మత్స్యము కడుపులోనుండి యోనా...

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

మత్స్యము కడుపులోనుండి యోనా...

యోనా అంటే? గువ్వ
తండ్రి: అమిత్తయి
స్వగ్రామం : గత్హేపెరు
         2 రాజులు 14:25
ప్రార్ధించిన స్థలం : చేప గర్భం

*ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను.*

నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
                యోనా 2:1,2
(2 వ అధ్యాయం పూర్తిగా చదవండి)

*మనుష్యులు ప్రార్ధన చేసిన స్థలాలన్నిటిలోనూ, యోనా ప్రార్ధించిన ఈ స్థలం అసామాన్యమైనది. వింతయినది కూడా.*

యోనా చేసిన ప్రార్ధన రెండు వ్యాఖ్యానాలకు తావిస్తుంది.

1. మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ప్రార్థించెను.

తిమింగలాలలో 10 రకాల జాతులున్నాయని, వాటిలో ఒక రకానికి చెందిన వాటి కడుపులో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని, అట్లాంటి తిమింగలము యోనాను మ్రింగినదని, దాని కారణం చేత యోనా చేప కడుపులో బ్రతికి యుండి, ప్రార్ధించాడని కొందరి అభిప్రాయం.

2. పాతాళ గర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.

దీనిని బట్టి చూస్తే? పాతాళ గర్భం లోనికి ఎవరు వెళ్తారు? చనిపోయినవారే కదా? అందుచే, చేపకడుపులో యోనా చనిపోయాడు, తిరిగి దేవుడు ఆయనను బ్రతికించాడు అని అభిప్రాయపడేది మరి కొందరు. చనిపోయిన వాడు ఎట్లా ప్రార్ధించాడు అని అడిగితే? హేబేలు చనిపోతే, అతని రక్తం ప్రార్ధించలేదా అంటారు.

*కాని ఒక్క విషయం!*
ఆయన యోనాను చేప కడుపులో సజీవముగానూ వుంచగలడు, చనిపోయిన వానిని తిరిగి బ్రతికించనూగలడు. రెండూ ఆయనకు సాధ్యమే.

అదే సమయంలో, మనం ఎక్కడవున్నా, మన కష్టం ఎంత విపరీతమైనదైనా, మనం ఎట్లాంటి అత్యవసర పరిస్థితులలోనున్నా, మన దేవుడు విడిపించగల సమర్ధుడు.

*యోనా చేసిన ప్రార్ధనలో నన్ను చేప గర్భంలో నుండి, విడిపించి, రక్షించమని మాత్రం అతను ప్రార్ధించుటలేదుగాని, దేవుని సముఖం నుండి పారిపోతున్న యోనా మరళా దేవుని వైపుకు తిరుగుతున్నాడు.*

మనమునూ ఆయన వైపు మరలుకొని ప్రార్ధించ గలిగితే? మన ప్రతీ పరిస్థితి నుండి విడిపించగల సమర్ధుడు.

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments