BIBLE SERMONS by PASTOR NAKKOLLA BALASUBRAMANYAM

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

*ఏకీభవించి చేయు ప్రార్ధన*

మీలో ఇద్దరు తాము వేడుకొను
దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.
             మత్తయి 18:19

మనుష్యలు ఎంతమంది అయినా కావొచ్చు. మనసు మాత్రం ఒక్కటే కావాలి.

సంఘ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలు ప్రార్ధించ వలసివచ్చినప్పుడు, ఏకీభవించు చేయు ప్రార్ధన ద్వారా ఊహించని సమయంలో, పరలోకమందున్న దేవుని వలన జవాబు దొరుకుతుంది.

సంఘము యేరీతిగా ప్రార్ధిస్తే దేవునియొద్ద నుండి జవాబు పొందుకోగలదో తెలియజేసే మాట ఇది.           
•మనసులోనూ
•ఉద్దేశ్యాలలోను
•నమ్మకంలోనూ
•ప్రయోజనంలోనూ
ఐక్యత వుండాలి.

ప్రార్ధించేవారు
•అంశము చెప్పి ప్రార్ధించాలి.
•స్పష్టముగా
•క్లుప్త వాక్యాలతో
•సూటిగా
•విసుగు పుట్టించకుండా
ప్రార్ధించాలి.

ఏకీభవించువారు
•దిక్కులు చూడకుండా
•సణగకుండా
•ఓర్పుతో
•విసుగులేకుండా
•వినాలి
•మనసుతో ఏకీభవించాలి.

ప్రార్ధించే వారిలోగాని, ఏకీభవించే వారిలోగాని ఈ అంశములు లోపిస్తున్నాయి. అందుచే ప్రార్ధనకు జవాబు పొందుకోలేకపోతున్నాం.

దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒకరు ప్రార్ధిస్తూవుంటే కొందరు ఏకీభవించరు, ప్రక్కవారిని ఏకీభవించనివ్వరు. ప్రార్ధన ముగించాక మాత్రం అందరూ ఆమెన్ అంటారు. ఆమెన్ అంటే? 'అట్లా జరుగును గాక' అని అర్ధం. ఎట్లా జరుగును గాక? అసలు ఏమి ప్రార్ధించారో మనము వింటే కదా తెలియడానికి.

ఆమెన్ అనడం అలవాటయ్యింది. ప్రార్ధన కూడా అలవాటుగానే చేస్తున్నాముతప్ప, హృదయపూర్వకంగా చెయ్యలేకపోతున్నాము.  అందుకే పొందుకోలేకపోతున్నాము

దక్షిణ కొరియాలో "పాల్ యాంగి చొ" అనే దేవుని సేవకుడు ముగ్గిరితో కలసి ఏకీభవిస్తూ ప్రార్ధిస్తూ సంఘమును ప్రారంభించారు. నేటికి అది ప్రపంచములోనే అతి పెద్ద సంఘం అయ్యింది. ప్రతీ ఆదివారము ఇరవై ఐదు లక్షల మంది ఆ సంఘములో దేవునిని ఆరాధిస్తున్నారు. ఏకీభవించి ప్రార్ధించ గలిగితే విప్లవాత్మకమైన విజయాలు సాధించగలము.

మన కుటుంబాలుగాని, సంఘాలు గాని, అభివృద్ధి చెందాలంటే? ఏకీభవించి ప్రార్ధించే అనుభవం మన జీవితంలో తప్పక వుండాలి.

ప్రార్ధించే విధానాన్ని మార్చుకుందాం! ప్రతిఫలాన్ని అనుభవిద్దాం!

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక..!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments