🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel.
శత్రువులను సహితం క్షమించ గలిగినవాడు
స్తెఫను:
1. క్రీస్తు కొరకు చనిపోయిన మొట్టమొదటి హతసాక్షి.
అపో. కా 7:60
2. ఏడుగురు పరిచారకులలో ఒకడు.
అపో. కా 6:5
3. స్తెఫను విశ్వాసముతోను, పరిశుద్ధాత్మ తోనూ నిండుకొనినవాడు.
అపో. కా 6:5
4. కృప తోనూ, బలముతోను నిండుకొనిన వాడు.
స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.
అపో. కా 6:8
5. భూమి మీద నుండే, దేవుని మహిమను, పరలోకంలోనున్న యేసు ప్రభువును చూచినవాడు.
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి
ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.
అపో. కా 7:55,56
6. యేసు క్రీస్తుకు సాక్షి.
అపో. కా 20:20
7. శత్రువులను సహితం క్షమించ గలిగినవాడు.
అపో. కా 7:60
ఇంకా అనేకమంది అయితే, క్రైస్తవ పేర్లు పెట్టుకొంటున్నారు, చర్చ్ కెళుతున్నారు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ బానే పాటిస్తూనే, క్రైస్తవులులా చలామణి అయిపోతున్నారు. క్రీస్తుని మాత్రం అనుసరించలేకపోతున్నారు. క్రైస్తవ్యం లోపించింది. సినీ యాక్టర్ని, పాప్ సింగర్ ని, క్రికెట్ ప్లేయర్ ని ... ఇట్లా కొంతమందిని రోల్ మోడల్స్ గా పెట్టుకుంటున్నారు. వారిలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
స్తెఫను మాత్రం క్రీస్తునే రోల్ మోడల్ గా పెట్టుకున్నాడు. మరణంలో సహితం ఆయననే అనుసరించ గలిగాడు.
సత్యం కోసం నిలబడినప్పుడు స్తెఫనును రాళ్ళతో కొడుతున్నప్పుడు, యేసు ప్రభువు వారు సిలువలో తనకుతాను తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగా, స్తెఫను యేసుప్రభువా! నా ఆత్మను చేర్చుకో అని ప్రార్దిస్తున్నాడు.
ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అపో. కా 7:59
యేసు ప్రభువు వారు తనను హింసిస్తున్న వారి కొరకు ఎట్లా విజ్ఞాపన చెయ్యగలిగారో, స్తెఫను కూడా అదే మాదిరిని అనుసరిస్తూ విజ్ఞాపన చెయ్యగలిగాడు.
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను
అపో. కా 7:60
క్రీస్తుని కలిగియుండి, క్రీస్తుని అనుసరించ గలిగిన వాడే క్రైస్తవుడు. స్తెఫనులా విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను, ఆయన కృపతోను, బలముతోను నిండుకొని,విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగియుందాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments