పరలోకము వెళ్ళాలంటే ఏమి చేయాలి?

  *CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

పరలోకము వెళ్ళాలంటే ఏమి చేయాలి?

మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను..

పరలోకము చేరడము చాలా కష్టమని,దానిని చేరుటకు ప్రతి క్షణము  అత్యంత జాగ్రతగా మనము ఈ లోకములో జీవించాలన్న విషయము మనకు తెలుసు. ఈ సందేశమును అయిదు పాయింట్స్ గా పొందుపరచడం జరిగింది. ఆసక్తిగా ధ్యానం చేద్దామా...

1) మొదటగా పరలోకము  వెళ్ళాలి అనే కోరిక ఉండాలి.
లూక13:23
ఒకడు-  ప్రభువా ,రక్షణ పొందువారు కొద్దిమందేనా? అని ఆయనను(యేసు) అడుగగా అయన వారిని చూసి- ఇరుకు ద్వారమున ప్రవేశిoప పోరాడుడి; అనేకులు ప్రవేశిoప జూతురు గానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. పరలోకము కోసము ఉన్న ఈ చిన్నపాటి జీవితకాలములో పోరాడాలి అని అంటున్నాడు.

2) రెండవదిగా పరలోకము కావాలంటే జయించాలి.
a)ప్రకటన 2:7
జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింప నిత్తును.
b) ప్రకటన 2:11
-జయించువాడు రెండవ మరణము వలన ఏ హనీయు చెందడు.
  c)ప్రకటన 2:17
జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును
  d) ప్రకటన 3:5
జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంధములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక ,నా తండ్రి యెదుటను అయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
e) ప్రకటన 3:12
జయించువానిని......... నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
f) ప్రకటన 3:21
నేను జయించి నా తండ్రితో కూడా అయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను
పై వచనములో ఉన్నవన్ని పొందాలంటే జయించాలి అని అంటున్నాడు.

3) మూడవదిగా దేనిని జయించాలి?
  ప్రకటన 3:21
నేను జయించి నా తండ్రితో..... ఈ వచనములో యేసు దేనిని జయించి పరలోకము వెళ్ళాడో తెలుసుకుంటే అర్థము అవుతుంది. యేసు దేనిని జయించాడో మనము కూడా అదే జయించాలి. యేసు ఏమి జయించాడో చూస్తే   యోహాను 16:33
నేను లోకమును జయించి యున్నాను అనెను... అనగా యేసు లోకాన్ని జయించాడు. కనుక మనము లోకమును జయించాలి.

4) నాలుగవదిగా లోకములో దేనిని జయించాలి,ఎలా జయించాలి??
1యోహాను 5:4
దేవుని మూలముగా పుట్టిన వారందరు లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వసమే. లోకాన్ని జయించాలంటే ముందు దేవుని మూలముగా పుట్టిన వరమై ఉండాలి. అనగా దేవుని సంభందులై ఉండాలి. దేవుని సంభందులు మాత్రమే లోకాన్ని జయిస్తారు. లోకములో దేనిని జయించాలో చూస్తే

యీర్మియా 17:9
హృదయము అన్నిటి కంటే మోసకరమైనది ; అది ఘోరమైన వ్యాధి కలది. మన హృదయాన్ని జయించాలి. ఈ సందేశము చదువుతున్న నీవు ఒకసారి మిమల్ని మీరు ప్రశ్నించుకొండి నా హృదయము మోసకరమైనదా కాదా అని.. 
మత్తాయి22:36
పూర్ణ హృదయముతో దేవునిని ప్రేమించాలి అని ఉంది. పూర్ణ హృదయముతో ప్రేమించడము అనగా మనస్సులో అందరి కంటే, అన్నిటి కంటే దేవునికే ప్రధమ స్థానమిచ్చి దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. అంటే ప్రధమ స్థానము దేవునికి ఇవ్వాలి. మన హృదయములో అన్నిటి కంటే, అందరి కంటే దేనికి, ఎవరికీ ప్రధమ స్థానము ఇస్తున్నాము????? మన పూర్ణ హృదయముతో ఎవరిని ప్రేమిస్తున్నాము? దేవుడినా లేక వక్తినా లేక ధనమునా లేక బంగారమునా లేక అస్తులనా లేక వస్తువులనా లేక ప్రియుడినా లేక ప్రేయసి నా???????? ఈ 66 పుస్తకాల జ్ఞాన గ్రంధమైన bibleను పరిశోధించి నేర్చుకుంటే తప్ప దేవుడు అర్థము కాడు.  దేవుని భాద, కోరిక, ఆశ, ఆశయము ఇలా మనకు తెలియాలి. మన కొరకు ఎన్ని అడగకుండా చేసాడో తెలియాలి. మనకు ఇవ్వన్ని అర్థంకావాలంటే అను క్షణము దేవుని గూర్చి ఆలోచించాలి,వాక్యాన్ని ధ్యానించాలి.. కనుక హృదయాన్ని జయించాలి.

5) హృదయములో వేటిని జయించాలి??
మార్కు7:21
లోపలినుండిఅనగమనుష్యులహృదయములోనుండిదురాలోచనలును,జారత్వముములును, దొంగతనములును,నరహత్యలును,వ్యబిచారములును ,లోభములును,చెడుతనములును ,కృత్రిమమును ,కామవికారమును ,మత్సరమును ,దేవ దూషణయు ,అహంభావమును ,అవేకమును వచ్చును. ఇవి మనుష్యుని ఆపవిత్ర పరుచునని చెప్పెను.
కనుక ఒక్కసారి మన హృదయమును మనలను పరీక్షించుకుందాము. ఏ ఏ  బలహీనతలు ఉన్నవో వాటి నుండి జయించుటకు నేడే ఈ క్షణమే ప్రయత్నిద్దాము. మరు క్షణమే కన్ను ముస్తే ఎక్కడికి వెళ్తామో ఆలోచించండి. కనుక యేసు ఏ విధముగా అన్నిటిని జయించి పరలోకము వెళ్ళాడో అలానే మనము కూడా చనిపోయే లోపు మన బ్రతుకులో ఉన్న బలహీనతలను ఒక్కొక్కటిగా జయించి పరిశుద్దముగా జీవించుదాము.
*దేవాది దేవుడు మిమ్ములను దీవించును గాక*

  *CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments