🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
యేసు ప్రభువు వారు సిలువలో...
మన వ్యక్తిగత అవసరాలు కాకుండా, ఇతరుల క్షేమాన్నికోరి చేసే ప్రార్దనే 'విజ్ఞాపన'.
ప్రార్ధన సామాన్యమైనది. విజ్ఞాపన బలమైనది.
"యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను."
లూకా 23:34
ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
•సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
•39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
• వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం
• ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
•గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
•కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
• ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
• ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి భయానకమైన పరిస్థితులలో కూడా, ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు వారిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు.
"తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".
ఆ దినమే కాదు. నేటికిని ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి, అనుదినమూ మనము చేసే తప్పులు క్షమించమని విజ్ఞాపన చేస్తూనే వున్నాడు.
(అయితే, మనం ఎట్లా జీవించినా పరవాలేదు అనే నిర్ణయానికి వచ్చెయ్యొద్దు. వారు తెలియక చేస్తున్నారు కాబట్టి క్షమించమని ప్రార్దిస్తున్నాడు. తెలిసిచేస్తే క్షమించబడరు. పశ్చాత్తాపపడి, ఆయన చెంతకువస్తే తప్ప.)
మనము ఆయన పిల్లలముగా, మనకు హాని తలపెట్టిన వారిని సహితం క్షమించి, వారి క్షేమం కోరి ప్రార్ధించడానికి యేసు ప్రభువు వారు చూపిన గొప్ప మాదిరి ఇది.
• నశించి పోతున్న ఆత్మలపట్ల భారం కలిగి, విజ్ఞాపన చేసే అనుభవం మనకుండాలి.
• కర్కషంగా మారిన చాంధసవాదులు క్రీస్తు బిడ్డలను చిత్రహింసలు పెడుతూ, మారణహోమం సృష్టిస్తున్నారు. వారిని గూర్చి విజ్ఞాపన చెయ్యాల్సిన భాద్యత మన మీద వుంది.
ఆ భారం నీకుందా?
నీ భాద్యత గుర్తుందా? అయితే,
విజ్ఞాపన చేద్దాం! ఒక్కరినైనా ఆయన వైపుకు త్రిప్పుదాం! నిత్య మరణం నుండి తప్పిద్దాం!
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments