🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
పాపముచేస్తున్నప్పుడు ఆనందాన్నిస్తుంది. చేసాక ఆవేదన మిగుల్చుతుంది
"దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము."
కీర్తనలు 51:1
పాపము:
చూడడానికి అందముగా
వుంటుంది. చేస్తున్నప్పుడు
ఆనందాన్నిస్తుంది.చేసాక ఆవేదన మిగుల్చుతుంది.
దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. దావీదు బత్షెబతో పాపం చేసిన సందర్భంలో నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చి
*ఆ మనుష్యుడవు నీవే* అంటూ తన పాపమును బట్టబయలు చేసినప్పుడు, పశ్చాత్తాపముతో ఆయన కృపకై అర్థిస్తూ దావీదు చేస్తున్న ప్రార్ధన.
కృప అంటే?
మన మాటల్లో: .... మన ఇంటికి ఒక దొంగ వచ్చి దొరికిపోయాడు. మనం అతనిని ఏమి చెయ్యకుండా తినడానికి భోజనం పెడితే అది దయ. అంతేకాకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని ఆటో చార్జెస్ కూడా ఇచ్చి పంపిస్తే అది కృప.
ఇది మనకు సాధ్యమా?
కాని నీకోసం ప్రాణం పెట్టిన ఆ మంచికాపరికి మాత్రమే సాధ్యం.
కృప అనే మాట దేవునికి మాత్రమే ఉపయోగించ తగినది.
కృప అంటే?
*అర్హతలేనివాడు అర్హునిగా ఎంచబడడమే కృప*
తాను చేసిన ఘోరమైన పాపాలకు ఏమంచి కార్యముగాని, తాను అర్పించే ఏవిధమైన బలిఅర్పణ గాని తన పాపాన్ని పావనం చెయ్యలేదని గ్రహింపులోనికి దావీదు వచ్చాడు.
పాప క్షమాపణ కలిగేందుకు మిగిలియున్న ఒకే ఒక్క మార్గం ఆయన కృప, కరుణా వాత్సల్యం.
ఇక ఏది ఆయన పాపాన్ని పరిహరించలేదు.
అందుకే ఆయన కృపకై అర్ధిస్తున్నాడు. రోధిస్తున్నాడు.
ఎందుకంటే? క్షమించబడడానికి అతనికి గల అర్హతలు అంటూ ఏమీ లేవు. కానీ, కృప నీకున్న అర్హతలేంటో చూడదు.
ఆయన కృప ఎట్లాంటిదంటే?
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
యెషయా 54:10
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
విలాప 3:22
అందుకే తాను నిర్మూలము కాకుండా ఆయన కృపకై అర్ధిస్తున్నాడు దావీదు.
ఎంతటి ఘోరపాపమైనా!
ఎవ్వరితో చెప్పుకోలేనిది
అయినా సరే !
ఆయన పాదాల చెంత చేరుదాం!
ఆయన కృపకై అర్ధిద్దాం!
"దేవా, పాపినైన నన్ను కరుణించు"
లూకా 18:13
ఈ చిన్న ప్రార్ధన, నీ అతిక్రమములను తుడిచివేయ గలదు. నీవు కోల్పోయిన సమాధానాన్ని కృపతో తిరిగి నీజీవితంలో ప్రతిష్టించ గలదు.
విరిగిన మనస్సుతో ప్రార్ధిద్దాం!
పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments