దేవుని మాటే - బైబిల్ వాక్యము
✝️ CHRIST TEMPLE-PRODDATUR - దేవుని మాటే - బైబిల్ వాక్యము. దేవుని వాక్యము సజీవమైనది. అది నిత్యమూ నిలచియుండును. ఆకాశమును, భూమియు గతించును గానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని యేసు క్రీస్తు మత్తయి 24:35 లో అన్నారు. 2 తిమోతి 3:16,17 లో దేవుని వాక్యము గురించి ఇలా వ్రాసి ఉంది. 2 తిమోతి 3:16,17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, 17ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. దేవుని వాక్యము దైవావేశము వలన కలిగినది. ఈ వాక్యము విన్నప్పుడు లేదా ధ్యానించినపుడు దేవుడు మనతో మాట్లాడతారు. మనకు వాక్యము ద్వారా దేవుడు ఉపదేశిస్తారు, మనల్ని ఖండిస్తారు, మన తప్పులు దిద్దుతారు. ఈ వాక్యము మన హృదయములో ఉన్న ఆలోచనలను, తలంపులను శోధిస్తుంది. హెబ్రీయులకు 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని ...