🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
తన యజమానుకి ప్రతిష్ఠ కలిగేలా నడచుకొనేవాడు
అబ్రాహాము బహుకాలము గడచిని వృద్ధాప్యంలో నున్నాడు. తన పెద్ద దాసుడైన ఎలియాజరును పిలచి, ఇప్పుడు నేను కాపురమున్న కనానీయుల కుమార్తెలలో ఎవ్వరినీ నా కుమారునికిచ్చి వివాహం చెయ్యను. నా స్వదేశానికి వెళ్లి, నా కుమారుని కొరకు ఒక అమ్మాయిని తీసుకురమ్మని ప్రమాణం చేయించాడు.
*కనానీయుల కుమార్తెను వివాహం చెయ్యకపోవడానికి కారణం?*
1. అది దేవుడు నియమించిన కట్టడ.
2. వారు విగ్రాహారాధికులు.
ద్వితి 7:3,4
*మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయ మునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము;*
2 కొరింది 6: 14-16
అందుచే, ఎలియాజరును స్వదేశానికి పంపిస్తున్నాడు అబ్రాహాము.
*ఎలియాజరు*:
• విధేయుడు
• ప్రార్ధనా పరుడు
• కార్యం నిర్వహించే నేర్పు గలవాడు.
• నమ్మకస్తుడు
• దేవుడు మార్గం చూపేవరకు ఎదురుచూచే వాడు.
• తన యజమానుకి ప్రతిష్ఠ కలిగేలా నడచుకొనేవాడు.
నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము. చిత్త గించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచు చున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.
ఆది 24:12-14
*ఎలియాజరు ప్రార్ధిస్తూ ఒక సూచనను అడుగుతున్నాడు. పాతనిబంధన కాలంలో వాక్య ప్రత్యక్షత సంపూర్ణముగాలేని కారణం చేత, తరచుగా ఇట్లా సూచనలు అడిగేవారు. దేవుడు కూడా వాటిని అనుగ్రహించే వాడు. ఇట్లాంటి వారిలో అబ్రాహాము, గిద్యోను మొదలగు వారు కూడా వున్నారు.*
ఏది ఏమయినా ఎలియాజరు అనుకున్నట్లే జరిగింది. అట్లా అని, ఎలియాజరు అనుకున్నాడు కాబట్టి, అట్లా జరగలేదు. అది దేవుని చిత్తం కాబట్టి అట్లా జరిగింది.
కొన్ని సందర్భాలలో మనం ప్రార్ధించినట్లే జరుగవచ్చు. అయితే, మరి కొన్ని సందర్భాలలో జరుగక పోవచ్చు. వాటి నిమిత్తం దేవుని చిత్తం కోసం కనిపెడదాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments