తాను చేసిన ఒక తొందరపాటు మ్రొక్కుబడి, అతనిని కృంగదీసింది

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

తాను చేసిన ఒక తొందరపాటు మ్రొక్కుబడి, అతనిని కృంగదీసింది

అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చ యముగా అప్పగించినయెడల నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నాయింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.
        న్యాయాధి 11: 30,31

*యెఫ్తా*:
తండ్రి: గిలాదు
తల్లి: వేశ్య
• గిలాదు భార్యకు పుట్టిన కుమారులు మాలో నీకు స్వాస్త్యము లేదని యెఫ్తాను ఇంటి నుండి గెంటి వేసారు.
• యెఫ్తా టోబు దేశములో నివసిస్తూ అక్కడ అల్లరి మూకను అనుచరులుగా చేసుకొని జీవిస్తున్నాడు.
• గిలాదు మీదికి అమ్మోను రాజు యుద్ధం ప్రకటించగా, గిలాదు పెద్దలంతా కలసివెళ్లి, యెఫ్తాను తీసుకొని వచ్చి, అతనిని వారి మీద ప్రధానిని చేసారు.

యెఫ్తా అమ్మోనీయుల మీదికి యుద్ధానికి బయలుదేరుతూ దేవునికి ఒక ప్రార్ధన చేస్తున్నాడు. *నీవు యుద్ధంలో విజయమిస్తే? అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొను టకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దానిని అర్పిస్తాను*.

తాను చేసిన మ్రొక్కుబడిని బట్టికాదు గాని, దేవుడు ముందుగానే ఇశ్రాయేలీయులకు విజయం ఖాయం చేసాడు. మ్రొక్కుకొనక పోయిననూ విజయం వారిదే.

*విజయోత్సవంతో తిరిగి వస్తున్న తన తండ్రిని ఎదుర్కోవడానికి తన ఏకైక కుమార్తె చెప్పలేనంత సంతోషంతో తంబురలతోను నాట్యముతోను బయలు దేరి తండ్రిని ఎదుర్కొంది.*

తండ్రి ఆనందం ఆవిరయిపోయింది బట్టలు చించుకొని రోధిస్తున్నాడు. దేవుని సన్నిధిలో తాను చేసిన ఒక తొందరపాటు మ్రొక్కుబడి, అతనిని కృంగదీసింది. అయిననూ, దేవుని కిచ్చిన మాటను వెనుకకు తీసుకున్న వాడు కాదు యెఫ్తా.

*బైబిల్ గ్రంధ చరిత్రలో ఒక మనిషిని బలిగా అర్పించిన సందర్భం ఇదొక్కటే. అయితే, మనకు మరోలా అనిపిస్తుంది, ఆ దినాన్న అబ్రహామును అడ్డగించిన దేవుడు, ఇప్పుడెందుకలా చెయ్యలేదని.*

ఈ రెండు సంఘటనలకు చాలా వ్యత్యాసం వుంది. అబ్రాహామును దేవుడే అడిగాడు. నీ కుమారుని బలిగా ఇమ్మని. కాని, యెఫ్తా అయితే, నేను బలిగా అర్పిస్తానని అతనే దేవునికి మ్రొక్కు కున్నాడు. దానికి కట్టుబడి వున్నాడు.

దేవుడు ఈ బలిని ఎందుకు అంగీకరించాడు అంటే? ఇట్లాంటి తొందరపాటు మ్రొక్కుబడులు దేవుని సన్నిధిలో చేయకుండా మనకు గొప్ప హెచ్చరిక ఒకటి కాగా, యెఫ్తా మరియు తన కుమార్తె యొక్క నిజాయితినీ, విధేయతను ప్రపంచానికి తెలియజేయడం మరొక ఉద్దేశ్యం కావొచ్చు.

*యెఫ్తా జీవితం ద్వారా రెండు విషయాలు గ్రహించాలి.
1. తొందరపడి దేవుని సన్నిధిలో మ్రొక్కుకోకూడదు.
2. ఒకవేళ మ్రొక్కితే? అది తప్పక చెల్లించి తీరాలి.*

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ప్రతిరోజూ వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments