🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible Sermons by Pastor NAKKOLLA BALASUBRAMANYAM (DANIEL)
*యబ్బేజు ప్రార్ధన*
యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
1దిన 4:10
యబ్బేజు అంటే "వేధన పుత్రుడు "
తాను పుట్టిన సమయములో తన తల్లికి వేధన పుట్టించాడు. కాని తన జీవిత కాలంలో దేవునికి ఆనందాన్ని కలిగించాడు.
పరిశుద్ధ గ్రంధములో యబ్బేజును గురించి కేవలం రెండు వచనాలు మాత్రమే వ్రాయబడ్డాయి. అయినప్పటికీ తాను పొందిన ఘనత అద్భుతమైనది.
"యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను"
1దిన 4:9
యబ్బేజు ఎందుకు తన సహోదరులకంటే, ఘనత పొందాడు అంటే? ఒక్కటే కారణం తాను దేవునికి చేసిన ప్రార్దనే.
యబ్బేజు ప్రార్ధనలోని నాలుగు అంశములు.
1. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు:
ఆశీర్వాదం అంటే?
పూర్వ కాలములోఎక్కువమంది పిల్లలు, ఎక్కువ పశుసంపద వుంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. అదే ఆశీర్వాదం.
ఈ కాలములో కార్లు, భవనాలు, బ్యాంక్ బ్యాలెన్సు వుంటే? వారు ఆశీర్వధించ బడినవారు అంటున్నాము
ఇదేనా ఆశీర్వాదం ?
అయితే, యాకోబుకి అప్పటికి 11 మంది పిల్లలు వున్నారు. అప్పటికి ఇంకా బెన్యామీను పుట్టలేదు. లెక్కలేనంత పశుసంపద వుంది. కాని, యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. దేని కోసం?
"నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను."
ఆది 32:26
అంటే? యాకోబుకు అవేమి ఆశీర్వాదాలవలే కనిపించలేదు. నిజమే. ఆయనను కలిగి యుండడమే ఆశీర్వాదం. ఆశీర్వాదాలకు కర్తయైన దేవునిని కలిగియుంటే? ఇక ఆశీర్వాధాలతో పనిలేదు.
క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
ఎఫెస్సి 1:3
ఆత్మ సంబంధమైన ఆశీర్వాధాల కోసం ప్రార్ధిస్తే? శారీరిక సంబంధమైన ఆశీర్వాధాలు వాటంతటవే వస్తాయి.
2. నా సరిహద్ధులు విశాలపరచు:
దావీదు ఇట్లా ప్రార్దిస్తున్నాడు.
"నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకినన్ను ఎక్కిం చుము."
కీర్తనలు 61:2
మన ఆస్థులు, అంతస్తుల యొక్క సరిహద్ధులు విశాలపరచమని కాదు. మన ఆత్మీయ సరిహద్ధులు. ఆ సరిహద్ధులు మనము ఎక్కలేనంత ఎత్తైన ఆనుభవాలుగా వుండాలి.
3. నీ చెయ్యి నాకు తోడుగా వుండనివ్వు
ఆసాపు ఇట్లా అంటున్నాడు:
నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు.
శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.
కీర్తనలు 73:25,26
ఈ మాటలు మనము చెప్పగలిగే పరిపూర్ణత లోనికి రావాలి. నిజమే! ఆయన తోడుగా వుంటే? అగ్ని గుండం కూడా ఆహ్లాదకరంగానే వుంటుంది.
ఆయన పాపిని ప్రేమిస్తాడు. పాపమును కాదు. ఇప్పటి వరకు మనకు తోడుగానున్న పాపమును విడచి పెడితే? అప్పుడు ఆయన తోడుగా వస్తాడు.
4. నాకు కీడు రాకుండా నన్ను తప్పించు:
కీడు రాకుండా చూడు. వచ్చినా దానిలోనుండి తప్పించు. కీడు రప్పించేవాడు సాతాను. వాడి చేతిలో నుండి తప్పించమని ప్రార్ధించాలి. ఎవరిని మ్రింగుదునా అని వాడు గర్జించు సింహమువలే తిరుగుతున్నాడు. మన చూపులు, తలంపులు, క్రియల ద్వారా మన మీదికి కీడు రప్పించాలని వాడు చేసే ప్రయత్నాల నుండి తప్పించమని దేవునిని ప్రార్ధిద్దాం.
యబ్బేజు ప్రార్ధన తనను తన సహోదరులలో ఘనునిగా చేసింది. మన ప్రార్ధన కూడా మనలను అట్టి ఘనతకు పాత్రునిగా చెయ్యాలి.
ఘనత అంటే ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు కాదుగాని, ఆయనను కలిగి యుండడమే నిజమైన ఘనత. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
No comments:
Post a Comment