గెత్సేమనే వనములో యేసయ్య

ప్రియమైన నా ఆత్మీయులకు వందనములు. *క్రైస్ట్ టెంపుల్*వెబ్ బ్లాగ్ ను ఈ రోజే *SUBSCRIBE* చేసుకోండి. ప్రతిరోజూ వాక్య సందేశం కోసం మీకు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. డోంట్ మిస్. బ్లాగ్ లింక్ :http://christtemplepdtr.blogspot.in/?m=1

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible sermons by pastor Nakkolla Balasubramanyam (Daniel)

గెత్సేమనే వనములో యేసయ్య

గెత్సేమనే వనములో యేసు ప్రభువు చేసిన ప్రార్ధన.

"కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను."
         మత్తయి 26:39

యేరూషలేము ప్రాకారము బయట కొద్ది దూరములో ఒలీవల కొండ వుంది. దానికి దిగువన గెత్సేమనే తోట వుంది. ఆ తోటలో యేసు ప్రభువువారు మనో వేధనతో చేస్తున్న భారభరితమైన ప్రార్ధన ఇది.

ఆ గెత్సేమనే తోటలో ఆయన ఏకాంతముగా, సాగిలపడి ప్రార్దిస్తున్నప్పుడు, ఆయన చెమట రక్తపు బిందువులవలే మారింది.

సాగిలపడుట 'గొప్ప మనో వేదనను' సూచిస్తుంది.

ఎందుకంత వేదన?
• కొద్దిసేపట్లో దేవుని ఉగ్రతపాత్ర  ఆయన చేతిలోనికి రాబోతుంది.
• శ్రమల పాత్రను అనుభవించవలసి వుంది.

• పాపము ఎరుగని ఆయన శాపముగా మార్చబడే సమయం ఇక ఎంతో దూరంలోలేదు.
• ప్రపంచ మానవాళికి ధర్మ శాస్త్రం విధించే శిక్షను, ఆయన భుజాల మీద వేసుకొని మోసే సమయం దగ్గరవుతుంది.
• కృపా సత్యములు కలసి ముద్దు పెట్టుకొనే సమయం కనుచూపు మేరల్లోనే వుంది.
• అన్నింటికీ మించి తండ్రితో సహవాసం కోల్పోయే సమయం ఆసన్నం కాబోతుంది.
ఆ దృశ్యమంతా ఆయన తలంపులలోనికి వచ్చినప్పుడు వేదన రెట్టింపు అయ్యింది.

ఆయన దేవుని కుమారుడైనప్పటికీ మనిషివలే శరీరాన్ని ధరించి యున్నాడు కాబట్టి, ఇవన్నీ సహజమే. అందుకే ఇట్లా తండ్రిని అడుగుతున్నాడు. ఈ సిలువ మరణం కాకుండా, ఈ లోకాన్ని రక్షించడానికి వేరేమార్గం వుంటే చూడండి అన్నట్లుగా. అయిననూ, ఇదే నీకిష్టమైతే నీ చిత్తమే జరిగించు అని ప్రార్దిస్తున్నాడు.

తండ్రి సంకల్పమే ఆయనలో నెరవేరాలని కోరుకొంటూ యేసు ప్రభువు వారు చేస్తున్న ఈ ప్రార్ధన మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మాదిరి.

ఒక్క విషయం!
దేవుని మార్గమే, ఆయన సంకల్పమే అత్యంత శ్రేష్టమైనది. దానిని అంగీకరించడం వలన కొన్ని సందర్భాలలో కొంత బాధ, నష్టంవాటిల్లినట్లు అనిపించినా, విధేయతతో వాటిని అంగీకరించినవారే ధన్యతలోనికి ప్రవేశిస్తారు.

అట్టి ధన్యతలోనికి మనమునూ ప్రవేశిద్దాం! అటువంటి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments