*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
ఈ పెద్ద కుమారుడు..ముస్లింలకు మూల పురుషుడు..
అబ్రాహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా
ఆది 17:18
ఇష్మాయేలు:
• అడవి గాడిద వంటి మనుష్యుడు.
• ముస్లింలకు మూల పురుషుడు.
• అబ్రాహాముకు పెద్ద కుమారుడు.
ఇతడు ఐగుప్తురాలైన హాగరుకు అనగా తన దాసికి పుట్టిన వాడు. దాసి యైన హాగరుకు పుట్టినా, తన భార్యయైన శారాకు పుట్టినా అబ్రాహాము,శారాలకు కుమారుడే. ఆ దినాలలో అట్లాంటి చట్టం అమలులో వుండేది.
• ఇష్మాయేలు పెద్దకుమారుడైనప్పటికీ, వాగ్ధాన పుత్రుడు కాదు. అతనితో దేవుడు తన నిబంధన స్థిరపరచలేదు.
ఒకరకంగా చెప్పాలంటే? ఇష్మాయేలు దేవుడిచ్చిన కుమారుడు కాదు. అబ్రాహాము, శారాలు కోరుకున్న కుమారుడు.
ఎందుకంటే?
దేవుని వాగ్ధాన నెరవేర్పు ఆలస్యమైనప్పుడు, శారా ఇక నిరీక్షించలేక, తన దాసి యైన హాగరును అబ్రాహామునకిచ్చి ఆమెతో పిల్లలను కనమని అతనికి అప్పగించింది. దాని ఫలితమే ఇష్మాయేలు.
మరియు దేవుడునీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు;
ఏలయనగా ఆమె పేరు శారా
నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను.
ఆది 17:15,16
*అట్లాంటి సందర్భములో అబ్రాహాముకి కాస్త అనుమానం కలిగి యుండవచ్చు. ఈ వయస్సులో సాధ్యమా అన్నట్లు. అందుకే, ఎందుకైనా మంచిది అన్నట్లు, నా పెద్ద కుమారుడైన ఇష్మాయేలును మాత్రం త్రోసివేయవద్దు అతనిని నీ సన్నిధిలో బ్రతకనివ్వు. అంటూ ప్రార్ధించాడు అబ్రాహాము.*
ఇష్మాయేలును గురించిన ప్రార్ధన విని, అబ్రాహాముకు దేవుడు ఈ రీతిగా వాగ్ధానమిచ్చాడు.
ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
ఆది 17:20
వాగ్ధాన మిచ్చిన దేవుడు తప్పిపోడు. వారు నివసించే ఎడారి ప్రాంతాలను సహితం, నూనె బావులతో నింపి, విస్తారముగా వారిని ఆశీర్వదించాడు. దానికి కారణం అబ్రాహాము చేసిన ప్రార్ధనా ఫలితమే.
*అవును! ప్రార్ధన, ఎడారి వంటి మన జీవితాలను సహితం, సస్యశ్యామలం చెయ్యగలదు*.
ప్రార్ధిద్దాం! పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments