🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నీ దృష్టి గాలివైపుకు మళ్ళిందా..?
*పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను*.
మత్తయి 14:28
అది నాలుగవ జాము. అంటే? తెల్లవారు జాము 3 నుండి 6 గంటల మధ్య సమయం. యేసు ప్రభువు శిష్యులు నావలో ప్రయాణిస్తున్నప్పుడు అది గాలిచేత కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఎవరో నీటి మీద నడచుకొంటూ వారి వైపే వస్తున్నారు.
రక్త మాంసములు గల మనుష్యులు నీటి మీద నడవడం సాధ్యం కాదు.
నేటి దినాలలో నీటి మీద నడిచేవారిని యూట్యూబ్ లో చూస్తున్నాము. వారు నీటి ఉపరితలానికి కొన్ని సెంటీ మీటర్ల లోపల పారదర్శకమైన గ్లాస్ ను అమర్చుతారు. దాని మీద నడుస్తూ వుంటే? మనకు నీటి మీద నడచి నట్లు అనిపిస్తుంది. అంతే.
అంటే? ఇక తప్పకుండా భూతమే అయ్యుండాలి. అవును! వాళ్ళు కూడా అదే నిర్ణయానికి వచ్చేసారు.
వారు భయముతో వణికిపోతూ కేకలు వేసేకొలదీ, ఆయన వారికి ఇంకా సమీపముగా వచ్చేస్తున్నాడు.
*'భయపడవద్దు' నేనే అని యేసు ప్రభువు చెప్పారు. పేతురు ఆ మాటకు వెంటనే ప్రతిస్పందించాడు*.
పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
మత్తయి 14:28
మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
2 కొరింది 3:5
*యేసు ప్రభువు వారు రమ్మన్నప్పుడు, ఆయన మీద విశ్వాసముంచాడు. కాని అది పరిపూర్ణమైనది కాదు. అంటే? కొంచెం విశ్వాసమున్నా అసాధ్యమైన పనులు మనచేత దేవుడు చేయిస్తాడు.*
పేతురు నీటి మీద నడుస్తున్నాడు కాని, ఆయన దృష్టి మాత్రం యేసయ్యమీదే వుంది. కాబట్టి యేసయ్యవలెనే నడవ గలుగుతున్నాడు. ఈ లోపు గాలి వీచడం మొదలయ్యింది. పేతురు దృష్టి గాలివైపుకు మళ్ళింది. నీటిలో మునిగిపోతూ రక్షించు ప్రభువా అంటూ కేకలు వేస్తున్నాడు.
*'గాలి' లోకానికి సూచనగా వుంది. నీ దృష్టి ఆయన వైపు నిలిపి నడవ గలిగితే? నీ చుట్టూ నున్న గాలి
(లోకం) నిన్నేమి చెయ్యలేవు. నీ దృష్టి లోకంవైపు మళ్లినదంటే? పాపంలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోవలసిందే*.
ఒకవేళ ఇప్పటికే పాపములో మునిగిపోతూ వుంటే? 'ప్రభువా నన్ను రక్షించు' అని నేడే ప్రార్ధించు.
ఆయన తప్పక రక్షిస్తాడు.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments