🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నీ ప్రతీ అవయవం నీమీద సాక్ష్యం చెబుతాయి
అప్పుడాయన – నీవు చేసిన పనిఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.
ఆదికాండము 4: 10
• అర్పించబడే అర్పణకంటే, అర్పించేవానిలోనే లోపం వుంది అనే విషయాన్ని కయీను గ్రహించలేకపోయాడు.
• నా అర్పణ దేవునిచే అంగీకరించ బడక పోవడానికి కారణం హేబేలే అనుకున్నాడు తప్ప, తానే కారణం అనే విషయాన్ని అంగీకరించలేక పోయాడు.
• 'ద్వేషం' కట్టలు తెంచుకొంది. అది సృష్టిలోనే మొట్ట మొదటిగా హేబేలును హత్య చేయించి, కయీనును నరహంతకునిగా నిలిపింది.
అంతవరకూ భూమి మీద శారీరికంగా ఎవ్వరూ మరణించ లేదు.శరీరాన్ని గాయపరిస్తే? రక్తంకారి, చనిపోతాడని కయీనుకు తెలియకపోవచ్చు. ఒకవేళ ఏ జంతువైనా అట్లా చనిపోవడం అతనికి తెలుసేమో? ఏది ఏమయినా హత్య జరిగిపోయింది. ఒక వేళ తలిదండ్రులకు భయపడి, వారికి కనబడకుండా పూడ్చి పెట్టేసాడేమో? కాని, దేవునికి దాచి పెట్టలేడు కదా?
అయితే, హేబేలు రక్తం దేవునికి మొరపెట్టింది. దేవుడు దిగివచ్చాడు.
కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? అంటూ ప్రశ్నించాడు. ఇప్పుడు కయీనుకు మంచి అవకాశం వచ్చింది. దేవా! నాకు శరీరాన్ని గాయపరిస్తే ఇట్లా చనిపోతాడని తెలియదు. నన్ను క్షమించు అంటూ ఆయనను బ్రతిమలాడితే బాగుండేది?
కాని అట్లా చెయ్యలేదు. ఒప్పుకోకుండా, కప్పుకున్నాడు.
దేవుడు తన అర్పణను అంగీకరించ లేదని దేవునిపైనా కోపంతో వున్నాడేమో కయీను.
నేను నాతమ్మునికి కాపలావాడినా?అంటూ ఎదురు తిరిగాడు. వెంటనే దేవుడు కయీనుతో నీవు చేసిన పనిఏమిటి? నీ తమ్ముని రక్తం నేలలోనుండి నాకుమొరపెడుతుంది. నీవు నేలమీద ఉండకుండా శపింపబడ్డావు. నేల తనసారం నీకుఇవ్వదు. నీవు దేశదిమ్మరిగా తిరుగుతావు అనిశపించారు.
రక్తం ఏమిటి? నేలలోనుండి మొరపెట్టడం ఏమిటి? అనుకొంటున్నావా?
అవును! అది మానవ స్వరంతోనే మొరపెట్టింది అని తలంచ నవసరం లేదు. నీ రక్తమే కాదు.
నీ ప్రతీ అవయవం నీమీద సాక్ష్యం చెబుతాయి.
*బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. కీర్తనలు 50:5*
అంతే కాదు. నీవు ఏం చేసినా అది ఆకాశం క్రిందను మరియు భూమిపైన చేస్తావని మర్చిపోకు. ఈరెండు నీమీద సాక్ష్యం పలుకుతాయి.
*యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు. యెషయా 1:2*
*దేవుని కంటికి మరుగైనది ఏమిలేదని తెలుసుకో! నీవు ఏం చేస్తున్నా నీ ప్రతీ కదలిక ఆయనకు తెలుసు అనే విషయం గుర్తుంచుకొని ఆయన కిష్టమైన జీవితాన్ని జీవించు*.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments