వాడే నీ ప్రధాన శత్రువు.ఎవరో తెలుసా...

  *CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

వాడే నీ ప్రధాన శత్రువు.ఎవరో తెలుసా...

సాతాను దేవునికీ, మానవునికీ ప్రధాన శత్రువు. వాడు ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు.
                 1 పేతురు 5:8

ఈ లోకంలో నున్న ప్రతీ పాపమునకు వెనుక నిలువబడి వ్యూహాన్ని రచించేది సాతానుడే. వాడి రాజ్యంలో పరలోకంలో నుండి పడద్రోయబడి దయ్యాలుగా మారిన దూతలూ, పాపులైన మానవులూ ఉన్నారు. వాడు అనునిత్యమూ దేవుని పిల్లలను ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి పేరే "అపొల్లుయోను" అంటే? 'నాశనము చేయువాడు'
                     ప్రకటన 9:11

సాతాను దయ్యాలు అనబడే అపవిత్రాత్మల సేనకు నాయకత్వం వహిస్తూ వారితో కలసి  పనిచేస్తుంటాడు. ఈ అపవిత్రాత్మలు మానవులలో ప్రవేశించి వారిని హింసించేందుకు శక్తి కలిగి వున్నాయి.

ఇక సాతానుడైతే ప్రకృతి  శక్తులపై అధికారాన్ని కలిగివుంటూ తన దయ్యపు 'సూచక్రియల' ద్వారా (2 థెస్స 2:9,10) దేవుని పనినే గలిబిలి చేస్తుంటాయి.

ప్రధాన దూత అయిన మిఖాయేలే దేవునికి  మొరపెట్టునంతగా వాడు దుష్ట శక్తులను, అధికారాన్ని కలిగివున్నాడు (యూదా 9).

అయితే, వాడిని ఎట్లా ఎదిరించాలి?
మెలకువగా వుండి, ప్రార్ధించుట ద్వారా వాడిపై విజయం సాధించ వచ్చు. (మత్తయి 26:41)

మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. "అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును"
                యాకోబు 4:7

ప్రార్ధన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్ధన క్రీస్తు సన్నిధిని మన మధ్యకు తీసుకొని వస్తుంది. ప్రార్ధన దేవుని దూతలను మన సహాయార్ధం భూమి మీదకు తీసుకొని వస్తుంది.
(2 రాజులు 6:15-17; హెబ్రీ 1:14)

సాతానును జయించి, వానిని సమూల నాశనం చెయ్యడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం ప్రార్ధన.

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.     ఎఫెసీ 6:18

కానీ, మనం లోకం మత్తులోపడి, ప్రార్ధనా హీనులయ్యాము. ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. ఫలితంగా సాతానును ఓడించాల్సిన మనం, వాడి విజయానికి పరోక్షంగా సహాయ పడుతున్నాము.

వద్దు! వాడిని ఓడించే శక్తివంత మైన ప్రార్ధనా ఆయుధాన్ని సరియైన రీతిలో ఉపయోగించగలిగితే, వాడెంత మాత్రమూ నిలువలేడు.

ప్రార్ధిద్దాం!
ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాము.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

ఆమెన్..ఆమెన్..ఆమెన్
  *CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments