నేను బలహీనుడను చేతకానివాడను అంటూ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తే?

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

నేను బలహీనుడను చేతకానివాడను అంటూ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తే?

అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా *ఆయన మోషేమీద కోపపడి* లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును
                నిర్గమ  4:13,14

• మోషే *ఐగుప్తు ధనము* కంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొన్నాడు.
• *అల్పకాలము పాప భోగము* అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించినవాడు.
• *ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు* ఒప్పుకొనిన వాడు కాదు.
• తత్ఫలితముగా, 40 సంవత్సరాలు మిధ్యాను అరణ్యములో మందలను మేపుతున్నప్పుడే, తనకు తెలియకుండానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికి కావలసిన తర్ఫీదును ఇచ్చేసాడు.

కాని, ఐగుప్తుకు వెళ్ళడానికి మోషేకు ఎంతమాత్రం ఇష్టంలేదు. తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.

•మోషే: నేను ఫరో యొద్దకు వెళ్లుటకు ఎంతటివాడను?
•దేవుడు: *నిశ్చయముగా నేనునీకు తోడైయుందును*,

•మోషే: ఇశ్రాయేలీయులు నిన్నుపంపిన దేవునిపేరేమని అడిగితే?
•దేవుడు: *నేను ఉన్నవాడను అనువాడను* అని చెప్పు.

•మోషే: వారు నామాట వినరు.
•దేవుడు: *వారు నీ మాట వింటారు*. అని చెప్పి అద్భుతాలు చేసే శక్తిని కూడా ఇచ్చాడు.

అయినప్పటికీ, ఇంకనూ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తూనే వున్నాడు.

•మోషే: నేను మాట నేర్పరినికాను.
•దేవుడు: *నేను నీనోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధిస్తాను*.

ఇక మోషే తప్పించుకోవడానికి ఏమి లేదు. అయినప్పటికీ, అయ్యో ప్రభువా, నన్ను విడచిపెట్టేసి ఇంకెవరినైనా చూడు అన్నట్లుగా దేవునికే సలహా ఇచ్చే ప్రయత్నం చేయగా, దేవుని కోపం మోషే మీద రగులుకుంది.

ఒకవేళ మోషే అట్లా దేవునిని ప్రార్ధించకుండా ఉన్నట్లయితే? మోషేకు నోటి మాంద్యము లేకుండా చేసి,  ఆహారోను సహాయం లేకుండానే, ఒంటరిగా బలపరిచేవాడేమో దేవుడు.

అవును! మన సామర్ధ్యము, మన బలహీనతలు ఆయనకు తెలుసు.
ఆయన నిన్ను బలపరుస్తాను అని వాగ్ధాన మిచ్చినప్పటికీ, లేదు నేను బలహీనుడను చేతకానివాడను అంటూ సాకులు చెప్పే ప్రయత్నం చేస్తే? ఆయన మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేస్తే? దేవుడు మన పట్ల కలిగియున్న గొప్ప ప్రణాళిక నెరవేరక పోవడానికి మనమే కారకులవుతాం. దేవుని ఉగ్రతకు పాత్రులమవుతాం!

వద్దు! ఆయన చిత్తానికి తలవంచుదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్*!

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments