🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నీ భాద్యత గుర్తుందా?
మోషే గురించి దేవుడే ప్రత్యక్షముగా చెప్పుతున్న సాక్ష్యం.
•మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
•అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.
•నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; •అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును.
ఇట్లాంటి వ్యక్తి మీద తన సహోదరి(మిర్యాము),
సహోదరుడు(ఆహారోను) తిరుగుబాటు చేసారు.
సాత్వీకము గలిగిన మోషే ఒక్కమాటకూడా మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు. అయితే దేవుడు కలుగుజేసుకున్నాడు.
దేవునికోపం వారిమీద రగిలింది. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. దేవుని కోపానికి ప్రతిఫలం మిర్యాముకు 'హిమమువంటి తెల్లని కుష్ఠు'
యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.
మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను.
సంఖ్యా 12:9,10
(ఆహారోను తన సహోదరితో మాట కలిపినప్పటికీ సమస్యకు ప్రధాన కారణం మిర్యామే అయ్యుండవచ్చు.
లేదా
అహరోనును దేవుడు దండించక పోవడానికి కారణము
దేవుని అభిషేక తైలము ఇంకా అహరోను తలమీద ఉంది
అతను ప్రధాన యాజకుడు
మరో ప్రధాన యాజకుడు లేడు
అందుకే కనికరించి వదిలేసి ఉంటారు దేవుడు
అందుకే మిర్యామును మాత్రమే దండించి ఉంటారు)
• అట్లాంటి సందర్భములో మోషే తన సహోదరి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు.
మోషే యెలుగెత్తిదేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱ పెట్టెను.
సంఖ్యా 12:13
• సీనాయి పర్వతం మీద మోషే నలభై రోజులు దేవునితో మాట్లాడుతూ వుండిపోయాడు. ప్రజలంతా ఆహారోను దగ్గరకొచ్చి, ఇక మోషే రాడు. మాకు దేవుడు కావాలి. అని అడిగినప్పుడు, అతడు వారికి బంగారు దూడను చేసి ఇచ్చినప్పుడు, దానిని పూజించడం మొదలు పెట్టారు. దేవుని కోపం వారి మీద రగులుకొనగా... మోషే వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు.
అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలు కొనుచున్నాననెను.
సంఖ్యా 32:32
ఒక్క మాటలో చెప్పాలంటే? వారి ప్రాణాలకు మోషే తన ప్రాణమునే అడ్డుగా పెడుతున్నాడు. నీవు వారిని రక్షిస్తే సరి. లేకపోతే, వారిలో నన్ను కూడా ఒకనిగా చేసెయ్. నీ గ్రంధములో నుండి నా పేరును తుడిచెయ్యి అంటున్నాడు.
ఎవరు వీళ్ళంతా?
మోషే మీద తిరిగుబాటు చేసినవారే. అయినప్పటికీ, వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు.
వారు మన రక్త సంబంధీకులు అయినా, పొరుగువారు అయినా, మనమంతా దేవునిలో ఒకే కుటుంబం. కాబట్టి, రక్షించబడిన మనము విజ్ఞాపన చెయ్యాల్సిన భారం, భాద్యత తప్పక కలిగి యుండాలి.
ఆ భారం నీకుందా?
నీ భాద్యత గుర్తుందా? అయితే,
విజ్ఞాపన చేద్దాం! ఒక్కరినైనా ఆయన వైపుకు త్రిప్పుదాం! నిత్య మరణం నుండి తప్పిద్దాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే ఫాలో బటన్ ఒకే చేయండి. ప్రతిరోజూ వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments