ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేజార్చుకోకూడదు

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేజార్చుకోకూడదు

అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా,

ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.

అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.
             లూకా 18:38-40

•యెరికో పట్టణములో త్రోవప్రక్కన ఒక గ్రుడ్డి భిక్షకుడు భిక్షాటన చేస్తున్నాడు.
• ఆ మార్గం గుండా పెద్ద జనసందోహం కదలి వస్తున్నట్లుగా శబ్దాన్నిబట్టి గ్రహించి, ఆ మార్గం గుండా 'నజరేయుడైన యేసు' వస్తున్నట్లుగా సమాచారం తెలుసు కున్నాడు.
• ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చేజార్చుకోకూడదని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
• కేకలు వేయడం అతనికి క్రొత్తేమి కాదు. రోజూ చేసేపని అదే. కాని, ఈరోజు కేకలు అట్లాంటివి కావు. రోజూ వేసే కేకలు పైసలను ఆశించి వేసేవి. కాని, ఈరోజు కేకలు పైసలు కోసం కాదు.
ఎందుకంటే?  అతనికి తెలుసు. *ఆయన తన జీవనం కోసం పైసలిచ్చేవాడు కాదని, తన జీవితాన్నే మార్చి జీవింప చేయగలవాడని*.

అతను తెలుసుకున్న సమాచారం 'నజరేయుడైన యేసు' వస్తున్నాడని. కాని అతను ఎట్లా కేకలు వేస్తున్నాడో చూడండి.

*యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా*,
               లూకా 18:38

'దావీదు కుమారుడా' అనేది పాత నిబంధన ప్రస్తావన. 'యేసు' అనేది నూతన నిబంధనా ప్రస్తావని. అంటే? ఇతనికి రెండూ తెలుసు. అదే సమయంలో ఈయన రక్షించేవాడని, స్వస్థపరచేవాడనీ తెలుసు. అందుకే ప్రజలు ఊరకుండుమని చెప్పేకొలదీ మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆ *విశ్వాస సహితమైన కేకలు యేసయ్యను నిలబెట్టేసాయి*.

అవును! *పిలిస్తే దాటిపోయేవాడు కాదు ఆయన*. నిలిచాడు. అతనిని స్వస్థ పరిచాడు.

*యేసు చూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను*;
              లూకా 18:42

వెంటనే చూపు పొంది, ఆయనను మహిమపరస్తూ ఆయనను వెంబడించాడు. దానిని బట్టి అనేకులు దేవుని స్తుతించారు.

*కన్నులుండియూ ఆత్మీయ అందత్వంలో జీవిస్తున్నామేమో? ఆయన సమీపముగా నుండగానే, మనలను దాటిపోకమునుపే, ఆయన పాదాల చెంత చేరుదాం*!

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్*!

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments