హృదయమే మలినమైపోతే?మన జీవితమంతా మలినమైనట్లే కదా!

  *CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

  హృదయమే మలినమైపోతే?మన జీవితమంతా మలినమైనట్లే కదా!

దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
           కీర్తనలు 51:10

దావీదు పాపము చెయ్యడానికి గల కారణం? అతని హృదయం మలినం అయిపోవడమేనని, గ్రహించగలిగాడు.

హృదయమే మలినమైపోతే?
మన జీవితమంతా మలినమైనట్లే కదా!

దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును
           మత్తయి 15:19

అందుకే, దావీదు దేవుని పాదాల చెంతచేరి పరిశుద్ధమైన హృదయం నాకనుగ్రహించు అని ప్రాధేయ పడుతున్నాడు.

• దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము. అంటే? హృదయం మలినమయ్యింది.

• అంతరంగంలో స్థిరమైన మనస్సు పుట్టించు. అంటే ? మనస్సు అస్థిరమయ్యింది.
మనసు చంచలమైనదైతే?
దేవునిలో స్థిరత్వం లేనట్లేకదా?

• స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అంటే?
గతకాలంలో వుండేది ఇప్పుడు అస్థిరమయ్యింది. నూతనమైన మనస్సు అనుగ్రహించు.

• హృదయం ఎందుకు మలినం అయ్యింది? మనస్సు ఎందుకు అస్థిరమయ్యింది?
కారణం ఒక్కటే "పాపం"

దావీదు పట్టించుకోనేది తాను మనుష్యులకు ఎట్లా కనిపిస్తున్నాడో?అనికాదు. తన అంతరంగ స్థితి ఎట్లా వుందో ? అని మాత్రమే.
ఎందుకంటే, అంతరంగంలో యదార్ధతను, పరిశుద్దతను కలుగజేయు వాడు దేవుడు ఒక్కడే అని అతనికి తెలుసు.

ఇప్పుడు దావీదుకు కావలసింది.
~ పవిత్ర ఉద్దేశాలు గల యదార్ధ హృదయం.
~ నిర్మలమైన కోరికలతో నిండిన హృదయం.
~ పాపానికి ఎదురు తిరిగే హృదయం.
~ దేవుని పరిశుద్దాత్మ అదుపులో వుండే హృదయం.
ఇట్లాంటి హృదయం దేవుడే అనుగ్రహించాలి. అందుకే దావీదు అంటున్నాడు 'శుద్దా హృదయం కలుగజేయుము.'

హృదయ శుద్ధి నిలిచి ఉండాలంటే, స్థిరమైన గట్టి మనస్సు,
పాపాన్ని వ్యతిరేకించే అచంచలమైన గుణం వుండాలి.
ఇది ఇంతకు ముందు దావీదులో వుండేది. అయితే పాపం చేసి దాన్ని జార విడచుకున్నాడు.

అందుకే దేవుని అర్ధిస్తున్నాడు.
కోల్పోయిన అట్లాంటి స్థిరమైన మనస్సు నూతనముగా అనుగ్రహించమని.

పశ్చాత్తాప హృదయంతో ఈ చిన్ని ప్రార్ధన మనమూ చెయ్యగలగాలి. 
"దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము."

ప్రార్ధిద్దాం!
పవిత్ర పరచ బడదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!
  *CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments