కలేనన్ని.

ఒక టీనేజర్ ప్రేమంటూ తిరిగీ, తిరిగీ, పరీక్షల ఫలితాలు వచ్చాక తెలిసింది ప్రేమంటే ఏమిటో? Loss Of Valuable Education అని. మరొకడేమో రాత్రంతా చాటింగ్. నిద్రలేక నీరసం వచ్చాక వాడికి అర్ధమయ్యింది ప్రేమంటే? Loss Of Valuable Energy.అని

ఒక అబ్బాయికి ఒక అనుమానం. నా గర్ల్ ఫ్రెండ్ నా పేరును తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకుందో అని. మొత్తానికి తెలుసుకున్నాడు. ' 'టైం పాస్ 20' అని. అంటే? వీడి క్రింద ఇంకో 19 మంది. వీడిపైన ఎంత మందో? ఇప్పుడు వీడికి అర్ధమయ్యింది ప్రేమంటే? 'టైం పాస్' అని. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది ? మీరే ఆలోచించండి...భార్య భర్తల మధ్య గాని, తల్లిదండ్రులకు మద్య గాని, అన్నదమ్ములమధ్య గాని, బంధువుల,ఫ్రెండ్షిప్ మద్య గాని నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది ?
   స్వార్థం, సెల్ఫ్ ఫోకస్ , మాటల యుద్దం, ఆర్థిక దాహం, , అహంకారం, కోపం ..వీటి మధ్య ప్రేమకు విలువ ఇవ్వడం లేదు. నేను చెప్పిందే వినాలి, నేను,నా అనే దుష్ట ఆలోచనలు కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నాయి.

ప్రతి కుటుంబం లో ప్రేమకు విలువ ఇవ్వడం లేదు కాబట్టే వృద్ధాశ్రమంలు, అనాధ ఆశ్రమములు ఇలా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఒకడేమో రక్తంతో వ్రాసేస్తాడు ( అది కోడి రక్తమో? వాడి రక్తమో? వేరే సంగతి) ఒకడేమో కత్తితో పొడిచి, మరొకడేమో యాసిడ్ పోసి చంపేస్తాడు. ఏమిటిది? అని అడిగితే నాకు దక్కనిది ఇంకెవ్వరకూ దక్కకూడదు. ప్రేమంటే ఇదే అంటాడు. ప్రేమంటే ప్రాణం తీయడం కాదు. నవమాసాలు తల్లి మోసి, కనీ, గోరుముద్దలు తినిపించి నీ గురించి ఎన్ని ఆశలు పెట్టుకొని, మా వాడిని అలా చూడాలి, మా అమ్మాయిని ఈ స్థాయిలో చూడాలి అని కలలు కన్న కన్నవారిని మరిచి, పాపిష్టి ఆలోచనల్లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలామంది.

'ప్రేమికుల రోజు' (వాలెంటైన్స్ డే) ఇదొకటి.ఆ రోజు 'నా హృదయంలో నీకుతప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు' అంటూ వ్రాసి 'అందరికీ' పంచుతాడు. అదేంటి అంటే? ప్రేమ అంటే అంతే అంటాడు.

ఇక తల్లి ప్రేమ! ఆ ప్రేమను వర్ణించడం ఎవ్వరి తరమూకాదు. అమ్మ తియ్యని ప్రేమ మధురమైనది.
కానీ కొందరు పాపిష్టి మనుష్యులు తల్లి ప్రేమకు విలువ లేకుండా చేస్తున్నారు. టీవీల్లో , న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాము కొందరు దుర్మార్గులు వారి అక్రమమైన జీవితాలను కొనసాగించడానికి కన్న బిడ్డలను సహితం కర్కషంగా చంపేసి మురికికాలువల్లో, చెత్త కుప్పలల్లో పసి బిడ్డలను పారవేసే తల్లులెందరో? ఆ తల్లి ప్రేమకూడా కలుషితమవుతుంది.

ఇక అందరికీ తల్లి 'మదర్ థెరీసా' ఆమె ప్రేమ స్వచ్చమైనది. ఎవ్వరూ కాదనలేనిది. కాని, పరిపూర్ణమైనది కాదు. ఆ ప్రేమ కొందరికే పరిమితం, కొంత కాలమే పరిమితం. శారీరికమైన స్వస్థత చేకూర్చ గలిగిందిగాని, పాప రోగం నుండి మనిషిని విడిపించ లేకపోయింది.

ఇంతకీ, నిజమైన ప్రేమ అంటే ఏమిటి?

ఈ లోకంలో 'నిజమైన ప్రేమకు' అర్ధాన్ని, నిర్వచనాన్ని చెప్పిన వాడు ఒకే ఒక్కడు.

ప్రేమకు అర్ధం, నిర్వచనం? నిజమైన ప్రేమకు అర్ధం, నిర్వచనం 'నీ ప్రియ రక్షకుడే'. ఆయన ప్రేమాస్వరూపి ( ఆయనే ప్రేమయై వున్నాడు) 1 యోహాను 4:8,16

ఆయన ప్రేమతత్వం: శత్రువులను కూడా ప్రేమించు. (మత్తయి 5:44) మాటలకే పరిమితం కాదు. చేసి చూపించారు కూడా. మనము శత్రువులమై వున్నప్పుడు మన కోసం తన ప్రాణమును పెట్టారు. (రోమా 5:10)

ఆ ప్రేమ యొక్క లక్షణాలు: ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.ప్రేమ శాశ్వతకాలముండును. 1 కొరింది 13:4-8

నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటో నాకు తెలియదుగాని, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తావని. కనీసం తలిదండ్రుల ప్రేమలో కూడా అంతర్గతంగా ఒక ఆశ వుంటుంది. పిల్లలు పెద్దవారై వారిని కూడా ప్రేమగా చూస్తారని.

కాని, ఆయన ప్రేమ బదులాశించనిది. అది అమరం, అతిమధురం,అపురూపం. అవధులులేనిది అద్వితీయమైనది. సింహాసనము నుండి సిలువకు దిగివచ్చినది. మరణము కంటే బలీయమైనది. సజీవ మైనది, శాశ్వతమైనది.

అట్టి ప్రేమను అనుభవిస్తున్న నీవు ఆ ప్రేమకు మాదిరిగా జీవించాలి.

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్
      *CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా విన్నపము మాకు తెలియచేయండి

Comments

Popular posts from this blog

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

దావీదు దేవుని హృదయానుసారుడు..కానీ..

ప్రార్థన మందిరం