*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
పరిశుద్ద జీవితం...
నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.
కీర్తనలు 51:11
దావీదుకు తన భ్రష్ట స్వభావం గురించి పూర్తిగా నిస్సందేహముగా తెలిసిపోయింది.
అయితే, దేవుడు తనను పూర్తిగా తిరష్కరించలేదని, ఆయన ఆత్మను తన యొద్ద నుండి తీసివెయ్య లేదని నమ్మకం వుంది. కాని అట్లా చేస్తాడేమో అని భయపడుతున్నాడు.
దావీదు భయానికి 2 కారణాలు:
1. పాత నిభందన కాలంలో దేవుడు విశ్వాసులకు సత్యాన్ని పూర్తిగా తెలియజేయలేదు.
2. పరిశుద్దాత్మను పూర్తిగా ఇవ్వలేదు.
1."నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము"
*ఒక వ్యక్తి పాపం చేస్తే దేవుని సన్నిధిలోనుండి దేవుడు అతనిని త్రోసివేస్తాడా?
*ఆ వ్యక్తికి దేవునితో సంబంధం తెగిపోతుందా? అట్లా జరుగదు.
పాపము దేవునితో మనకు గల సంబంధాన్ని (Relationship) త్రెంచివేయ్యలేదు. కాని ఆయనతోగల సహవాసంను (Fellowship) త్రెంచివేస్తుంది.
ఉదా: మన తండ్రితో గొడవపడి వేరే చోట జీవిస్తున్నా, మీ తండ్రి పేరేంటి అని అడిగితే, తండ్రిపేరే చెప్తాము. అంటే ఆ సంబంధం అట్లానే కొనసాగుతుంది.కాని ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం వలన "సహవాసం" మాత్రం వుండదు.
ఆదాము ఏదెనులో నుండి గెంటి వేయబడినప్పటికీ, అతడు దేవుని కుమారుని గానే పిలువబడ్డాడు. కానీ, అతడు తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు.
సహవాసం తప్పనిసరి.
తండ్రితో సహవాసాన్ని కోల్పోతున్నందుకే కదా, యేసు ప్రభువు వారు సిలువలో "ఏలీ ఏలి లామా సబక్తా" ( నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి?) అని బిగ్గరగా కేకవేసింది.
2." నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము"
మనం పరిశుద్ధంగా వున్నప్పుడు పరిశుద్దాత్మ మనతో వుండి, పాపం చేసేనప్పుడు వెళ్లిపోతాడా? అట్లా జరుగదు.
పాప క్షమాపణ, రక్షణ, బాప్తీస్మం ద్వారా పొందుకున్న పరిశుద్దాత్మడు మన జీవితాంతం మనతోనే ఉంటాడు.
అయితే, మనం పాపం చేసినప్పుడు మన పాపపు క్రియలు పరిశుద్దాత్ముని మీద కుప్పలాపడి పరిశుద్దాత్ముడు పని చెయ్యకుండా వానిని
అణచివేస్తాయి. తద్వారా పరిశుద్ద జీవితం జీవించలేము.
పరిశుద్ద జీవితం జీవించాలంటే,
1. ఆయనతో సహవాసం కలిగి వుండాలి.
2. శరీర క్రియలు పరిశుద్డాత్ముని సహాయంతో
నియంత్రించు కోగాలగాలి.
అప్పుడు మాత్రమే పరిశుద్ద జీవితం సాధ్యం.
ప్రార్ధనా సహాయంతో శరీర కార్యములను జయించగలగాలి. పరిశుద్ధ జీవితాన్ని జీవించగలగాలి.
ఈ రీతిగా మన జీవితాలను సిద్దపరచు కుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments