🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
*ఆత్మతో ప్రార్ధించే ప్రార్ధన*
"ఆత్మతో ప్రార్థన చేతును"
1కొరింది 14:15
ఆత్మతో ప్రార్ధించే అనుభవం ప్రార్ధించడంలో అత్యున్నతమైన దశ.
ఆత్మతో ప్రార్ధించాలి అంటే? మొదట పరిశుద్ధాత్మను కలిగియుండాలి.
పరిశుద్ధాత్మను పొందడం ఎట్లా?
"మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు."
అపో. కార్యములు 2:38
మన పాప జీవితాన్ని విడచిపెట్టి, నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము, నీటి బాప్తిస్మం ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంఘమంతటికి తెలియజేయాలి. ఆ బాప్తీస్మం ద్వారా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు.
ఇట్లాంటి అనుభవంలోనికి ప్రవేశించినవారు ఆత్మతో ప్రార్ధించగలరు.
"అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.
రోమా 8:26
కొన్ని సందర్భాలలో హృదయమంతా వేధనతో నిండిపోతుంది. మాట్లాడడానికి మాటలురావు. దుఖం తప్ప మాట్లాడలేని స్థితి. దేవుని సన్నిధిలో మోకరిల్లినా ప్రార్ధించడానికి మాటలురావు.
ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత, దుఖమును బట్టి మనలోనున్న ఆత్మ మనపక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు.
ఆత్మ విజ్ఞాపన చేస్తూవుంటే? మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యముకాని మూలుగులు వెలువడుతాయి.
మనము అనుకోవచ్చు. అంతటి భారము కలిగి ప్రార్ధించడానికి అట్లాంటి సమస్యలేమీలేవు. జీవితం సాఫీగా సాగిపోతుందని. అవును! అది నిజమే కావొచ్చు.
కాని, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి!!
• నీ కుటుంబము, సంఘము, దేశ రక్షణకోసం భారముకలిగి ప్రార్ధించాలి.
• క్రీస్తుకోసం చిత్రహింసలు అనుభవిస్తూ వారి రక్తముతో సముద్రాలు సహితం ఎర్రగా మారుతున్నాయి, భగభగ మండే మంటల్లో సజీవదహనమై పోతున్న దేవుని బిడ్డలు లేక్కలెంతమంది. వారి కుటుంబాలకోసం, వారు విడచివెళ్ళిన పరిచర్యకోసం ప్రార్ధించాల్సిన భారం మనమీద వుంది.
•యేసు క్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎందరో వున్నారు. ఆయన నామమును ప్రకటించడానికి ఎందరో తమ కుటుంబాలను సహితం విడచి, సువార్తను మోసుకొని వెళ్తున్నారు. వారి నినిత్తం ప్రార్ధించాల్సిన భారం మనమీద వుంది.
ఆ భారము నీకుందా?
క్రీస్తుని చేరాలనే, ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యం నీకుందా?
అయితే, నశించి పోతున్న ఆత్మలపట్ల భారంకలిగి ప్రభుసన్నిధిలో ప్రార్ధిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments