✝️ CHRIST TEMPLE-PRODDATUR
- వారి కడుపే వారి దేవుడు..
నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు. ఫిలిప్పీయులకు 3: 19
వారి కడుపే – ఈ మాటకు బహుశా శరీర స్వభావం అని, లేదా ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధం అయిన శరీర సంబంధమైన జీవిత విధానమంతా అని అర్థం కావచ్చు. కొందరు యేసు “దేవుణ్ణి” పూజిస్తారు, దేవునికి లోబడతారు. మరియు బ్రతకడం కోసం అబద్ధాలు, మోసం, దొంగతనానికి కూడా ఒడిగడతారు. తాము క్రీస్తును అనుసరించేవారమని చెప్పుకుంటారు గానీ వేశదారులు తమ స్వంత కోరికలను అనుసరిస్తూ ఉంటారు. ఇలా వుండడం వలన దేవుడు చింతిస్తాడు..జాగ్రత్త..
ఒక ఎడారిలో ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు.వారు చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోగా చాలా ఆకలితో,దాహంతో ఉన్నవారికి మార్గమధ్యంలో ఎక్కడా ఎటువంటి ఆహారం దొరకలేదు.
కొంత దూరంలో ఒక మసీదు కనపడింది. అక్కడ చాలామంది ముస్లీములు విందు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ ఇద్దరు స్నేహితులు క్రైస్తవులు.అందులో ఒకడు మైఖేల్,ఇంకొకరు జాన్. మైఖేల్ తన స్నేహితునితో “జాన్ మనం చనిపోకుండా బ్రతికి ఉండాలంటే ఆ మసీదు దగ్గరికి వెళ్లి మనం కూడా ముస్లీములమని చెప్పాలి. అప్పుడే వాళ్ళు మనకి భోజనం పెడతారు. లేదంటే మనం ఆకలితో చావాల్సి వస్తుంది. నేను నా పేరు మహమ్మద్ అని చెప్తాను,నీ పేరు జాకీర్ అని చెప్పు” అన్నాడు.
అందుకు జాన్ “మనం క్రైస్తవులం,సత్యదైవాన్ని నమ్మినవారము. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేవారము. దేవుని వాక్యాన్ని పాటించేవారము. అనుకోని స్థితిలో ఇలా శ్రమకు అప్పగించబడ్డాము. ఇప్పుడు ఈ శ్రమకు తట్టుకోలేక ఒక పూట భోజనం కోసం మనము క్రైస్తవులమే కాదు అని చెప్పమంటున్నావ్. ఇలా మాట్లాడటం న్యాయమేనా ? బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి కూడా ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నావ్. ఆదిలోనే సాతాను అవ్వను శోధించడానికి ఎర వేసింది ఆహారాన్నే అని మర్చిపోయావా? ఎర్రటి కూర కోసం తన జేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏశావుని మర్చిపోయావా? ఆఖరికి లోక రక్షకుడు నలుబది దినాలు ఉపవాసం తర్వాత ఆయన్ని శోధించడానికి రాళ్లను రొట్టెలు చేసుకొమ్మని చెప్పిన సాతాను మాటలు మర్చిపోయావా? ప్రాణమయినా వదిలేస్తాను గానీ చచ్చేదాకా క్రైస్తవుడి లాగే బ్రతుకుతా!! అంతే తప్ప అబద్ధం చెప్పి నా దేవుడికి అవమానం తీసుకురాను.
అయినా కాకులతో ఆహారం పెట్టి పోషించిన దేవుడు మనల్ని కాపాడలేడని ఎలా అనుకుంటున్నావ్”అని అన్నాడు.
అప్పుడు మైఖేల్ “సరే!!నీ చావు నువ్వు చావు .నేను ఆకలితో చావడం కన్నా వాళ్ళతో కలిసిపోవడమే నయం” అని ఇద్దరు అక్కడికి చేరుకున్నారు.
అక్కడ ఇమామ్ అనే పెద్దాయన వారిని చూచి మీరు ఎవరని అడగగానే మైఖేల్ తనపేరు మహమ్మద్ అని తాను ముస్లీం అని సలాం చేసాడు.
పక్కనే ఉన్న జాన్ తన పేరు జాన్ అని తానొక క్రైస్తవుడనని తాము చాలదూరం నుండి ప్రయాణం చేసి అలసి పోయామని తమకేమైన ఆహారం ఉంటే పెట్టవలసిందిగా కోరాడు.
అందుకు ఇమామ్ భాయ్ “జాన్ గారు మీరు వెళ్ళి స్నానము చేసి రండి. మీకు విందు సిద్ధం చేయిస్తాము.
మహమ్మద్ భాయ్ మీరు కూడా స్నానం చేసి మసీదు లోపలికి రండి. ఎందుకంటే మీకు తెలియనిది కాదు,ఇవి రంజాన్ మాసం కనుక మీరు ఉపవాసంలో గడపాలి” అని అనగానే మైఖేల్ మొహంలో నెత్తురు చుక్కలేదు. వెంటనే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు.
నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
ప్రియమైన సంఘమా ..మీరు ఎలా వున్నారు? మైఖేల్ లా వున్నారా ? లేక జాన్ లా వున్నారా ? దేవుడు మిమ్మలిని కాపాడగల సమర్థుడు. కావున ఎల్లప్పుడూ దేవునికి మహిమకరంగా ఉండండి. విశ్వాసంతో మాట్లాడండి. దేవుడు అన్ని చూస్తూ వుంటాడు..అన్నీ వింటూ వుంటాడు. త్రియేక దేవుడు మిమ్ములను ధీవించును గాక.. ఆమెన్.
✝️ CHRIST TEMPLE-PRODDATUR