పరీక్షా కాలం ముగిసిన వెంటనే విజయం నీదే

    *CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

పరీక్షా కాలం ముగిసిన వెంటనే విజయం నీదే

ప్రియ సహోదరీ సహోదరుడా!నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు,వేదనలు,ఇబ్బందులు,విపత్కర పరిస్తితులు,అనారోగ్యం,ఆపదలు నిన్ను కూలగొట్టడానికి,నిన్ను నాశనం చేయడానికి దేవుడు అనుమతించలేదు గానీ .......ఈ కష్టాలు,నష్టాలు,శోధనలు,వేదనలు నిన్ను ఏమీ చేయలేవని నీ విశ్వాసమును కదల్చజాలవని,దేవుడు నీకు రావలసిన ముందు గతిని,మంచి రోజులను అవి దూరంచేయలేవని నిరూపించుటకే నీ మీద నమ్మకం కలిగిన దేవుడు వాటిని అనుమతించెను గనుక అధైర్యపడకు,దిగులు చెందకు.
పరీక్ష ముగిసిన పిదప నిన్ను బహుగా దీవించి,నీవు అడిగిన వాటికన్నా,ఊహించిన వాటికన్నా గొప్పగా దీవెనలు నీమీద కుమ్మరించి నిన్ను దీవించును గాక....ఆమెన్.

దేవుడు యోబు జీవితంలో ఎన్నో కష్టాలు,శ్రమలు,అనారోగ్యం అనుమతించెను.కారణం.....యోబును ఇబ్బంది పరుచుటకో,ఓడించుటకో,నాశనం చేయుటకో కాదు.
ఆ కష్టాలు,ఆ నష్టాలు,ఆ అనారోగ్యం తన భక్తుడైన యోబును కదల్చవని నిరూపించుటకే కదా అనుమతించింది.పరీక్షించింది!
ఆ పరీక్ష పాసైన తర్వాత ఆ దేవ దేవుడు యోబును రెట్టింపు దీవేనలచేత నింపలేదా?తన నిందను ఘనతగా మార్చలేదా?

పరీక్షించబడుతున్న ప్రియ స్నేహితుడా అధైర్యపడకు,నీ పరీక్ష ముగిసిన తర్వాత విజయం నీదే ,నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకొన్న తర్వాత దేవుడు తప్పక రెట్టింపు ఆశీర్వాదములతో నిన్ను నింపును గనుక అధైర్యపడకు.ధైర్యముతో నేడు నీవు కలిగివున్న పరిస్థితిని ఎదుర్కొని దేవుడు అనుగ్రహించు గొప్ప బహుమానమును స్వతంత్రించుకో!

*"నేను నిన్ను పుటము వేసితిని వెండిని వేసినట్లు కాదు,ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని...నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను"(యెషయా 48:10,17)*

*1*:-యోబు పొందిన శ్రమలు అతనికి రెట్టింపు దీవెనలు తీసుకొని వచ్చెను (యోబు42:10)

*2*:-దానియేలు ఎదుర్కొన్న సింహపు బోను అతన్ని రాజ్యములో గొప్పవానిగా చేసెను.(దాని 6:28)

*3*:-షద్రకు,మేషాకు,అబేద్నేగో ఎదుర్కొన్న అగ్నిగుండం వారిని దేశంలోనే బహుగా హెచ్చించెను (దాని 3:30)

*4*:-యోసేపు సోదరుల అమ్మివేయబడడం,ఆ తర్వాత శోధించబడడం,చెరసాల పాలు కావటం ఇవన్నీ అతను ప్రధానమంత్రి అగుటకే దోహదపడెను.(ఆది41:43)

పరిశుద్ధ గ్రంథమందు దేవునిచే హెచ్చరించబడినవారంతా శ్రమలగుండా వెల్లినవారే.ఆ శ్రమలే వారిని విశ్వాస వీరులనుగా చేసెను.మనకు మాదిరిగా దీవేనకరంగా మార్చేను.శ్రమలగుండా వెల్తున్న ప్రియ దేవుని బిడ్డా!అధైర్యపడకు.పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో,ఉన్నతస్థితికి చేరుటకు శ్రమలు అంతే అవసరమని గ్రహించి శ్రమలను చూచి భయపడక ధైర్యముతో ముందుకు సాగు...
ఆమెన్..
దేవుడు నిన్ను చెయ్యిపట్టి నడిపించును గాక.
ఆమెన్.ఆమెన్.ఆమెన్

     *CHRIST TEMPLE-PRODDATUR*

Comments