🙏 *CHRIST TEMPLE- PRODDATUR*🙏
*నీతిమంతుని ప్రార్ధన*
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.
1పేతురు 3:12
నీతిమంతుని ప్రార్ధన చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే? ఈ ప్రార్ధనకోసం దేవుడే ఎదురు చూస్తాడట.
అట్లా ప్రార్ధించే నీతిమంతులు ఎవరు? నీతిమంతులను గురించి పరిశుద్ధ గ్రంధం ఏమి చెప్తుంది?
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు.అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.
రోమా 3: 11,12
అసలు నీతి మంతుడేలేడని పరిశుద్ధగ్రంధం సెలవిస్తుంది. మరళా ' నీతి మంతుని ప్రార్ధన దేవుడు ఆలకిస్తాడు' అని పరిశుద్ధ గ్రంధమే తెలియజేస్తుంది.
నీతిమంతుడే లేనప్పుడు, నీతిమంతుడెట్లా ప్రార్ధించగలడు?
ఈ ప్రశ్నకు కుడా పరిశుద్ధ గ్రంధమే సమాధానమిస్తుంది.
"నమ్మువారు "ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు."
రోమా 3:24
ఇప్పుడు మనకు స్పష్టంగా అర్ధమయ్యింది. నీతిమంతుడు లేడనేది వాస్తవం. అయితే, ఒక వ్యక్తి ఆయనను నమ్మడంద్వారా నీతి మంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతునిగా మారిన వ్యక్తి ప్రార్ధించగా దేవుడు ఆలకిస్తాడు.
"అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను"
యాకోబు 2:23
విగ్రహాలను అమ్ముకొనే వ్యక్తి ఆయనను నమ్మి నీతిమంతునిగా తీర్చబడ్డాడు.
ఇంతకీ మనము నమ్మవలసినది ఏమిటి?
•మనము పాపులమని
•కోడెలరక్తం, గొర్రెలరక్తం, మేకలరక్తం మనలను విమోచించ లేకపోయిందని.
•యేసయ్య నీకోసం , నాకోసం బలిగా మారడానికి ఈలోకానికి వచ్చాడని,
కల్వరిలో సిలువ వేయబడి, మరణించి, తిరిగిలేచి, ఆరోహణమై తండ్రి దగ్గరకు వెళ్ళాడని,
మనకు నివాసములు సిద్ధపరచి, మనలను అక్కడకు తీసుకొని వెళ్ళడానికి తప్పక రాబోతున్నాడని నమ్మాలి. ఈ విషయాలను నమ్మి నీపాపములు ఒప్పుకుంటే నీవు నీతిమంతుడవుగా తీర్చబడతావు.
ఒకనికి పోలీస్ ఉద్యోగం వస్తే? గవర్నమెంట్ అతనికి యూనిఫాం,గన్, జాయినింగ్ ఆర్డర్ ఇట్లాంటివి ఇస్తారు.
మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని మనకు ఎట్లా తెలుస్తుంది? దీనికోసం మనకు సర్టిఫికెట్స్ ఏమి వుండవు. అది దేవునికి మనకును గల వ్యక్తిగత సంబంధం. నీజీవితంలో అంతకుముందు ఎన్నడూలేని గొప్ప సమాధానాన్ని నీవు పొందుకుంటావు.
తర్వాత నీవుచేసే నీతిక్రియలు సంఘములో, సమాజములో నీతిమంతునిగా నిన్ను నిలువబెడతాయి.
ఆయన పరిశుద్దుడు కాబట్టి మనము పరిశుద్దముగా, నీతియుక్తముగా జీవిస్తూ ప్రార్ధించగలిగితే నేరుగా అది దేవుని చెవిని చేరుతుంది.
"అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను."
మార్కు 9:23
నమ్ముదాం! నీతిమంతులుగా తీర్చ బడదాం!
ప్రార్ధిద్దాం! ప్రతిఫలాలు అనుభవిద్దాం!!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments