*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
ఆవగింజ చాల చిన్నది.. ఐనా జీవితాన్ని మార్చేస్తుంది.
...మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మత్తయి సువార్త 17:20
ఆవగింజ చాల చిన్నది. ఐనా అది పెద్ద మొక్కగా పెరుగుతుంది. అలాగే దైవరాజ్యం మొదట చాల చిన్నది. అది మొదటలో క్రీస్తు, అతని శిష్యులు మాత్రమే. ఐనా అది మహారాజ్యంగా విస్తరిల్లి లోకంలోని నరులందరికీ ఆశ్రయమిస్తుంది. పెరుగుదల ఇక్కడ ముఖ్యాంశం. కావున మనకు ఆవగింజ విశ్వాసం వుంటే చాలు మనం విస్తరించడానికి. ఆత్మీయుల ప్రారంభం ఎప్పుడూ సింపుల్ గానే ఉంటుంది. దేవుడు వారిని విస్తరింపచేస్తాడు.
👉 క్రీస్తుకి తన జీవిత కాలంలో గుర్తింపు లేదు. అతని శిష్యులు అనామకులు. ఐనా ఈ చిన్న బృందం ప్రారంభించిన దైవ రాజ్యం 300 ఏండ్లల్లోనే మహా శక్తిమంతమైన రోమను సామ్రాజ్యాన్ని లొంగదీసికొంది. ఆ పిమ్మట ప్రపంచమంతటా వ్యాపించింది. ఇంకా, క్రైస్తవ మతంలో చేరకపోయినా క్రీస్తు రాజ్యానికి చెందిన భక్తులు ఇతర మతాల్లో కూడ వున్నారు. వీళ్ళతో కలుపుకొంటే దైవరాజ్యం ఇంకా పెద్దది. క్రీస్తు రాజ్యం ప్రారంభంలో చిన్నది, అంతంలో గొప్పది.
👉 దేవుని కార్యాలు కూడ ప్రారంభంలో చిన్నవి. కాని అవి తర్వాత కొండంతలుగా పెరిగిపోయాయి.
*అబ్రాహాము సారాలకు జన్మించిన ఈసాకు నుండి యిస్రాయేలు మహాజాతి ఆవిర్భవించింది.*
*సమూవేలు నుండి అభిషేకం పొందిన దావీదు యువకుని నుండి ఇశ్రాయేలు రాజ్యం పుట్టింది.*
*పండైండు మంది బెస్తల నుండి పుట్టుక వచ్చిన చిన్న సహవాసంతో కూడిన పరిచర్య ఖండాంతరాల వరకు వ్యాపించింది.*
*మన కాలంలోనే మదర్ తెరీసా ఉద్యమం చిన్నకార్యాలతోనే ప్రారంభమై విశ్వమంతటా వ్యాపించింది కదా!*
కనుక మనం కూడ మొదటలో చిన్నవిగా కన్పించే మంచి కార్యాలను ప్రారంభించడానికి వెనుకాడకూడదు, దేవుని దీవెన వల్ల అవే తర్వాత మహాకార్యాలు కావచ్చు. గొప్ప ఉద్యమాలన్నీ మొదటలో చిన్న పనులే కదా!
ఆధ్యాత్మిక జీవితంలో కూడ ఈ పెంపు కన్పిస్తుంది. చిన్నబిడ్డలు సండేస్కూల్ సమయంలో విశ్వాసాన్ని స్వీకరిస్తారు. ఈ విశ్వాసం వారిలో క్రమంగా పెరిగి వారిని దైవభక్తులనుగా మార్చివేస్తుంది. చిన్నప్రాయంలోనే చాలమంది దైవభక్తులుగా మరణించారు కూడ. మరియు గొరెట్టి, డోమినిక్ సావియొు, స్టనిస్లాస్, బర్కుమెన్స్ మొదలైనవాళ్ళ ఈలాంటివాళ్ళ వీళ్ళ కొద్ది కాలంలోనే సిద్ధిని పొంది దీర్ఘకాలం జీవించిన వాళ్ళయ్యారు.
పాలస్తీనా దేశపు ఆవచెట్టు ఏడడుగుల వరకూ పెరుగుతుంది. పక్షులు దాని కొమ్మలను ఆశ్రయిస్తాయి. మన భక్తి విశ్వాసాలే ఓ చెట్టు అనుకొందాం. మన మంచి ఆదర్శం వల్ల, మన సేవల వల్ల ప్రభావితులైనవాళ్ళ కొందరు వచ్చి ఈ చెట్టు ఫలాలు ద్వారా మేలులు పొందుతారు. అనేక జీవితాలు ఆదరణ పొందుతాయి. వారు దేవుణ్ణి మహిమపరుస్తారు.
అది ఆవగింజను పోలియున్నది.
మేము క్రైస్ట్ టెంపుల్ పరిచర్యలో బాగంగా ప్రతి రోజూ దేవుని వాక్యము ఎస్.ఎం.ఎస్ ద్వారా కేవలం ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న కొందరు స్నేహితులకు 10 మందికి మాత్రమే పంపించేవారము. కానీ క్రమంగా దేవుని కృపనుబట్టి నేడు వెబ్ బ్లాగ్, వాట్స్అప్ ద్వారా ప్రతిరోజూ 500 మంది దేవుని వాక్యము చదువుతున్నారు. ఆత్మీయంగా బలపడుతూ వారి సాక్షములు మాకు తెలియచేస్తున్నారు. ఈ గొప్ప కార్యమునుబట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక.
*అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించు నంత చెట్టగును.* మత్తయి సువార్త 13:32
*ఆవగింజ ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలుసుకుందామా..*
పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే వాటిని ఆవాలతో పోలుస్తూ ఆవగింజంత అంటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత. ఆవాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ఆవాల్లో ఉండే ఫోటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్థాల కారణంగా అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది. ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి.ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాలలో విటమిన్ బీ–కాంప్లెక్స్ ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి సమకూరడమే కాకుండా, జీవక్రియలు సమర్థంగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలను తగ్గించి దీర్ఘకాలం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి. ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గుతాయి. రక్తనాళాల్లో పాచిలాగ పేరుకునే అథెరోస్కిలరోసిస్ వంటి కండిషన్లను ఆవాలు నివారిస్తాయి. ఆవాల్లోని విటమిన్–ఏ, ఐరన్, ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టు దట్టంగా పెరగడానికి తోడ్పడతాయి. ఆవాలు రక్తపోటును సమర్థంగా తగ్గిస్తాయి.
ఆవగింజ ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయో చూశారు కదా. అందుకే దేవుడు ఆవగింజ అంత విశ్వాసం వుంటే చాలు అన్నాడు.
ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని
విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదైగొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను.మార్కు సువార్త 4:31-32
ఈ సందేశం చదువుతున్న ప్రియమైన మిత్రుడా నీ జీవితంలో కూడా దేవాది దేవుడు సమృద్ధి ఇచ్చి విస్తరింపచేయునుగాక.
ఆమెన్..ఆమెన్..ఆమెన్
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
No comments:
Post a Comment