🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
*తగ్గింపుమనసుతో చేసే ప్రార్ధన*
"సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను."
లూకా 18:13
•సమాజంలో నీచమైనస్థితి.
•అంటరాని వాడు.
•వెలివేయబడిన జీవితం.
•నేను దేవాలయంలో అడుగు పెట్టడానికి అర్హుడను కాను. ఆయనను ప్రార్ధించే అర్హత నాకు లేదు. అని అనుకొని వుంటే? ఈరోజు మనము ఆ సుంకరిని గురించి మాట్లాడుకోవలసిన అవసరంలేదు.
ప్రార్ధించాలి అనే తలంపు మనకువస్తే చాలు. మెల్లగా సాతాను మనలోనికి ప్రవేశించి, నీవు ఆ తప్పు చేసావ్, ఈ తప్పు చేసావ్ అంటూ... నీవు ప్రార్ధించినా, దేవుడు వింటాడా? నీ టైం వేస్ట్ తప్ప అంటాడు. వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది మనకు. సరేలే! మనల్ని మనము సరిచేసుకున్నాక ప్రార్ధన చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇక వాడు గ్రేండ్ సక్సస్ అంటూ గంతులువేస్తాడు.
ప్రార్ధన మానేసాము అంటే? దేవునితో మాట్లాడడం మానేసినట్లే. దేవునికి దూరమై దయ్యముతో సహవాసం ప్రారంభమయినట్లే. సాతానుకు దగ్గరయ్యినట్లే.
మనము ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎంత ఘోర పాపి అయినా పశ్చాత్తాపముతో ఆయన దగ్గరకు వస్తే? ఎంత మాత్రమూ ఆయన త్రోసివేయడు.
సుంకరి దేవాలయములో చేరి ఒక చిన్న ప్రార్ధన చేసాడు.
"దేవా, పాపినైన నన్ను కరుణించు"
పశ్చాత్తాప హృదయంతో సుంకరి చేసిన చిన్న ప్రార్ధన నేరుగా దేవునికి చేరింది. తనను తాను హెచ్చించుకొనిన పరిసయ్యునికంటే, ఇతనిని నీతిమంతునిగా తీర్చింది.
పరిసయ్యుడు దేవుని ప్రార్ధించుటలేదు. తానెంతటి గొప్పవాడనో దేవునికి చెప్పుకొంటున్నాడు.
సుంకరి ప్రార్ధనలో భయం, రోధన, పశ్చాత్తాపం, తగ్గింపు ఇవన్ని మిళితమై వున్నాయి. ఇవే అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చాయి.
నేను తప్పు చేస్తున్నాను ఇక నా ప్రార్ధన దేవుడు వినడు అని ఒక నిర్ణయానికి వచ్చేసి, ప్రార్ధించడం మానేసి, దేవునికి దూరమైపోయావేమో?
సుంకరివలే ప్రార్ధిద్దాం. మనము అతిశయించడానికంటూ ఏమిలేదు. ఒకవేళ ఏదయినా వుంది అంటే? అది ఆయన దయవలనే. మనలను మనము తగ్గించుకొంటూ, మనకోసం తన ప్రాణం పెట్టిన ప్రియరక్షకుని సన్నిధిలో తగ్గింపు మనసుతో మోకరిల్లుదాం!
సుంకరివలే నీతి మంతులముగా తీర్చబడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments