🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు
*కుష్ఠము*:
• ఆనాటి కాలంలో అంటరాని, వెలివేయబడిన జీవితం.
• అసహ్యకరమైన స్థితి.
• పాపమునకు సాదృశ్యము.
• స్పర్శ లేని వ్యాధి
• చిన్న మచ్చతో ప్రారంభమై చివరికి మరణానికి అప్పగించేస్తుంది.
• పాపమూ అంతే. చిన్నగా ప్రారంభమై చివరకు మరణానికి అప్పగించేస్తుంది.
• కుష్ట రోగము ముదురుతున్నా వారికి ఎట్లా నొప్పి తెలియదో? అట్లానే, పాప రోగము ముదురుతున్నా నొప్పి తెలియదు. దానిలో బండదేరిపోతాయి మన దేహాలు. కాని దాని అంతము ఘోరము.
*ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను*.
మత్తయి 8:2
కుష్ఠరోగి సమాజం మధ్యకు రావడానికి వీలులేదు. వారిని ఎవ్వరూ ముట్టకూడదు. కాని, ఈ రెండు పనులూ ఇక్కడ జరుగుతున్నాయి.
అంటే? ఈ వ్యక్తి గొప్ప సాహసమే చేస్తున్నాడు. సమాజం మధ్యకు రావడానికి, ఆయన చెంతకు రావడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉంటాడు.
ఎందుకింత సాహసం?
అతడు అశుద్ధుడని గ్రహించగలిగాడు.
దానిని స్వస్థపరచగల సమర్ధుడు యేసు ప్రభువు అని విశ్వసించాడు.
అతని ప్రార్ధనలో ఎంత దీనత్వం వుందో చూడండి. *ప్రభువా! నీకు ఇష్టమైతే నన్ను శుద్దునిగా చెయ్యి*. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి.
ఆయన అంటున్నాడు 'నాకిష్టమే'. అంటూ.. ఆయనను ముట్టుకున్నాడు. నీవు శుద్దుడవుకమ్ము అని చెప్పాడు. తక్షణమే వాని కుష్టరోగము శుద్ధిఅయ్యింది. (కుష్టు రోగిని తాకే సాహసం ఎవ్వరూ చెయ్యరు. కాని, ఆయన ప్రేమ అవధులు లేనిది.) అవును!
యేసు ప్రభువును సహాయము అడిగినప్పుడు ఆయన కాదనిన సందర్భాలుగాని, ఆయన చెంతకు వచ్చినవారిని త్రోసివేసిన సందర్భాలుగాని లేనేలేవు.
*అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను*
మత్తయి 8:4
ఈ మాటలు నేటి సేవకులకు అర్ధం కాలేదేమో? లక్ష మంది సభలకు వస్తుంటే? తొంబై తొమ్మిదివేల తొమ్మిది వందల తొంబైమంది వట్టి చేతులతో( ఖాళీ హృదయాలతో) తిరిగి వెళ్లిపోతుంటే వీరికి ఎట్లాంటి బాధాలేదుగాని, మిగిలిన ఆ పదిమందితో సాక్ష్యాలు చెప్పించుకొని, దేవునికి మహిమ అనే పేరుతో వారిని వారు ఘన పరచుకొంటున్నారు. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నీవు పొందుకున్న స్వస్థను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని.
*చివరిగా ఒక్కమాట*!
*పాపమనే కుష్టము నుండి మనము శుద్దులము కావాలంటే? ఆయన చెంతకు చేరాలి. ఆయన చిత్తానికి మనలను అప్పగించుకోవాలి. ఇదే జరిగితే? గతించిన కాలంలో నీ జీవితం ఏదయినా కావొచ్చు. ఆయన తప్పక నిన్ను శుద్దీకరిస్తాడు*.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్*
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే
వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి
Comments