🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible Sermons by Pastor NAKKOLLA BALASUBRAMANYAM (DANIEL)
అది మామూలు బండ కాదు. అది 'సజీవమైన బండ'
అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును?
నిర్గమ 17:4
ఇశ్రాయేలీయులులను దేవుడు 430 సంవత్సరాల ఐగుప్తు దాస్యములో నుండి, మోషే నాయకత్వంలో విడిపించి వాగ్ధానదేశమునకు నడిపిస్తున్నాడు.
వారు మనుష్యులు మాత్రం ఐగుప్తును విడచివచ్చారు గాని, మనసంతా ఐగుప్తులోనే వుంది.
పగలు మేఘ స్థంభము, రాత్రి అగ్ని స్థంభమునిచ్చి నడిపిస్తూ, ఆకాశము నుండి, మన్నాను, పూరేళ్ళను కురిపించి పోషిస్తూ వాగ్ధాన భూమికి నడిపిస్తున్నాడు.
ఇంత చేసిన దేవుడు ఎడారిలో వారికి నీళ్ళివ్వలేడా?
ఎడారిలో మాకు త్రాగడానికి నీళ్ళు లేవంటూ, మోషే మీద తిరుగుబాటు చేస్తూ , మోషేను చంపడానికి సిద్ధమవుతున్నారు.
సుమారు 30 లక్షలమంది దాహాన్ని మోషే ఎట్లా తీర్చగలడు? అదీ అరణ్యములో.
ఇక మోషే దగ్గరున్నది ఒకే ఆయుధం.అదే ప్రార్ధన. అదే ఉపయోగించాడు. తిరుగులేని సమాధానాన్ని తీసుకొచ్చింది.
బండలోనుండి నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. వారంతా ఆ నీళ్ళు త్రాగి శారీరిక దప్పికను తీర్చుకున్నారు.
ఒక రాయిని తీసుకొని వెళ్లి, వంద సంవత్సరాలు నీటిలోవుంచి ఆతర్వాత పగలుగొట్టి చూస్తే? దానిలో ఒక్క నీటి బొట్టు కూడా కనిపించదు. అట్లాంటప్పుడు, ఈ బండనుండి నదీ ప్రవాహంవలే నీరు ఎట్లా ప్రవాహించగలిగింది?
అవును! అది మామూలు బండ కాదు. అది 'సజీవమైన బండ'.
ఆ బండ క్రీస్తే
1 కొరింది 10:4
అరణ్యములో ఇశ్రాయేలీయుల శారీరిక దాహాన్ని తీర్చిన ఆ బండే, కల్వరిలో తన రక్తాన్ని చిందించి సర్వమానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది.
సమస్యల సుడిగుండాలా? శోధనలు వేధనలా? ఇరుకులు ఇబ్బందులా? వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, మానసిక, ఆర్ధిక, ఆరోగ్య, ఆత్మీయ సమస్యలా? నీ సమస్యలేమైనా సరే?
నీవు ప్రార్ధించగలిగితే?
ఆ బండను ఆశ్రయించగలిగితే?
•'ఆ బండ' ఆపత్కాలములోనీకు ఆశ్రయమవుతుంది.
• కారుచీకట్లో నీకు కాంతి రేఖవుతుంది.
• కృంగిన నిన్ను లేవనెత్తి బలపరచ గలుగుతుంది.
• అపాయకాలంలో నీకు ఉపాయమవుతుంది.
• ఇరుకులో నీకు విశాలతనిస్తుంది.
• ఒంటరివైన నీకు తోడుగా వుంటుంది.
• నీ ప్రతీప్రశ్నకు సమాధానమవుతుంది.
• నీ కన్నీటిని నాట్యముగా మార్చగలుగుతుంది.
ఒక్కసారి ప్రార్ధించి చూడు.
ప్రార్ధించేవిధంగా ప్రార్ధించ గలిగితే?
ఆశీర్వాదపు ప్రవాహంలో కొట్టుకొంటూపోయి, ఆ శాశ్వత రాజ్యం చేరతాము.
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments