ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా? నా ఇష్టం అనుకుంటున్నావా..?

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా? నా ఇష్టం అనుకుంటున్నావా..?

*యేసూ,* నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.*
            *లూకా  23:42*

యేసు ప్రభువును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు" అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ  ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చిందేమో?

ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందరచేసింది. ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చెయ్యక "యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము". అని అర్ధిస్తున్నాడు.*అది అతని పెదవుల నుండి వచ్చిన మాటకాదు. అతని హృదయాంతరంగంలో నుండి పొంగి పొరలివస్తున్న ఆవేధన.*

కారణం?
అతనికి మూడు విషయాలు అర్ధమయ్యాయి.

*1. ఈ జీవితం తర్వాత, మరొక శాశ్వత జీవితం వుంది.
2. ఆయన రాజు
3. ఆయనకొక రాజ్యముంది.
అది శాశ్వత రాజ్యం. ఆరాజ్యంలో నేను కూడా వుండాలని.
పశ్చాత్తాపంతో కూడిన ఆ చిన్ని ప్రార్ధన అతనిని పరదైసులో చేర్చగలిగింది.*

...ఆ దొంగలో వచ్చిన పశ్చాత్తాపంగాని, ఈ జీవితం తర్వాత మరొక శాశ్వత జీవితం వుందని, ఆయన ఒక రాజు, ఆయనకొక రాజ్యం వుంది అనే గ్రహింపు మాత్రం మనకు లేనేలేదు. అట్లాంటి గ్రహింపులేని ప్రార్ధన దేవుని చేత అంగీకరించబడదు.

*ఆయనెవరో నీవు అర్ధం చేసుకొని పశ్చాత్తాపముతో ప్రార్ధించ గలిగితే? నీవెవరవు అయినా కావొచ్చు. నీ గత జీవితం ఏదయినా కావొచ్చు. ఆయన నిన్ను ఎన్నటికి ప్రశ్నించడు. నీ గత జీవితాన్ని ఆయన ఎప్పటికీ  జ్ఞాపకం చేసికొనడు.*

అట్లా అని, ఆయన మంచితనాన్ని చులకన చేసే ప్రయత్నం చేస్తే? మన బలము, మన ధనము, మన జ్ఞానము  మరేదీ ఆయన ఉగ్రత నుండి తప్పించలేవు.

*ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా? ప్రభు రాత్రి భోజనం లో పాలుపొందలేదు కదా? నేనెందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు ప్రభు రాత్రి భోజనం ఆచరించాలి? ఆ దొంగ ప్రార్ధించినప్పుడు అతడు పరదైసుకు చేరాడు కదా?  ప్రార్ధిస్తే నేనెందుకు చేరను? అంటూ ....
నిన్ను నీవే మోసం చేసుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. ఆ నిత్య మరణానికి దగ్గరకావొద్దు. ఎందుకంటే ఆ దొంగ చివరి ఘడియలో మరణ తీర్పులో ఉన్నాడు. నీవు సిలువమీద లేవు, మరణతీర్పులో చివరి ఘడియలలో కూడా లేవు. దొంగకు భాప్తిస్మం తీసుకొనే అవకాశం లేదు, నీకుంది.*

ఇక వాయిదా వెయ్యొద్దు. నేడే ఆ శాశ్వత రాజ్యంకోసం పశ్చాత్తాపపడి, ప్రభుపాదాల చెంత ప్రణమిల్లుదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఓపెన్ చేసి ప్రతిరోజూ వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఫాలో క్లిక్ చేయండి.

Comments

Popular posts from this blog

యేసుప్రభువు సిలువలో పలికిన 7 మాటల ధ్యానం

దావీదు దేవుని హృదయానుసారుడు..కానీ..

ప్రార్థన మందిరం